instructors
-
పారా గ్లైడింగ్‌లో ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం
పనాజీ: పారాగ్లైడింగ్ చేయాలని చాలామంది అనుకుంటారు. అయితే పారాగ్లైడింగ్ విషయంలో అప్పుడప్పడు ప్రమాదాలు చోటుచేసుకుంటుంటాయి. ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒక్కోసారి పర్యాటకులు ప్రమాదాలు బారిన పడుతుంటారు.తాజాగా ఉత్తర గోవాలో పారాగ్లైడింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో నిర్లక్ష్యం వహించిన కారణంగా ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదంలో పారాగ్లైడింగ్(Paragliding) చేస్తున్న మహిళా పర్యాటకురాలితో పాటు కోచ్ మృతిచెందాడు. ఈ ప్రమాద వివరాలను పోలీసులు మీడియాకు తెలిపారు. శనివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కేరి గ్రామంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.ఈ దుర్ఘటనలో పూణే నివాసి శివానీ డేబుల్ ఆమె శిక్షకుడు సుమన్ నేపాలీ (26) మృతిచెందారని, డేబుల్ పారాగ్లైడింగ్ కోసం బుకింగ్ చేసుకున్న 'అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ' చట్టవిరుద్ధంగా నడుపుతున్నారని పోలీసులు తెలిపారు. పారాగ్లైడర్ టేకాఫ్ అయిన వెంటనే అది లోయలో పడిపోవడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఉదంతంలో కంపెనీ యజమాని శేఖర్ రైజాదాపై మాండ్రేమ్ పోలీస్ స్టేషన్(Mandrem Police Station)లో కేసు నమోదైంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారుఈ కేసులో కంపెనీతో పాటు దాని యజమానిపై నేరపూరిత హత్య కేసు నమోదు చేసినట్లు గోవా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ తెలిపారు. పోలీసు అధికారి పరేష్ కాలే తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు శేఖర్ రైజాదా ఉద్దేశపూర్వకంగా పైలట్‌కు లైసెన్స్ లేకుండా పారాగ్లైడింగ్ నిర్వహించడానికి అనుమతించాడు. ఫలితంగా పర్యాటకురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై చర్యలు చేపట్టారు.ఇది కూడా చదవండి: Uttar Pradesh: ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవ దహనం -
ఇన్స్ట్రక్టర్లను ఆదుకోవాలి!
విద్యావ్యవస్థలో మార్పులు తేవడానికి తెచ్చిన విద్యాహక్కు చట్టం, నూతన విద్యా విధానాల లక్ష్యాలను పాలకులు పట్టించు కోకపోవడం వల్ల అటు విద్యార్థులూ, ఇటు ఇన్ స్ట్రక్టర్లూ తీవ్రంగా నష్ట పోతున్నారు. మూడు దశాబ్దాలకు పైగా కళా (ఆర్ట్), వృత్తి (క్రాఫ్ట్) విద్యలను విద్యార్థులకు దూరం చేశారు. విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసేందుకు విద్యాహక్కు చట్టం 2009లో వచ్చింది. ఈ చట్టం పేర్కొన్న ‘సమగ్ర శిక్ష’అందించేందుకు 2012 నుండి రెండు సార్లు ప్రభుత్వం ఆర్ట్, క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్లను నియమించింది. కానీ వీరంతా శ్రమదోపిడీకి గురౌతూ దశాబ్దకాలంగా అవమానాలను భరిస్తున్నారు. గత ప్రభుత్వం ఎటూ పట్టించుకోలేదు. నూతన ప్రభుత్వమన్నా ఆర్ట్, క్రాఫ్ట్ విద్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి. గత నాలుగు దశా బ్దాలుగా ఉపాధ్యాయ నియామకాల్లో ఆర్ట్, క్రాఫ్ట్ పోస్టులను నిర్లక్ష్యం చేశారు. రేవంత్నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తున్నదని నిన్న విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ రుజువు చేస్తోంది. ఇప్పటికే దాదాపు 1700 పోస్టులు ఈ కేటగిరీలో ఖాళీగా ఉన్నాయి. అయినా ఒక్క పోస్టును కూడా భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో ప్రస్తా వించలేదు. ప్రతీ పాఠశాలలో ఒకప్పుడు రంగస్థల వేదికలు ఉండేవి. విద్యార్థులు వార్షికోత్స వాలూ, జాతీయ పర్వదినాలు వంటి సంద ర్భాల్లో వీటి మీదే సాంస్కృతిక ప్రదర్శ నలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ వేదికలూ లేవు. అప్పట్లో ప్రతీ పాఠశాలలో ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, డ్యాన్స్‌లను బోధించేందుకు ఉపా ధ్యాయులను నియమించేవారు. కానీ ఈ పోస్టులను ఇప్పుడు దాదాపుగా మర్చి పోయారు. విద్యార్థి దశలోనే ఆర్ట్, వృత్తి విద్యలు అత్యంత అవసరమని 2009 విద్యా హక్కు చట్టం చెబుతోంది. భారతీయ సంప్ర దాయ కళలతో పాటు నైపుణ్యాలను మెరుగు పరిచి ‘మేకిన్ ఇండియా’కు ఊపిరిపోయాలని నూతన విద్యా విధానం కోరుతోంది. అయి నప్పటికీ దీని అమలులో గత రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. 2012లో అప్పటి ‘రాజీవ్ విద్యా మిషన్’ కింద పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్ల (పీటీఐ) పేరుతో ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, డ్యాన్స్ టీచర్లను విధుల్లోకి తీసు కున్నారు. కానీ వారిని ఫుల్‌టైమ్ ఉద్యోగులు గానే వాడుకుంటున్నారు. కేంద్రం ఇచ్చే వేతనాలను సరిగా ఇవ్వక పోగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 40 శాతం వాటాను కూడా ఏనాడూ ఇవ్వలేదు. వేసవి సెలవులలో టెర్మినేట్ చేసి తిరిగి తీసుకోవడా నికి నెలల తరబడి జాప్యం చేసి జీతాలు ఎగ్గొట్టింది ప్రభుత్వం. కరోనా సమయంలో 21 నెలల జీతాలు కేంద్రం ఇచ్చినప్పటికీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వమే నొక్కేసింది. వీరికి ఇచ్చే కేవలం రూ. 11,700 గౌరవ వేతనం ఇవ్వడా నికి ప్రభుత్వం అష్టకష్టాలూ పెట్టింది. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన కళా,వృత్తి విద్యలకు ఇప్పటికైనా ప్రాణం పోయాలి. నిబంధనల ప్రకారం పదేళ్లుగా పనిచేస్తున్నఇన్స్ట్రక్టర్లను రెగ్యులర్ చేయాలి. పార్ట్ టైంఇన్స్ట్రక్టర్లుగా పని చేస్తున్న వారిని ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్లుగా రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఉంది. - వ్యాసకర్త ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మొబైల్: 94904 01653 - కనుకుంట్ల కృష్ణహరి -
బడి తెరిచినా... భృతి లేదు
సాక్షి, ఇచ్ఛాపురం (శ్రీకాకుళం): ఇచ్ఛాపురం నియోజకవర్గం... ఈ నియోజకవర్గంలో ఉద్యోగులు విధులు నిర్వహించాలంటే పనిష్మెంట్గా భావిస్తారు. అందుకే ఇక్కడ పనిచేసే ఉద్యోగులు సైతం స్థానికంగా నివాసం ఉండకుండా సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. అందుకు కారణం ఈ ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధి తీవ్రంగా ఉండడమే. ఈ నేపథ్యంలో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాల్లో ఉన్న బడుల్లో విద్యార్థుల నిష్పత్తికి తగ్గ ఉపాధ్యాయులు లేకపోవడంతో ప్రభుత్వ బడుల్లో విద్య పడకేసింది. గతేడాది ఆగస్టు నెలలో అప్పటి జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి ప్రత్యామ్నయ చర్యలు చేపట్టాలని స్థానిక విద్యావంతులు కోరారు. దీంతో స్పందించిన ఆయన కిడ్నీ వ్యాధి ప్రభావిత మండలాల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులు మంజూరు చేసి, అందుకు రూ.కోటి 46 లక్షల నిధులు కేటాయించడం జరుగుతుందని ప్రకటించారు. అనుకున్న విధంగానే ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాలకు సంబంధించి ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు 400 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులు మంజూరు చేస్తున్నట్టు అప్పటి జిల్లా విద్యాశాఖాధికారి సాయిరాం ఆదేశాలు జారీ చేశారు. దీంతో రోస్టర్ విధానంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే(ఎస్జీటీ, భాషా పండితులు) అకడమిక్ ఇన్స్ట్రక్టర్లకు రూ.5 వేలు, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే (స్కూల్ అసిస్టెంట్) అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల కు రూ.7 వేలు చొప్పున్న గౌరవ వేతనాలు ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేసి గతేడాది సెప్టెంబర్ మొదటి వారంలో విధుల్లోకి తీసుకున్నారు. ఒక్క నెల కూడా అందని వేతనం తమ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని డీఎస్సీ సమయంలో తమ భవిష్యత్‌ను లెక్కచేయకుండా ఆయా పాఠశాలల్లో విధులు నిర్వహించిన వీరికి జిల్లా విద్యాశాఖాధికారి చుక్కలు చూపించింది. సెప్టెంబర్ నుంచి విద్యా సంవత్సరం పూర్తయిన ఏప్రిల్ 23 వరకు విధులు నిర్వహించారు. విద్యా సంవత్సరం పూర్తయి మరలా బడులు తెరుచుకున్నప్పటికీ వీరికి ఒక్కనెల కూడా వేతనాలు అందకపోవడంతో గమనార్హం. తమకు వేతనాలు అందుతాయో లేదో అన్న సందేహంలో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు కొట్టిమిట్టాడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేతనాలు అందించాలని అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు కోరుతున్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదు మూత్రపిండాల వ్యాధి ప్రభావిత మండలాల్లో గతేడాది సెప్టెంబర్ నెలలో నియోజకవర్గంలో 400 మంది అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో నియమించింది. మున్ముందు డీఎస్సీ ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది విద్యాసంవత్సరం పూర్తయిన ఏప్రిల్ 23 వరకు విధులు నిర్వహించాం. ఇంత వరకు ఒక్క నెల వేతనం కూడా అందలేదు. మా గురించి ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. – కె.మీనూ, అకడమిక్ ఇన్స్ట్రక్టర్, కేశుపురం యూపీ స్కూల్, ఇచ్ఛాపురం మండలం వేతనాలు విడుదల చేసి ఆదుకోండి ఉద్దానం ప్రాంతంలో ఉన్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గంలో 400 మంది అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను కలెక్టర్ చొరవతో విధుల్లో చేరారు. వీరి రాకతో పాఠశాలలు మరింత బలోపేతమయ్యాయి. ఇప్పటికి ఎనిమిది నెలలు దాటుతున్నా ఇంత వరకు ఒక్క నెల వేతనం కూడా రాకపోవడం దురదృష్టకరం. ఈ విషయమై ఉపాధ్యాయ సంఘాల ద్వారా వారికి త్వరగా వేతనాలు అందించాలని కోరుతున్నాము. – బి.శంకరం, ఆపస్ మండల ప్రధాన కార్యదర్శి, ఇచ్ఛాపురం మండలం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం ఇప్పటికే ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అధికారులు సైతం స్పందించారు. త్వరలో ప్రతీ అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌కు వేతనాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ విద్యాసంవత్సరానికి ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో కలెక్టర్ ఆదేశాలు మేరకు గతంలో పనిచేసిన విద్యా వలంటీర్లను ఈ నెల 12 నుంచి నియమించడం జరిగింది. – కురమాన అప్పారావు, మండల విద్యాశాఖాధికారి, ఇచ్ఛాపురం మండలం -
బూడిదలో పోసిన పన్నీరే
ఓ మత బోధకుడి దగ్గర ఓ వేణువు ఉంది. దాన్ని వాయించడానికి అతను కొన్నిసార్లు ఓ పర్వతం మీదకు వెళ్లేవారు. అప్పుడా దార్లో వెళ్ళేవారందరూ ఆ వేణునాదాన్ని విని మైమరచిపోతారు. అంతెందుకు ఆ వేణునాదానికి జింకలు ఆగిపోతాయి. ఎగురుతున్న పక్షులు ఆయన దగ్గరకు వచ్చి వాలుతాయి. కొన్నేళ్ళకు అతను చనిపోయారు. ఆ వేణువును చెట్టుకింద ఉంచి దాన్ని పూజించడం మొదలుపెట్టారు. ఒకటి రెండు తరాల తర్వాత ప్రజలు ఈ వెదురు వేణువులో ఏముంది దీన్ని ఇలాగే ఓ కొయ్యలాగా ఆరాధించడమేంటీ... దీన్ని మరింత గొప్పగా ఆరాధించాలి అనుకుని దాన్ని బంగారంతో అలంకరించారు. కొన్నేళ్ళు గడిచాయి. ఒకసారి కొందరు సంగీత కళాకారులు ఆ దారిలో వచ్చారు. ఆ వేణువు గురించి ఆ నోటా ఈనోటా విన్నారు. దాన్ని చూడడం కోసమే అక్కడికి వచ్చారు. బంగారంతోనూ వజ్రాలతోనూ అలంకరించిన ఆ వేణువును చూశారు. ఆ వేణువును ఆ సంగీత బృంద నాయకుడు తీసి చూశారు. ఆ తర్వాత దానిని వాయించి చూసారు. కానీ రవ్వంత నాదం కూడా రావడం లేదు. వేణువు రంధ్రాలన్నీ కప్పేసి ఉన్నాయి. దాన్నో అలంకారప్రాయమైన వస్తువుగా మార్చడం బాధాకరమని నొచ్చుకున్నారు. అంతెందుకు మహావీరుడి మాటలను, బుద్ధుడి మాటలను, ఏసు ప్రభువు మాటలనూ ఇలాగే కొందరు ఓ అలంకారప్రాయ వస్తువులుగా మార్చేసి ఫ్రేము కట్టి చూస్తున్నారే తప్ప వాటిలోని మంచిని నలుగురికీ చెప్పి ఉపయోగపడేలా చేయడం లేదన్నదే వాస్తవం. మహాత్ముల మాటలను ఆచరించడానికే తప్ప వొట్టినే పూజించడానికి కాదు అని తెలుసుకునే వరకూ ఎవరెన్ని ఆణిముత్యాలు చెప్పినా బూడిదలో పోసిన పన్నీరే... – యామిజాల జగదీశ్ -
పాపుల పరమ వైద్యుడాయన...
పన్నువసూలు చేసే వృత్తిలో ఉన్న మత్తయిని చూసి యేసుప్రభువు ‘నన్ను వెంబడించు’ అని పలకగానే అతను వచ్చి ఆయన శిష్య బృందంలో చేరాడు. ప్రభువు పలికిన ఆ ఒక్కమాట అతని జీవిత గమ్యాన్ని సమూలంగా మార్చేసింది. మత్తయి జీవితంలోకి ప్రభువు ఆహ్వానం ఎంతటి ఆనందాన్ని నింపిందంటే, అది వెల్లడించడానికి ఒక గొప్ప విందు చేసి ప్రభువును కూడా ఆహ్వానించాడు. నాటి రోమా ప్రభుత్వానికి తొత్తులైన పన్నులు వసూలు చేసే మత్తయి లాంటి సుంకరులను సాధారణ ప్రజలు ఏవగించుకునేవారు. శాస్త్రులు పరిసయ్యుల వంటి యూదు మత ప్రముఖులు ఎలాగూ రోమాప్రభుత్వానికి మద్దతుదారులు కాబట్టి వారు సుంకరులకు కూడా స్నేహితులు. అందువల్ల ఆ విందుకు పాపులుగా ప్రజలు ముద్రవేసిన ఎంతోమంది సుంకరులు, పరిసయ్యులు కూడా హాజరయ్యారు. యేసుప్రభువు ఎంతో ఆనందంగా వారందరితో కలిసి విందారగించడం యూదుమత ప్రముఖులైన పరిసయ్యులకు నచ్చలేదు. ‘మీ బోధకుడు సుంకరులతో, పాపులతో కలిసి భోజనం ఎందుకు చేస్తున్నాడు’ అని పరిసయ్యులు ఆయన శిష్యులను ప్రశ్నించారు. పరిసయ్యులు తమకు తాము చాలా నీతిమంతులమని భావిస్తారు. యూదు మత సంబంధమైన దాదాపు 615 నియమాలను ఎంతో నిష్టగా పాటిస్తారు. అవి పాటించని యూదులు, అన్యులతో కలిసి భోజనం చేయకూడదన్నది వాటిలో ఒకటి. అందువల్ల ఆ విందులో పరిసయ్యుల కోసం ఏర్పాట్లు ప్రత్యేకంగా చేసి ఉంటారు కానీ తమతో కలిసి భోంచేస్తాడనుకున్న యేసుప్రభువు సుంకరులతో కలిసి వారి విభాగంలో కూర్చోవడంతో వాళ్ళు ఈ వివాదానికి తెర లేపారు. ‘వైద్యుని అవసరం రోగులకే గాని ఆరోగ్యవంతులకు కాదుకదా. నేను నీతిమంతులను కాదు, పాపులనే పిలవవచ్చాను. బలిని కాదు, కనికరాన్నే కోరుతున్నాను. ఆ వాక్యభావమేమిటో ముందు నేర్చుకోండి’ అంటూ ఒక్కమాటతో ప్రభువు వారి నోళ్లు మూసివేశాడు (మత్త 9:9–13).నిజానికి ఆ రాత్రి విందులో సుంకరులను చూసీ చూడగానే ‘మీరెప్పుడు మారుతారు?’ అని ప్రభువు వారిని నిలదీస్తూ ప్రశ్నించాలి. అక్కడికక్కడే ఎడాపెడా ‘మారుమనస్సు’ అనే అంశంపై ప్రసంగం చేసి వారినందరిని గద్దించాలి. నిజానికి తన శిష్యుడిగా చేర్చుకున్న మత్తయికే ప్రభువు ఆ ప్రశ్న వెయ్యలేదు. అది ఎవరో తనను అతిథిగా ఆహ్వానించిన ఒక విందు స్థలం. అందువల్ల అక్కడి వాతావరణాన్ని పాడుచెయ్యకుండా, విందు సాంప్రదాయాన్ని గౌరవించి తన పద్ధతి చొప్పున ఆయన అందరితో కలిసిపోయాడు. అదే ఆయన సంస్కారం, గొప్పదనం. అందరినీ తిట్టి దూరం పెట్టగలిగిన స్థాయి తనకున్నా వాళ్ళందరినీ అక్కున చేర్చుకున్న ఎంతో విశాల హృదయమున్న గొప్ప రక్షకుడాయన. అయితే కొన్ని నియమాలను నిష్టగా పాటిస్తున్నారన్న మాటే గాని దేవుని హృదయాన్ని ఏమాత్రం ఎరుగని పరిసయ్యులు మాత్రం యేసుప్రభువు పాపులతో ప్రభువు కలవడమేమిటన్న వివాదాన్ని విందులో లేపి తమ కుసంస్కారాన్ని చాటుకున్నారు. ఈనాడు విశ్వాసులది కూడా అదే పద్ధతి. చర్చిల్లో తమకన్నా ఆత్మీయంగా తక్కువ స్థాయి గలవారొస్తే వారితో కలవరు, మాట్లాడరు సరికదా సూటిపోటిమాటలంటారు. చర్చిలు పాపుల వైద్యశాలలుగా ఉండాలని ప్రభువు నిర్దేశిస్తే, ‘నీతిమంతుల’ విశ్రామ స్థలాలు, సోషల్ క్లబ్బులుగా మారాయి. పాపిగా ముద్రపడ్డ వ్యక్తి చర్చికి పరుగెత్తుకెళ్లి అక్కడి విశ్వాసుల ప్రేమతో తడిసి పరివర్తన చెంది సమాజామోదం పొందే పరిస్థితి లేదు సరికదా, చర్చి దరిదాపుల్లోకి కూడా వెళ్లలేని పరిస్థితిని ఈనాటి పరిసయ్యుల్లాంటి విశ్వాసులు కల్పించారు. ఇదే ఈనాటి అతి పెద్ద విషాదం. ప్రభువు హృదయాన్ని తెలుసుకోకుండా ప్రభువు అనుచరులమని చెప్పుకునే ‘నకిలీ క్రైస్తవం’ బాగా ప్రబలుతోంది. చర్చిల్లో దేవుని మాటలు వినబడతాయి, కానీ దేవుని హృదయం, ఆయన ప్రేమ, కనికరం మాత్రం కనిపించడం లేదు. పాటలు, ప్రసంగాలు, ప్రార్థన చేసే కొద్ది సమయం వదిలేస్తే మిగతా సమయమంతా ‘గెట్ టుగెదర్’లు, సోషల్ క్లబ్బుల కార్యకలాపాలే! అన్యులతో కాదు కదా, కనీసం ఇతర చర్చిలవారితో కూడా చాలామంది విశ్వాసులు కలవరు, ఇతరులను తమతో కలవనివ్వరు. ఇలా తమను తాము గొప్పగా, ఎంతో ప్రత్యేకమైన వారుగా భావించుకునే సంçస్కృతిని యేసుప్రభువు ఏవగించుకుంటాడు, అలాంటి జీవనశైలికి తన ఆమోదాన్ని అసలే ఇవ్వడు. అపురూపం స్వర్ణముఖి శిల పంచాయతన పూజలో కీలకంగా ఉపయోగించే స్వర్ణముఖి శిల చాలా అరుదైన వస్తువు. దక్షిణభారత దేశంలో చిత్తూరు జిల్లా మీదుగా ప్రవహించే స్వర్ణముఖి నది ఒడ్డున స్వర్ణముఖి శిలలు అక్కడక్కడా దొరుకుతాయి. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా తలచే స్వర్ణముఖి శిలకు బంగారాన్ని ఆకర్షించే శక్తి ఉందని నమ్ముతారు. ముఖ్యంగా అక్షయతృతీయ నాడు స్వర్ణముఖి శిలను శాస్త్రోక్తంగా పూజించిన ఇంట సంపద దినదిన ప్రవర్ధమానంగా వృద్ధిచెందుతుందని పురాణాలు చెబుతున్నాయి. స్వర్ణముఖి శిలలు మామూలు రాళ్లమాదిరిగానే ఉన్నా, వాటిలో బంగారు వెండి కలగలసిన ఛాయ కనిపిస్తుంది. స్వర్ణముఖి శిలను ఇళ్లలోను, కార్యాలయాల్లోను, వ్యాపార ప్రదేశాల్లోనూ ఎక్కడైనా సరే, పూజమందిరం ఏర్పాటు చేసిన చోట ఉంచి పూజించుకోవచ్చు. స్వర్ణముఖి శిలకు నిత్య ధూపదీప నైవేద్యాలు సమర్పించే చోట సంతోషానికి, సంపదకు లోటు ఉండదు. స్వర్ణముఖి శిలను ఏదైనా సుముహూర్తంలో తీసుకువచ్చి, పూజమందిరంలో పసుపు వస్త్రంపై ఉంచి ధూప దీప నైవేద్యాలను సమర్పించి, పూజించాలి. దీనిని పూజించడం వల్ల ఆర్థిక పరిస్థితి వేగంగా మెరుగుపడుతుంది. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. అనాయాసంగా కార్యసిద్ధి కలుగుతుంది. – పన్యాల జగన్నాథదాసు -
కంప్యూటర్ విద్య మూత‘బడి’నట్లే!
ప్రభుత్వ పాఠశాలలో ఇన్‌స్ట్రక్టర్ల తొలగింపు! నిధులు వెచ్చించలేక చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం కంప్యూటర్ పరిజ్ఞానం లేని టీచర్లే ఇక బోధించాలి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కంప్యూటర్ విద్య దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అందిస్తున్న కంప్యూటర్ విద్య పథకానికి సంబంధించి ఐదేళ్ల కాలం పూర్తి కావడంతో దాని నిర్వహ ణ బాధ్యత ఇప్పుడు పూర్తిగా రాష్ట్రప్రభుత్వంపై పడింది. ఈ పథకానికి ఇన్నాళ్లు 25 శాతం నిధులు మాత్రమే వెచ్చించిన రాష్ట్రం ఇకపై 100 శాతం నిధులు కేటాయించాల్సి ఉంది. అయితే నిధులు వెచ్చించలేక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేస్తుంది.కంప్యూటర్లు, జనరేటర్ల నిర్వహణ, దాదాపు 12 వేల మంది ఇన్స్ట్రక్టర్లకు ప్రతి నెలా చెల్లించాల్సిన వేతనాల మొత్తం వెచ్చించేందుకు సిద్ధంగా లేమని చెబుతోంది. దీంతో రాష్ట్రంలోని ఐదువేల ఉన్నత పాఠశాలల్లో ఇన్నాళ్లు పనిచేసిన కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. పైగా నిర్వహణ సంస్థల నుంచి కంప్యూటర్లు, జనరేటర్లు అన్నింటిని సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వాధీనం చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఇటీవల డీఈవోలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఆయా స్కూళ్లలోని టీచర్లకు కంప్యూటర్ విద్య బోధనపై అవగాహన లేదు. పెద్దగా శిక్షణ పొందిన దాఖలాలు లేవు. దీంతో ఆ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను బోధించే వారు లేకపోవడంతో విద్యార్థులకు కంప్యూటర్ విద్య దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. కేంద్రం 75 శాతం నిధులను అందించి 2008-09 విద్యా సంవత్సరంలో కంప్యూటర్ విద్య పథకాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రం 25 శాతం నిధులను వెచ్చించి 7 కంప్యూటర్ నిర్వహణ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని ఇన్నాళ్లు పథకాన్ని నిర్వహించింది. ప్రస్తుతం ప్రాజెక్టు ఐదేళ్ల కాలం ఈ నెలతో పూర్తయింది. కంప్యూటర్ నిర్వహణ సంస్థల ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి. దీంతో ఆ సంస్థలు కంప్యూటర్ విద్యను నిలిపివేశాయి. ఫలితంగా వాటిల్లో పని చేస్తున్న 12 వేల మంది ఇన్స్ట్రక్టర్లు ఇప్పుడు ఉద్యోగాలు వదుకోవాల్సివస్తోంది. మరోవైపు ప్రభుత్వం నిధులను వెచ్చించేందుకు సిద్ధంగా లేకపోవడంతో కంప్యూటర్ విద్య బోధనను స్కూళ్లలోని టీచర్లే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. కంప్యూటర్ నిర్వహణ సంస్థలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏటా ఆయా స్కూళ్లలోని ఐదుగురు టీచర్లకు కంప్యూటర్ విద్యా బోధనపై ఆయా సంస్థలు శిక్షణ ఇవ్వాలి. కాని టీచర్లు దానిని నేర్చుకున్న దాఖలాలు పెద్దగా లేవు. దీంతో బోధన ఎలా అనే అంశంపై ఉన్నతాధికారులే తల పట్టుకుంటున్నారు. కనీసం ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకైనా రాష్ట్ర నిధులను వెచ్చించి ఇన్స్ట్రక్టర్లను కొనసాగిస్తే ఉపయోగం ఉంటుందని పేర్కొంటున్నారు.