పనాజీ: పారాగ్లైడింగ్ చేయాలని చాలామంది అనుకుంటారు. అయితే పారాగ్లైడింగ్ విషయంలో అప్పుడప్పడు ప్రమాదాలు చోటుచేసుకుంటుంటాయి. ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒక్కోసారి పర్యాటకులు ప్రమాదాలు బారిన పడుతుంటారు.
తాజాగా ఉత్తర గోవాలో పారాగ్లైడింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో నిర్లక్ష్యం వహించిన కారణంగా ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదంలో పారాగ్లైడింగ్(Paragliding) చేస్తున్న మహిళా పర్యాటకురాలితో పాటు కోచ్ మృతిచెందాడు. ఈ ప్రమాద వివరాలను పోలీసులు మీడియాకు తెలిపారు. శనివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కేరి గ్రామంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.
ఈ దుర్ఘటనలో పూణే నివాసి శివానీ డేబుల్ ఆమె శిక్షకుడు సుమన్ నేపాలీ (26) మృతిచెందారని, డేబుల్ పారాగ్లైడింగ్ కోసం బుకింగ్ చేసుకున్న 'అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ' చట్టవిరుద్ధంగా నడుపుతున్నారని పోలీసులు తెలిపారు. పారాగ్లైడర్ టేకాఫ్ అయిన వెంటనే అది లోయలో పడిపోవడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఉదంతంలో కంపెనీ యజమాని శేఖర్ రైజాదాపై మాండ్రేమ్ పోలీస్ స్టేషన్(Mandrem Police Station)లో కేసు నమోదైంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు
ఈ కేసులో కంపెనీతో పాటు దాని యజమానిపై నేరపూరిత హత్య కేసు నమోదు చేసినట్లు గోవా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ తెలిపారు. పోలీసు అధికారి పరేష్ కాలే తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు శేఖర్ రైజాదా ఉద్దేశపూర్వకంగా పైలట్‌కు లైసెన్స్ లేకుండా పారాగ్లైడింగ్ నిర్వహించడానికి అనుమతించాడు. ఫలితంగా పర్యాటకురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Uttar Pradesh: ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవ దహనం
Comments
Please login to add a commentAdd a comment