తెలంగాణకు చెందిన ఓ టూరిస్టు పారాగ్లైడింగ్ చేస్తూ దుర్మరణం చెందారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులూలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి కారణమైన పారాగ్లైడింగ్ పైలట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సేఫ్టీ బెల్ట్‌ను తనిఖీ చేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన నవ్య(26)..మనాలి సమీపంలోని దోభీ గ్రామంలో పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందారు. టెన్డం ఫ్లైట్‌లో టేకాఫ్ అయిన నిమిషాలకే ఈ దుర్ఘటన జరిగింది. మానవ తప్పిందంగానే ప్రమాదం జరిగినట్లు పర్యాటకశాఖ అధికారులు పేర్కొన్నారు. పర్యాటకురాలి సేఫ్టీ బెల్ట్‌ను తనిఖీ చేయకుండానే అనుమంతించడంతో ప్రమాదం జరిగినట్లు తేలడంతో.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పారాగ్లైడింగ్ పైలట్‌ను పోలీసులు అరెస్ఠ్ చేసినట్లు తెలిపారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.
టూరిజం అధికారిణి సునైనా శర్మ మాట్లాడుతూ.. మానవ తప్పిదమే ఈ దురదృష్టకర సంఘటనకు దారితీసి ఉండొచ్చని తెలిపారు. పారాగ్లైడింగ్ చేసిన ప్రదేశం, ఎక్విప్‌మెంట్‌కు అనుమతి ఉందని, పైలట్‌కు రిజిస్ట్రేషన్ ఉందన్నారు. వాతావరణ సమస్యలు సైతం లేవన్నారు. ఈ ప్రమాదంతో ప్రస్తుతం దోభీ పారాగ్లైడింగ్‌ను తాత్కాలికంగా నిషేధించినట్లుట్లు తెలిపారు. ఐపీసీ సెక్షన్ 336, 334 కింద పైలట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారిణి చెప్పారు. మృతిచెందిన టూరిస్టు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చదవండి: Hyderabad:చాక్లెట్ ప్రియులకు అలర్ట్.. డైరీ మిల్క్‌లో పురుగు..
Comments
Please login to add a commentAdd a comment