paragliding
-
Paragliding: పారా హుషార్..
సాధారణంగా పారాగ్లైడింగ్ అనేది పర్యాటకప్రాంతాల్లో మాత్రమే ఉంటుందనే అపోహ చాలా మందిలో ఉంది. పైగా అది నేర్చుకుంటే ఏం వస్తుందిలే అన్న భావన కూడా ఉంది. అయితే మనకు పారాగ్లైడింగ్ గురించి కనీసం అవగాహన లేని సమయం నుంచే ఇందులో మెళకువలు నేర్చుకుని నగర యువతకు చుక్కానిగా నిలుస్తున్నారు హైదరాబాదీ ప్రభు సుకుమార్ దాస్. చిన్నతనం నుంచే గ్లాలో ఎగరాలనే తన కోరికను పారాగ్లైడింగ్తో సాకారం చేసుకున్నాడు.రెక్కలు తొడిగి... ప్రయాణాలు అంటే ఇష్టంతో ముందుగా బుల్లెట్ బైక్‌పై ఐదు దేశాలు తిరిగాడు. అదే సమయంలో పారాగ్లైడింగ్ గురించి తెలుసుకుని, నేర్చుకున్నాడు. అప్పటి నుంచి దేశ విదేశాల్లో పారాగ్లైడింగ్‌లో అద్భుతాలు సృష్టించాడు. పారాగ్లైడింగ్ చేస్తూ ఈజిప్టులోని గ్రేట్ పిరమిడ్స్, బ్రెజిల్‌లోని రియో క్రీస్ట్ విగ్రహం, అట్లాంటిక్ సముద్రంతో పాటు అమెజాన్ నది, నైలు నది, ఎర్ర సముద్రంపై ఎగిరిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా కర్ణాటక నుంచి రాజస్థాన్ వరకూ పాదయాత్రను ఎగురుకుంటూ ఫాలో అయ్యారు. దీంతో రాహుల్ గాంధీ తనను ప్రత్యేకంగా అభినందించారని సుకుమార్ సంతోషం వ్యక్తం చేశారు.ఎంతో మందికి శిక్షణ..పారాగ్లైడింగ్ చేస్తే వచ్చే అనుభూతి వేరని చెబుతున్న సుకుమార్.. వందలాది మందికి ఇందులో శిక్షణ ఇచ్చాడు. పారాగ్లైడింగ్‌లో కూడా మంచి భవిష్యత్తు ఉందని, ఎంతోమంది పారాగ్లైడింగ్‌లో శిక్షణ తీసుకుని విదేశాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నాడు. అందుకే ఇప్పుడు చాలామంది పారాగ్లైడింగ్ నేర్చుకునేందుకు ముందుకు వస్తున్నారని చెబుతున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కొందరు ఆదివాసీ పిల్లలకు పారాగ్లైడింగ్‌లో ఉచితంగా తర్ఫీదునిచ్చాడు. వారంతా నేషనల్ పారామోటార్ చాంపియన్íÙప్లో పాల్గొన్నారని, అప్పుడు వారి కళ్లల్లో చూసిన ఆనందం తనకు ఎంతో సంతృప్తినిచి్చందని సుకుమార్ చెబుతున్నాడు. ఎంతోమంది కలలను నిజం చేయడంలో ఉన్న ఆనందం మరెక్కడా దొరకదని పేర్కొంటున్నాడు. భవిష్యత్తులో ఎగిరే పోలీసులు..విపత్తుల వేళ పారాగ్లైడింగ్ చేసే వారికి ఎంతో డిమాండ్ ఉంటుందని సుకుమార్ చెబుతున్నాడు. భవిష్యత్తులో ఎగిరే పోలీసులు కూడా వస్తారని అంటున్నాడు. ఇప్పటికే తాము నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ బలగాలకు శిక్షణ ఇచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూడా పలువురు పోలీసులకు శిక్షణ ఇచ్చానని వివరించాడు. ఇక, తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక తదితర రాష్ట్రాలో ప్రత్యేక పండుగల సందర్భంగా పారాగ్లైడింగ్ చేస్తూ వాటి ప్రత్యేకతను ప్రజలకు తెలియజేసేలా సుకుమార్ ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ముఖ్యంగా తెలంగాణ అవతరణ దినోత్సవం, బతుకమ్మ, సంక్రాంతి పండుగల వేళ పారాగ్లైడింగ్తో వాటి ప్రాముఖ్యత తెలిసేలా చేశాడు. ఇక, మైసూరులో జరిగే దసరా ఉత్సవాల సందర్భంగా చేసే పారాగ్లైడింగ్‌లో ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాడు. -
సరస్సులో పడిపోయిన పారాగ్లైడర్.. వీడియో వైరల్
డెహ్రాడూన్:పారాగ్లైడింగ్ శిక్షణ తీసుకుంటున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు సరస్సులో పడిపోయిన ఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. పర్యాటక శాఖ నిర్వహిస్తున్న పారాగ్లైడింగ్ శిక్షణ కార్యక్రమంలో రిషి అనే వ్యక్తి అదుపుతప్పి తెహ్రీ సరస్సులో పడిపోయాడు.వెంటనే స్పందించిన ఎస్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు రిషిని రక్షించారు. పారాగ్లైడింగ్ చేస్తూ రిషి సరస్సులో పడిపోవడం, అతడిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బోటులో వచ్చి కాపాడడం చకచకా జరిగిపోయాయి. ఈ దృశ్యాలను కొందరు కెమెరాలో బంధించి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. కొద్దిసేపటికే ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: విమానంలో మహిళకు వేధింపులు.. వ్యక్తి అరెస్ట్ -
విషాదం: పారాగ్లైడింగ్ చేస్తూ హైదరాబాద్ టూరిస్టు మృతి
తెలంగాణకు చెందిన ఓ టూరిస్టు పారాగ్లైడింగ్ చేస్తూ దుర్మరణం చెందారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులూలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి కారణమైన పారాగ్లైడింగ్ పైలట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సేఫ్టీ బెల్ట్‌ను తనిఖీ చేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన నవ్య(26)..మనాలి సమీపంలోని దోభీ గ్రామంలో పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందారు. టెన్డం ఫ్లైట్‌లో టేకాఫ్ అయిన నిమిషాలకే ఈ దుర్ఘటన జరిగింది. మానవ తప్పిందంగానే ప్రమాదం జరిగినట్లు పర్యాటకశాఖ అధికారులు పేర్కొన్నారు. పర్యాటకురాలి సేఫ్టీ బెల్ట్‌ను తనిఖీ చేయకుండానే అనుమంతించడంతో ప్రమాదం జరిగినట్లు తేలడంతో.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పారాగ్లైడింగ్ పైలట్‌ను పోలీసులు అరెస్ఠ్ చేసినట్లు తెలిపారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. టూరిజం అధికారిణి సునైనా శర్మ మాట్లాడుతూ.. మానవ తప్పిదమే ఈ దురదృష్టకర సంఘటనకు దారితీసి ఉండొచ్చని తెలిపారు. పారాగ్లైడింగ్ చేసిన ప్రదేశం, ఎక్విప్మెంట్కు అనుమతి ఉందని, పైలట్‌కు రిజిస్ట్రేషన్ ఉందన్నారు. వాతావరణ సమస్యలు సైతం లేవన్నారు. ఈ ప్రమాదంతో ప్రస్తుతం దోభీ పారాగ్లైడింగ్‌ను తాత్కాలికంగా నిషేధించినట్లుట్లు తెలిపారు. ఐపీసీ సెక్షన్ 336, 334 కింద పైలట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారిణి చెప్పారు. మృతిచెందిన టూరిస్టు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: Hyderabad:చాక్లెట్ ప్రియులకు అలర్ట్.. డైరీ మిల్క్‌లో పురుగు.. -
97 నుంచి 77 కట్ చేస్తే... ఆ కరేజ్ ఇలా ఉంటుంది!
97 సంవత్సరాల వయసులో రెండు అడుగులు వేగంగా వేయాలంటేనే కష్టం. అలాంటిది ‘పారా మోటరింగ్ అడ్వెంచర్’ చేస్తే... మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన ఉషా తూసే 97 సంవత్సరాల వయసులో పారామోటరింగ్ సాహసం చేసి నెటిజనులు ‘వావ్’ అనేలా చేసింది. ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో 1.2 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ఆర్మీ పారా–కమాండో పైలట్స్, ఎయిర్ ఫోర్సు వెటరన్స్ ఆపరేట్ చేసే ఫ్లైయింగ్ రైనో పారామోటరింగ్ విభాగం బామ్మ చేత ఈ సాహసాన్ని చేయించింది. ‘97 ఇయర్ వోల్డ్ కరేజ్ అండ్ 20 ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్’ అనే కాప్షన్‌తో ‘ఎక్స్’లో ఈ వీడియో క్లిప్‌ను పోస్ట్ చేసింది. ‘సాహసంలో జీవనోత్సాహం కూడా ఉంటుంది అనే వాస్తవాన్ని ఆవిష్కరించే వీడియో ఇది’. ‘ఎంతోమందిని ఇన్స్పైర్ చేసే వీడియో’.... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి నిజానికి ఉషాకు సాహసం కొత్త కాదు. భర్త ఆకస్మిక మరణం, పిల్లల బరువు బాధ్యతల సమయంలో కూడా ఆమె డీలా పడిపోలేదు. ఒంటి చేత్తో కుటుంబాన్ని ధైర్యంగా పోషించింది. -
గాలిలో స్పృహ కోల్పోయి, గుడ్లు తేలేసి, తల వాల్చేసి.. నవ్విస్తున్న పారాగ్లైడర్
సోషల్ మీడియాలో తాజాగా పారాగ్లైడింగ్కు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఒక విదేశీయునికి సంబంధించినది. అతను పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో ఎంతో ఉద్వేగానికి గురయ్యాడు. అతను గాలిలో స్పృహతప్పి పోయాడు. స్పృహలోకి రాగానే ఏం చేసాడో చూస్తే ఎవరైనా నవ్వు ఆపుకోలేరు. ఈ 15 సెకన్ల వీడియోలో ఒక వ్యక్తి పారాగ్లైడింగ్ చేస్తూ కనిపిస్తాడు. అతని పరిస్థితి చూస్తే అతను పారాగ్లైడింగ్‌ని పూర్తిగా ఆస్వాదించడం లేదని మనకు అర్థం అవుతుంది. పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో అతని నోరు తెరిచి ఉంది. మెడ కూడా వేలాడుతోంది. వెనుకనున్న పారాగ్లైడింగ్ శిక్షకుడు అతని పరిస్థితి చూసి నవ్వుతున్నాడు. భయం లేదా అమిత ఉత్సాహం కారణంగా వ్యక్తి స్పృహ కోల్పోయే అవకాశం ఉంది. అతనిని చూసిన గైడ్ అతన్ని నవ్వించడానికి ప్రయత్నించాడు. ఆ వ్యక్తి స్పృహ వచ్చిన వెంటనే బిగ్గరగా అరవడం మొదలెడతాడు. ఈ వీడియోను సెప్టెంబర్ 13న @Enezator అనే వినియోగదారు Xలో భాగస్వామ్యం చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 78 వేలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. ఈ వీడియోను చూసినవారు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్.. ‘అతను ఉత్సాహం ఎక్కువై మూర్ఛపోయినట్లు నాకు అనిపించడం లేదని’ రాశారు. మరొకరు ‘భయంతో స్పృహతప్పిపోయాడు’ అని రాశారు. ఈ వీడియోను చూసిన కొంతమంది ‘తాము నవ్వు ఆపుకోలేకపోతున్నామని’ కామెంట్ చేశారు. ఇది కూడా చదవండి: ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది? fainted from excitement in the air pic.twitter.com/k7X80jze05 — Enezator (@Enezator) September 13, 2023 -
మంత్రి ఆదిమూలపు సురేష్ కు తప్పిన ప్రమాదం
-
ఈశాన్యంలో విరిసిన జాస్మిన్
రోడ్లు బాగుండవువాతావరణం సరిగా ఉండదు.అదీ గాక గంటల కొద్దీప్రయాణించే సమయం ఉండదు.అలాంటప్పుడు ప్రాణం పోసేమందులు అందాలంటే? డ్రోన్లే దారి.అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిననిక్ జాస్మిన్ మొత్తం ఈశాన్య రాష్ట్రాలకేమొదటి మహిళా డ్రోన్ ఆపరేటర్.గాల్లో మందులు పంపే ఈ సవాలునుఆమె సమర్థంగా స్వీకరించింది. ఈ సన్నివేశం ఎప్పుడూ జరిగేదే. రోడ్డు కూడా సరిగా లేని అటవీ ప్రాంతాల్లో విషజ్వరాలు పాకుతాయి. రోగి కదల్లేడు. అంబులెన్స్ రావడానికి సమయం పడుతుంది లేదా రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యి దగ్గరిలోని ఆస్పత్రికి వెళ్లాలన్నా గంటలు గంటలు పడుతుంది. లేదా ఏదో వాగు పొంగి రోడ్డు బ్లాక్ అవుతుంది. కొండ చరియలో, చెట్ల కొమ్మలో విరిగి పడతాయి. సరైన మందు పడితే రోగి ప్రాణాలు దక్కుతాయి. అప్పుడు ఏం చేయాలి?డ్రోన్ల ద్వారా మందులు చేరవేయడం సరైనదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహనకు వచ్చాయి. ఇందుకు అనేక స్టార్టప్ కంపెనీలు, డ్రోన్ల తయారీ సంస్థలు ప్రతిపాదనలు చేశాయి. సేవారంగంలో ఉన్న సంస్థలు కూడా ప్రభుత్వంతో భాగస్వామ్యం అవుతున్నాయి. దాంతో డ్రోన్ల ద్వారా మందుల పంపిణీ రెండేళ్ల క్రితం నుంచి ఉత్సాహంగా జరుగుతోంది. తెలంగాణలోని వికారాబాద్‌లో ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’ కార్యక్రమం మొదలెట్టడం అందరికీ గుర్తే. ఈశాన్య రాష్ట్రాలలో డ్రోన్లు ఈశాన్య రాష్ట్రాలలో కొండ ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాలకు ప్రాణాధార మందులు సకాలంలో చేరవేయడం ఎప్పుడూ సవాలే. కొండ దారుల్లో ప్రయాణం ఆలస్యం అవుతుంది. అదీగాక వాహనాలు వెళ్లలేని చోట్ల కూడా ఆదివాసీలు నివాసాలు ఉంటారు. వీళ్లను కాపాడాలంటే సరైన సమయంలో మందులు చేరవేయడం చాలా అవసరం. అందుకే ‘సస్టెయినబుల్ యాక్సెస్ టు మార్కెట్ అండ్ రిసోర్సెస్ ఫర్ ఇన్నోవేటివ్ డెలివరీ ఆఫ్ హెల్త్ కేర్’ (సమృద్) సంస్థ ఐపిఇ గ్లోబల్, నీతి అయోగ్‌లతో కలిసి మరికొన్ని దాతృత్వ సంస్థల భాగస్వామ్యంతో ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’ ప్రాజెక్ట్‌లో భాగంగా అక్కడ డ్రోన్ల ద్వారా మందుల పంపిణి మొదలెట్టింది. అరుణాచలప్రదేశ్‌లో సాగుతున్న ఈ కార్యక్రమంలో డ్రోన్ ఆపరేట్ చేస్తున్న తొలి మహిళ నిక్ జాస్మిన్ సేవలు అందిస్తోంది. ఆమె మొదట పారాగ్లైడర్ అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కమెంగ్ జిల్లా నుంచి నిక్ జాస్మిన్ డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేస్తుంది. ఇందుకోసం అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద మందులు నిల్వ చేసే మందులు నిల్వ చేసే ఫ్రీజర్లు, ఫ్రిజ్‌లు ఉన్న మినీ హెలిపాడ్ వంటి స్టేషన్ వద్ద ఆమె విధులు నిర్వర్తించాలి. యాప్ ద్వారా ఫలానా చోటుకు మందులు పంపాలి అనే సందేశం రాగానే స్పందించాలి. ‘డ్రోన్లు 400 అడుగుల ఎత్తు నుంచి ప్రయాణం చేస్తాయి. 20 నుంచి 40 కిలోమీటర్ల దూరం వరకూ కచ్చితంగా ప్రయాణించి లక్ష్యాన్ని చేరుకుంటాయి. రోజుకు పది ట్రిప్పులు వేయగలవు. మందుల ఉష్ణోగ్రతను మెయిన్‌టెయిన్ చేస్తూ ప్రయాణిస్తాయి. తమ సామర్థ్యాన్ని బట్టి బరువును మోస్తాయి’ అని తెలిపింది నిక్. ‘నేను ఎయిర్‌లైన్స్ టూరిజమ్ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. పారాగ్లైడింగ్ చేసేదాన్ని. మెడిసిన్ ఫ్రమ్ ది స్కై కోసం డ్రోన్ ఆపరేటర్ల ఉద్యోగం ఉందని తెలిసి అప్లై చేశాను. నా పారాగ్లైడింగ్ అనుభవం దృష్ట్యా ఉద్యోగం వచ్చింది’ అని తెలిపింది నిక్. ఊరు కదిలి వచ్చింది ఈ ఉద్యోగం కోసం నిక్కు శిక్షణ ఇచ్చారు. ‘డ్రోన్లోని అన్ని భాగాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన మందులు జాగ్రత్తగా ప్యాక్ చేయడం, ప్రీ ఫ్లైట్ పరీక్షలు, గాలి స్థితి, ఆడియో పైలట్ సిస్టమ్, జిపిఎస్ ట్రాక్ ఇవన్నీ సక్రమంగా ఉన్నాయనుకున్నాక డ్రోన్‌ను బయలుదేరదీయాలి’ అని తెలిపింది నిక్. ఆమె ఉద్యోగం మొదలెట్టిన రోజు ఆమెను చూడటానికి ఊరు ఊరంతా వచ్చింది. ‘విమానాలు దగ్గరి నుంచి ఎగరడం మా ఊరి వాళ్లు చూడలేదు. ఒక బుల్లి విమానం లాంటిది పైగా ఒక అమ్మాయి ఎగుర వేయడం వారికి వింత. అందుకని ఊరంతా కదిలి వచ్చి చూసింది’ అని నవ్వింది నిక్.‘ఇది సరదా ఉద్యోగం కాదు. చాలా బాధ్యత. నాకు ఈ ఉద్యోగం ఎంతో నచ్చింది’ అని చెప్పిందామె. -
పారాగ్లైడింగ్ చేస్తుండగా.. సరిగా ఓపెన్ కాకపోవడంతో విషాదం
ఒక వ్యక్తి పారాగ్లైడింగ్ చేస్తుండగా సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో విసత్‌పురా గ్రామంలోని పాఠశాలలో శనివారం సాయంత్రం 5.30 గంటలకు చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. దక్షిణ కొరియాకు చెందిన 50 ఏళ్ల షిన్ బైయాంగ్ మూన్ గుజరాత్‌లోని కడి పట్టణంలో పారాగ్లైడింగ్ చేస్తుండగా.. పారాగ్లైడర్ కనోపి సరిగా తెరుచుకోవడంలో విఫలమైంది. అంతే అతను ఒక్కసారిగా షాక్‌కి గురయ్యి బ్యాలెన్స్ కోల్పోయాడు. దీంతో అతను దాదాపు 50 అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయాడు. దీంతో అతడి స్నేహితులు హుటాహుటినా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ వ్యక్తి పడిపోతున్నానన్న షాక్‌లో గుండెపోటుకి గురవ్వడంతో మృతి చెందాడని వైద్యులు ధృవీకరించారు. ఆ కోరియన్ గుజరాత్‌లోని వదోదర పర్యటనలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. శనివారం సాయంత్రం సదరు కొరియన్ షిన్, అతని స్నేహితుడితో కలిసి పారాగ్లైడింగ్‌కి వెళ్లినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా కేసు నమోదు చేసి కొరియన్ ఎంబసీకి సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని అతడి స్వదేశానికి పంపే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. (చదవండి: క్రిస్మస్ చెట్టుకు బైడెన్ దంపతుల అలంకరణ.. ఫోటో వైరల్) -
భార్యను బలవంతంగా పారాగ్లైడింగ్ చేయిస్తే ఇలానే ఉంటుంది: ఫన్నీ వైరల్ వీడియో
Blaming her husband for taking on such adventures for fun: ఇటీవల కాలంలో భారతదేశంలో పారాగ్లైడింగ్ బాగా జనాదరణ పోందుతోంది. అంతేకాదు సాహస ప్రియులందరికీ ఇదే తొలి ఎంపికలో ఒకటిగా ఉంది. అయితే మనం ఇష్టపూర్వకంగా సాహసం చేయడం వేరు వేరేవాళ్ల బలవంతం మీద సాహాసయాత్ర చేస్తే వాళ్ల పరిస్థితి ఎంతలా ఉంటుందో చెప్పనవసరం లేదు. అచ్చం అలానే ఇక్కడొక భర్త తన భార్యకు ఇష్టం లేకపోయిన బలవంతంగా పారాగ్లైడింగ్ చేయిస్తే ఆమె చేసిన హడావిడి అంత ఇంత కాదు. అసలు విషయంలోకెళ్తే...ఒక మహిళ తన భర్త బలవంతంపై పారాగ్లైడింగ్‌కి వెళ్లింది. అయితే ఆమె సాహాసయాత్ర ప్రారంభంలోనే తనకు చాలా భయంగా ఉంది.. తాను వెళ్లను అని చెబుతూనే ఉంది. ఈ మేరకు యాత్ర ప్రారంభంకాగానే ఒకటే భయంగా అరుస్తూ చేతులతో కళ్లు మూసేసుకుని కేకలు వేస్తోంది. పాపం పారాగ్లైడింగ్ గైడ్ ధైర్యం చెప్పటానికి ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. పారాగ్లైడింగ్ పైకి వెళ్తున్నంత సేపు సదరు మహిళ భయంతో తన చేతులు మొద్దు బారిపోతున్నాయంటూ ఏడుస్తుంది. అయితే గైడ్ ఆమెను నవ్వించేందుకు జోక్‌లు వేస్తున్నప్పటికీ ఆమె తన భర్తను తిడుతూ..."దేవుడు నేను ఎందుకు పెళ్లి చేసుకున్న అతన్ని అంటూ భర్తను నిందించింది. అంతేకాదు నిన్ను చంపేస్తా అంటూ భర్తపై కోపంతో అరుస్తూ ఉంటుంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కుడా ఓ లుక్కేయండి. (చదవండి: దేశీయ వ్యాక్సిన్‌తో ఒమిక్రాన్‌కి చెక్! త్వరలో క్లినికల్ ట్రయల్స్) May be his frustrated husband sole intention to send his irritate wife over paragliding. 😁😃 https://t.co/Rwj1NRAO5e — Apeda Rondo (@rondo_apeda) January 17, 2022 -
వైరల్: వామ్మో నన్ను దింపేయండీ రో!
-
పారాగ్లైడింగ్.. పాపం భయపడింది!
ఖాద్దర్: మనలో చాలా మంది ఎగ్జిబిషన్‌కు వెళ్తారు. అక్కడ జైంట్ విల్ ఉంటుంది. అయితే.. కొంత మంది మాత్రమే, ధైర్యంచేసి ఎక్కుతారు. అది పైకి పోయి కిందకు వచ్చేవరకు కూడా భయపడుతూనే ఉంటారు. అయితే, పారాగ్లైడింగ్ అడ్వెంచర్ కూడా ఇలాంటిదే.. ఇది బాగా ఎత్తైన ప్రదేశంలో నుంచి చేస్తారు. దీన్ని డ్రైవ్ చేయాలంటే కొంచెం ధైర్యంకూడా ఉండాలి. ఇప్పుడు హిమచల్ ప్రదేశ్‌లో ఒక మహిళ చేసిన పారాగ్లైడింగ్ అడ్వెంచర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతొంది. దీనిలో.. ఖాజ్జర్ ప్రాంతానికి చెందిన మహిళ ధైర్యంచేసి పారాగ్లైడింగ్ కు సిద్ధమైంది. మొదట బాగానే ఉంది. క్రమంగా వేగం పెరిగి, ఒక్కసారిగా ఆకాశంలోకి వెళ్ళిపోయింది. దీంతో ఆమహిళ వెంటనే కళ్ళుమూసుకుంది. వెంటనే తన వెనుక ఉన్న గైడ్ ఆమెకు ధైర్యం చెబుతున్న కూడా ఆమె అవేమి పట్టించుకొవడంలేదు. ఆమె కళ్ళుతెరచి కిందకు చూసింది. అయితే , భయపడిపోయిన ఆ మహిళ వెంటనే హిందిలో ‘మూజే ఛోడ్‌దో..(నన్ను వదిలేయండి)’.. హల్లుజానేదో..(మెల్లగా పోనివ్వండి)..అంటూ హిందీలో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అయితే, ఈ వీడియోను ఇన్‌క్రెడెబుల్ హిమాలయా అనే ట్రావెల్ ఏజేన్సీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘మా అక్క ఉంది కాస్త మెల్లగా పోనివ్వండా...పాపం భయపడింది..బతికితే చాలనుకుంటొంది..కాబోలు..అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 2019లో ఇదే తరహాలో ఒక ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ఆ వీడియోను కోడ్ చేస్తూ తాజా వీడియోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. చదవండి: వైరల్: అమ్మో..పాము ఎంత భయంకరంగా దాడిచేసింది! -
భూమ్మీద నూకలుండాలి గానీ..
సిడ్నీ: భూమ్మీద నూకలుండాలిగాని ఎలాంటి ప్రమాదం నుంచైనా ప్రాణాలతో బయటపడొచ్చని మరోసారి తేలింది. ఆస్ట్రేలియాకు చెందిన 91 ఏళ్ల ఓ వృద్ధుడు పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. అంతెత్తు నుంచి సముద్రంలో పడిపోయిన ఆ పెద్దాయన స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన సిడ్నీ ఉత్తర తీరం సమీపంలో జరిగింది. ఆదివారం సాయంత్రం 6.00 గంటల సమయంలో వర్రీవుడ్ సమీపంలో పడిపోయిన తరువాత స్థానికులు అతన్ని బయటకు తీసుకువచ్చారని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న వైద్య సిబ్బంది వృద్ధుడికి స్వల్ప గాయాలు అయ్యాయని తెలిపారు. వృద్ధుడి కాలికి బ్యాండేజ్ కట్టు వేసి, ప్రథమ చికిత్స చేసి పంపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
కల నిజం చేసుకుని, గాల్లో విన్యాసాలు
-
కల సాకారం, గాల్లో విన్యాసాలు!
సాక్షి, పెద్దపల్లి/రామగుండం: కృషి ఉంటే మనిషి రుషి అవుతాడు. తాను అనుకున్నది సాధించే క్రమంలో అద్భుతాలు సృష్టిస్తాడు. అచ్చం అలాగే రామగుండంలో ఓ యువకుడు అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించాడు. స్వయంగా పవర్ పారా గ్లైడర్ రూపొందించి అందులో విహరించాడు. దాదాపు ఇరవై నిమిషాల పాటు గాల్లో విన్యాసాలు చేసి చూపరులను ఆకట్టుకున్నాడు. వివరాలు.. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రైల్వే కాలనీ కి చెందిన ఆడెపు అర్జున్‌కు పారా గ్లైడర్ రూపొందించాడు. జెన్కో క్రీడామైదానంలో ట్రయల్ రన్ నిర్వహించి సక్సెస్ అయ్యాడు. కాగా బీకామ్ చదివిన అర్జున్ చిన్నప్పటి నుంచి పారా గ్లైడింగ్ అంటే ఇష్టం.(చదవండి: పచ్చని అడవికి నెత్తుటి మరకలు) ఈ క్రమంలో స్వయంగా తానే పారా గ్లైడర్ రూపొందించాలనే పట్టుదలతో మూడేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందుకోసం అమెరికా, ఇటలీ నుంచి 15 లక్షల విలువైన ఉపకరణాలు తెప్పించుకుని తన ఆశయాన్ని నెరవేర్చుకున్నాడు. ట్రయల్ రన్లో భాగంగా 20 నిమిషాలు గాల్లోకి ఎగిరి విన్యాసాలు చేశాడు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ.. తన కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. రాజధాని హైదరాబాద్‌లో జరిగే అడ్వెంచర్స్ ఈవెంట్ల కోసం ఇతర రాష్ట్రాల నుంచి గ్లైడర్లను పిలిపించి వివిధ కార్యక్రమాలు చేపట్టే ప్రభుత్వం, తమలాంటి యువతకు కూడా అవకాశం ఇవ్వాలని కోరాడు. -
నన్ను కిందికి దింపేయండ్రా..
-
అనంతగిరిలో ఇక పారాగ్లైడింగ్..!
సాక్షి, అనంతగిరి: అనంతగిరి కొండలు పారాగ్లైడింగ్కు అనుకూలంగా ఉన్నాయని సిక్కిం రాష్ట్రానికి చెందిన ప్రతినిధులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌కు తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికను శుక్రవారం టూరిజం ఎండీకి అందజేస్తామని చెప్పారు. వివరాలు ఇలాఉన్నాయి.. వికారాబాద్ పట్టణానికి సమీపంలోని అనంతగిరిగుట్టను రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకంగా అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సీఎం ఆదేశాలు అందుకున్న రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సబితారెడ్డి గత నెల జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి వివరాలు సేకరించాలన్నారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే ఈ నెల 17న సిక్కిం రాష్ట్రానికి చెందిన అడ్వెంచర్ జోన్ ప్రతినిధులు పారాగ్లైడింగ్ ఏర్పాటుపై ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతగిరిలో పారాగ్లైడింగ్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. వీరు ప్రతిరోజు అనంతగిరి చుట్టూ ఉన్న కొండప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి నుంచి విహారం ఎలా ఉంటుందో చూస్తున్నారు. గాలి ఎలా సహకరిస్తుంది..? గ్లైడింగ్‌లో పారాషూట్లు దిగడానికి అనుకూలమైన స్థలాలను అన్వేషిస్తున్నారు. సిక్కిం నుంచి వచ్చిన వీరు ముందుగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌తో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే వీరికి అన్ని వసతులు కల్పించారు. వీరి వెంట వెళ్లి కొండల్లో గ్లైడింగ్ కోసం ప్రయత్నాలు చేశారు. కెరెళ్లి– జైదుపల్లి మధ్యలోని పాముల గుట్ట నుంచి నిర్వహించిన ట్రయల్‌రన్‌ను గురువారం ఆయన గుట్ట ఎక్కి స్వయంగా వీక్షించారు. అనంతరం పారాగ్లైడింగ్ ప్రతినిధులతో మాట్లాడారు. అనంతగిరి కొండలు పారాగ్లైడింగ్ అనుకూలంగా ఉన్నాయని వారు ఎమ్మెల్యేకు చెప్పారు. ఈ ప్రాంతం శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కూడా అనుకూలంగా ఉందన్నారు. పారాగ్లైడింగ్తో పాటు జీప్లైన్, మౌంటేన్ బైకింగ్ తదితర వాటిని ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికను శుక్రవారం రాష్ట్ర టూరిజం ఎండీకి అందజేస్తామని స్పష్టంచేశారు. టూరిజం సీనియర్ సిబ్బంది మనోహర్, వికారాబాద్‌కు చెందిన ప్రదీప్ వీరికి సహాయంగా ఉన్నారు. టీఆర్ఎస్ నేతలు ప్రభాకర్‌రెడ్డి, కమాల్‌రెడ్డి, నాయకులు విజయ్‌కుమార్, రాజమల్లయ్య, నవీన్, అనంత్‌రెడ్డి, రాంరెడ్డి, రంగరాజు, గోపి, షఫీ తదితరులు ఉన్నారు. -
చచ్చిపోతాను..కిందికి దింపేయ్రో!
-
పారాగ్లైడింగ్ చేస్తూ వ్యక్తి అదృశ్యం
సిమ్లా : పారాగ్లైడింగ్ చేస్తూ కొరియాకు చెందిన లీ తాయూన్(35) అనే వ్యక్తి కనిపించకుండాపోయాడు. ఈ సంఘటన మంగళవారం హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. టూర్ నిమిత్తం కంగ్రా జిల్లాలోని బిర్ బిల్లింగ్ వెళ్లిన లీ తాయూన్ సరదాగా పారాగ్లైడింగ్ చేస్తూ కనిపించకుండాపోయాడు. అయితే ఎలాంటి అనుమతిలేకుండానే లీ తాయూన్ పారాగ్లైడింగ్ చేశాడని, అతని కోసం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారని కంగ్రా జిల్లా కలెక్టర్ తెలిపారు. కాగా, అతడు పారాగ్లైడింగ్ చేయడానికి వాడిన పరికరాలు ముల్తాన్‌లోని ధర్మాన్లో చెట్లపై లభ్యమయ్యాయి. -
లైక్ డాడ్ లైక్ సన్
ప్యారాగ్లైడింగ్ చేయాలంటే గుండెలో దమ్ముండాలి. మరి.. ఆకాశంలో అంత ఎత్తున ఎగరడమంటే మాటలా? మహేశ్‌బాబుకి ఆ దమ్ముంది. అందుకే రివ్వున ఎగిరారు. డాడీకి తగ్గ సన్ గౌతమ్. ‘నేను కూడా చేయగలను’ అంటూ ధైర్యంగా ప్యారాగ్లైడింగ్కి రెడీ అయ్యాడు. న్యూ ఇయర్ సందర్భంగా మహేశ్ తన భార్యపిల్లలు నమ్రత, గౌతమ్, సితారలతో కలసి హాలిడే ట్రిప్ వెళ్లారు. ఒమన్‌లో భర్త, కొడుకు చేసిన సందడిని నమ్రత సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. అంతకుముందు మహేశ్ చాలాసార్లు ప్యారాగ్లైడింగ్ చేశారు. ఈసారి గౌతమ్ కూడా ఉత్సాహపడ్డాడు. తండ్రీ కొడుకులిద్దరూ గాల్లో కొద్ది సేపు చక్కర్లు కొట్టారు. ‘‘గౌతమ్ తొలిసారిగా ప్యారాగ్లైడింగ్ చేశాడు. అప్పుడే పిల్లలు పెద్దవాళ్లు అయిపోతున్నారు’’ అని ఈ సందర్భంగా నమ్రత పేర్కొన్నారు. ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత మహేశ్‌బాబు తిరిగి ‘భరత్ అను నేను’ సినిమా షూటింగ్లో పాల్గొంటారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్గా పరిచయం అవుతున్న ఈ సినిమా ఏప్రిల్ 27న రిలీజ్ కానుంది. -
అమ్మో.. స్మృతీ ఇరానీ ఎంత డేర్ చేశారు!
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇన్‌స్టాగ్రమ్‌లో చేరి కొద్ది రోజులే అవుతున్నా ఆమె ఫోస్ట్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు మాత్రం తెగ క్రేజ్‌ను సంపాధించుకుంటున్నాయి. ప్రస్తుతం టెక్స్టైల్స్ విభాగ మంత్రిగా పనిచేస్తున్న ఆమె ఆ శాఖకు సంబంధించిన అంశాలకంటే తన వ్యక్తిగత అంశాలు ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ అంశాలే పంచుకుంటున్నారు. అయితే, ఇప్పటి వరకు ఆమె పంచుకున్నవి ఒక ఎత్తయితే, తాజాగా పంచుకున్న వీడియో మరొక ఎత్తు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మృతి ఇరానీ నిజంగా ఎంత డేరింగ్ మహిళ అని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆమె హిమాచల్ ప్రదేశ్‌లోని బిర్ బిల్లింగ్ ప్రాంతంలో పారాగ్లిడింగ్‌కు వెళ్లారు. వందల ఎత్తులో ఎగురుతూ సరదాగా గడిపారు. పారాగ్లిడింగ్‌కు వెళ్లే వారిలో సాధారణంగా కాస్తంత భయం, బెరుగు కంగారు కనిపిస్తుంది. కానీ, ఆమె మాత్రం చాలా ఉల్లాసంగా ఈ వీడియోలో కనిపించారు. అయితే, ఈ వీడియో చూసిన కొందరు వేరే విధంగా కూడా కామెంట్లు చేశారు. #tbt Take off from the paragliding capital of India Bir Billing... And then there might be some who wud be wondering "Did she have to land!!!!" -
స్విట్జర్లాండ్‌లో చైతూ-పూజా సాహసాలు
మనం విజయంతో మంచి దూకుడుమీదున్న హీరో నాగచైతన్య.. స్విట్జర్లాండ్ వెళ్లి సాహసాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అక్కడ 'ఒక లైలా కోసం' చిత్రం షూటింగులో ఉన్న చైతు.. తనతో కలిసి నటిస్తున్న పూజా హెగ్డేను తీసుకుని పారాగ్లైడింగ్కు వెళ్లాడట. మిస్ ఇండియా కిరీటం గెలుచుకుని అటు నుంచి నేరుగా వెండితెర మీదకు వచ్చేసిన పూజా హెగ్డే.. టాలీవుడ్లో తన మొట్టమొదటి సినిమాకు అక్కినేని అందగాడిని ఎంచుకుంది. వీళ్లిద్దరు కలిసి నటిస్తున్న 'ఒక లైలా కోసం' స్విట్జర్లాండ్‌లో షూటింగ్ జరుపుకొంది. అక్కడే హీరో హీరోయిన్లు ఇద్దరూ కలిసి ఉత్సాహంగా పారాగ్లైడింగ్కు వెళ్లారట. నిజానికి పారాగ్లైడింగ్ అంటే చాలా సాహసంతో కూడుకున్న క్రీడ. తనకు ఎత్తు ప్రదేశాలకు వెళ్లాలంటే భయమని, అసలు చైతూ తనను పారాగ్లైడింగ్కు తీసుకెళ్తున్నట్లు కూడా తొలుత తెలియదని పూజా చెప్పింది. మొదట్లో చాలా భయం అనిపించినా, తర్వాత మాత్రం చాలా చాలా ఆనందంగా అనిపించిందని తెలిపింది. అంత ఎత్తు నుంచి స్విస్ అందాలను చూడటం అద్భుతంగా ఉందని పూజా హెగ్డే అంటోంది. చైతన్య చాలా మంచి సహనటుదని, తామిద్దరం ఒకే వయసు వాళ్లం కావడంతో తమ మధ్య మాటలు కూడా చాలా సరదాగా ఉంటాయని సంబరంగా చెప్పింది. చైతు తాను అనుకునేదానికన్నా చాలా మంచి డాన్సర్ అని, కానీ తన మీద మాత్రం అతగాడికి నమ్మకం లేదని బుంగమూతి పెట్టుకుంది. షూటింగ్ సమయంలో కూడా తన ఆహారపు అలవాట్ల విషయంలో చాలా కచ్చితంగా ఉంటూ మంచి ఫిట్నెస్ పాటిస్తాడని వివరించింది. (ఇంగ్లీషులో ఇక్కడ చదవండి)