
సిడ్నీ: భూమ్మీద నూకలుండాలిగాని ఎలాంటి ప్రమాదం నుంచైనా ప్రాణాలతో బయటపడొచ్చని మరోసారి తేలింది. ఆస్ట్రేలియాకు చెందిన 91 ఏళ్ల ఓ వృద్ధుడు పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. అంతెత్తు నుంచి సముద్రంలో పడిపోయిన ఆ పెద్దాయన స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన సిడ్నీ ఉత్తర తీరం సమీపంలో జరిగింది. ఆదివారం సాయంత్రం 6.00 గంటల సమయంలో వర్రీవుడ్ సమీపంలో పడిపోయిన తరువాత స్థానికులు అతన్ని బయటకు తీసుకువచ్చారని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న వైద్య సిబ్బంది వృద్ధుడికి స్వల్ప గాయాలు అయ్యాయని తెలిపారు. వృద్ధుడి కాలికి బ్యాండేజ్ కట్టు వేసి, ప్రథమ చికిత్స చేసి పంపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment