
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ అజేయ సెంచరీతో (124) చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు 5 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది.
తన్మయ్ అగర్వాల్‌తో పాటు రాహుల్ రాధేశ్ (22) క్రీజ్‌లో ఉన్నారు. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో అభిరథ్ రెడ్డి 35, రోహిత్ రాయుడు 0, కొడిమెల హిమతేజ 26, రాహుల్ సింగ్ 1, కే నితేశ్ రెడ్డి 22 పరుగులు చేసి ఔటయ్యారు. ఆంధ్ర బౌలర్లలో త్రిపురణ విజయ్ మూడు వికెట్లు పడగొట్టగా.. లలిత్ మోహన్, యారా సందీప్ తలో వికెట్ దక్కించుకున్నారు.
కాగా, ప్రస్తుత రంజీ సీజన్‌లో ఆంధ్ర, హైదరాబాద్ జట్లు ఎలైట్ గ్రూప్-బిలో ఉన్నాయి. ఈ గ్రూప్‌లో హైదరాబాద్ ఆరో స్థానంలో ఉండగా.. ఆంధ్ర జట్టు ఆఖరిదైన ఎనిమిదో స్థానంలో నిలిచింది. హైదరాబాద్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఓ మ్యాచ్‌లో గెలిచి, 2 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకోగా.. ఆంధ్ర ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడు పరాజయాలు ఎదుర్కొని, ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment