వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో తిలక్ వర్మ(ఫైల్ ఫొటో)
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2023లో టీమిండియా అప్ కమింగ్ ఆటగాడు తిలక్ వర్మ (హైదరాబాద్ కెప్టెన్) సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో నిన్న జరిగిన మ్యాచ్‌లో (మేఘాలయ) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ (31 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడిన తిలక్.. జమ్ము అండ్ కశ్మీర్‌తో ఇవాళ (అక్టోబర్ 17) జరిగిన మ్యాచ్‌లోనూ అచ్చం అలాంటి ఇన్నింగ్సే ఆడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇవాల్టి మ్యాచ్‌లో 43 బంతులు ఎదుర్కొన్న తిలక్ 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జమ్ము అండ్ కశ్మీర్.. శుభమ్ పుండిర్ (58) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ, మిలింద్, చింట్ల రక్షణ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అనికేత్ రెడ్డి ఓ వికెట్ దక్కించకున్నాడు.
అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్.. తిలక్ వర్మతో పాటు మిగతా ఆటగాళ్లు కూడా తలో చేయి వేయడంతో 18.3 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. తన్మయ్ అగర్వాల్ (20), రోహిత్ రాయుడు (38), రాహుల్ సింగ్ (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేసి రాణించారు. జమ్ము అండ్ కశ్మీర్ బౌలర్లలో యుద్ద్‌వీర్ సింగ్, సాహిల్ లోత్రా తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment