విద్యావ్యవస్థలో మార్పులు తేవడానికి తెచ్చిన విద్యాహక్కు చట్టం, నూతన విద్యా విధానాల లక్ష్యాలను పాలకులు పట్టించు కోకపోవడం వల్ల అటు విద్యార్థులూ, ఇటు ఇన్ స్ట్రక్టర్లూ తీవ్రంగా నష్ట పోతున్నారు. మూడు దశాబ్దాలకు పైగా కళా (ఆర్ట్), వృత్తి (క్రాఫ్ట్) విద్యలను విద్యార్థులకు దూరం చేశారు. విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసేందుకు విద్యాహక్కు చట్టం 2009లో వచ్చింది. ఈ చట్టం పేర్కొన్న ‘సమగ్ర శిక్ష’అందించేందుకు 2012 నుండి రెండు సార్లు ప్రభుత్వం ఆర్ట్, క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించింది. కానీ వీరంతా శ్రమదోపిడీకి గురౌతూ దశాబ్దకాలంగా అవమానాలను భరిస్తున్నారు. గత ప్రభుత్వం ఎటూ పట్టించుకోలేదు.
నూతన ప్రభుత్వమన్నా ఆర్ట్, క్రాఫ్ట్ విద్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి. గత నాలుగు దశా బ్దాలుగా ఉపాధ్యాయ నియామకాల్లో ఆర్ట్, క్రాఫ్ట్ పోస్టులను నిర్లక్ష్యం చేశారు. రేవంత్‌నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తున్నదని నిన్న విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ రుజువు చేస్తోంది. ఇప్పటికే దాదాపు 1700 పోస్టులు ఈ కేటగిరీలో ఖాళీగా ఉన్నాయి. అయినా ఒక్క పోస్టును కూడా భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్‌లో ప్రస్తా వించలేదు.
ప్రతీ పాఠశాలలో ఒకప్పుడు రంగస్థల వేదికలు ఉండేవి. విద్యార్థులు వార్షికోత్స వాలూ, జాతీయ పర్వదినాలు వంటి సంద ర్భాల్లో వీటి మీదే సాంస్కృతిక ప్రదర్శ
నలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ వేదికలూ లేవు. అప్పట్లో ప్రతీ పాఠశాలలో ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, డ్యాన్స్‌లను బోధించేందుకు ఉపా ధ్యాయులను నియమించేవారు. కానీ ఈ పోస్టులను ఇప్పుడు దాదాపుగా మర్చి పోయారు.
విద్యార్థి దశలోనే ఆర్ట్, వృత్తి విద్యలు అత్యంత అవసరమని 2009 విద్యా హక్కు చట్టం చెబుతోంది. భారతీయ సంప్ర దాయ కళలతో పాటు నైపుణ్యాలను మెరుగు పరిచి ‘మేకిన్ ఇండియా’కు ఊపిరిపోయాలని నూతన విద్యా విధానం కోరుతోంది. అయి నప్పటికీ దీని అమలులో గత రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. 2012లో అప్పటి ‘రాజీవ్ విద్యా మిషన్’ కింద పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్ల (పీటీఐ) పేరుతో ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, డ్యాన్స్ టీచర్లను విధుల్లోకి తీసు కున్నారు. కానీ వారిని ఫుల్‌టైమ్ ఉద్యోగులు గానే వాడుకుంటున్నారు.
కేంద్రం ఇచ్చే వేతనాలను సరిగా ఇవ్వక పోగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 40 శాతం వాటాను కూడా ఏనాడూ ఇవ్వలేదు. వేసవి సెలవులలో టెర్మినేట్ చేసి తిరిగి తీసుకోవడా నికి నెలల తరబడి జాప్యం చేసి జీతాలు ఎగ్గొట్టింది ప్రభుత్వం. కరోనా సమయంలో 21 నెలల జీతాలు కేంద్రం ఇచ్చినప్పటికీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వమే నొక్కేసింది. వీరికి ఇచ్చే కేవలం రూ. 11,700 గౌరవ వేతనం ఇవ్వడా నికి ప్రభుత్వం అష్టకష్టాలూ పెట్టింది.
దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన కళా,వృత్తి విద్యలకు ఇప్పటికైనా ప్రాణం పోయాలి. నిబంధనల ప్రకారం పదేళ్లుగా పనిచేస్తున్నఇన్‌స్ట్రక్టర్లను రెగ్యులర్ చేయాలి. పార్ట్ టైంఇన్‌స్ట్రక్టర్లుగా పని చేస్తున్న వారిని ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్లుగా రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఉంది.
- వ్యాసకర్త ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మొబైల్: 94904 01653
- కనుకుంట్ల కృష్ణహరి
Comments
Please login to add a commentAdd a comment