దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. పేలవ ఆటతీరు కొనసాగించిన తిలక్ సేన.. నాలుగో పరాజయంతో నాకౌట్ దశకు చేరే అవకాశాలను కోల్పోయింది.
గ్రూప్ ‘ఎ’లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో హైదరాబాద్ జట్టు మధ్యప్రదేశ్ చేతిలో 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 179 పరుగుల లక్ష్యఛేదనలో 14 ఓవర్లు ముగిసేసరికి 125/3తో పటిష్ట స్థితిలో కనిపించిన హైదరాబాద్ జట్టు ఆ తర్వాత మిడిలార్డర్ వైఫల్యంతో 16 బంతుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి పరాజయాన్ని మూట గట్టుకుంది.
రజత్ పాటిదార్ మెరుపులు
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన మధ్యప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. హర్ష్ గావ్లి (29 బంతుల్లో 51; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరవగా... సుభ్రాంషు సేనాపతి (42; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ రజత్ పాటిదార్ (16 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. హైదరాబాద్ బౌలర్లలో చామా మిలింద్, అజయ్‌దేవ్ గౌడ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.
తిలక్ వర్మను వెంటాడినన దురదృష్టం
అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ ఠాకూర్ తిలక్ వర్మ (34 బంతుల్లో 46; 1 ఫోర్, 2 సిక్స్‌లు), తన్మయ్ అగర్వాల్ (33 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించారు. దీంతో హైదరాబాద్ విజయందిశగా సాగిపోయింది. అయితే మధ్యప్రదేశ్ బౌలర్లు విజృంభించడంతో హైదరాబాద్ మిడిలార్డర్ కుప్పకూలింది.
మికిల్ జైస్వాల్ (0), ప్రతీక్ రెడ్డి (1), తనయ్ త్యాగరాజన్ (9) విఫలమయ్యారు. చివర్లో మిలింద్ (19; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడినా హైదరాబాద్ జట్టును గట్టెక్కించలేకపోయాడు.
మధ్యప్రదేశ్ బౌలర్లలో కుమార్ కార్తికేయ, కమల్ త్రిపాఠి చెరో 3 వికెట్లు తీశారు. మొత్తం 8 జట్లున్న గ్రూప్ ‘ఎ’లో 6 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ జట్టు రెండింటిలో గెలిచి, నాలుగింటిలో ఓడిపోయి 8 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. గురువారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో మిజోరంతో హైదరాబాద్ తలపడనుంది.
స్కోరు వివరాలు
మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్: సుభ్రాంషు సేనాపతి (సి) రాహుల్ బుద్ధి (బి) నితిన్ సాయి యాదవ్ 42; హర్ష్ గావ్లి (సి) తన్మయ్ (బి) అజయ్‌దేవ్ గౌడ్ 51; రజత్ పాటిదార్ (సి) రోహిత్ రాయుడు (బి) నితిన్‌సాయి యాదవ్ 36; హర్‌ప్రీత్ సింగ్ (సి) తిలక్ వర్మ (బి) మిలింద్ 12; వెంకటేశ్ అయ్యర్ (సి) తనయ్ త్యాగరాజన్ (బి) మిలింద్ 22; అనికేత్ వర్మ (బి) మిలింద్ 0; రాహుల్ బాథమ్ (సి) నితిన్‌సాయి యాదవ్ (బి) అజయ్‌దేవ్ గౌడ్ 5; కమల్ త్రిపాఠి (సి) తిలక్ వర్మ (బి) అజయ్‌దేవ్ గౌడ్ 1; కుమార్ కార్తికేయ (నాటౌట్) 0; అవేశ్ ఖాన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–92, 2–105, 3–142, 4–151, 5–151, 6–163, 7–165, 8–177.
బౌలింగ్: రవితేజ 4–0–42–0; మిలింద్ 4–0–33–3; అజయ్ దేవ్ గౌడ్ 4–0–20–3; తనయ్ 4–0–51–0; నితిన్ సాయి 4–0–29–2.
హైదరాబాద్ ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) కమల్ త్రిపాఠి (బి) కార్తికేయ 47; రోహిత్ రాయుడు (సి) హర్‡్ష (బి) అవేశ్ ఖాన్ 8; తిలక్ వర్మ (సి) అనికేత్ వర్మ (బి) కమల్ త్రిపాఠి 46; రాహుల్ బుద్ధి (సి) అనికేత్ వర్మ (బి) కార్తికేయ 20; మికిల్ జైస్వాల్ (సి) రజత్ (బి) కార్తికేయ 0; ప్రతీక్ రెడ్డి (సి అండ్ బి) కమల్ త్రిపాఠి 1; తనయ్ త్యాగరాజన్ (సి) కార్తికేయ (బి) కమల్ త్రిపాఠి 9; అజయ్‌దేవ్ గౌడ్ (సి) పాటిదార్ (బి) అవేశ్ ఖాన్ 12; మిలింద్ (సి) అనికేత్ వర్మ (బి) రాహుల్ బాథమ్ 19; రవితేజ (నాటౌట్) 1; నితిన్‌సాయి యాదవ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–31, 2–87, 3–125, 4–125, 5–127, 6–128, 7–143, 8–167, 9–168.
బౌలింగ్: అవేశ్ ఖాన్ 4–0–31–2; ఖెజ్రోలియా 2–0–30–3; రాహుల్ 3–0–27–1; కమల్ 4–0–31–3; వెంకటేశ్ అయ్యర్ 3–0–24–0; కార్తికేయ 4–0–25–3.
Comments
Please login to add a commentAdd a comment