కాన్‌బెర్రా:పదహారేళ్లలోపు పిల్లలు సోషల్‌మీడియా వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. దీనిపై అమెరికా బిలియనీర్,టెస్లా అధినేత ఇలాన్ మస్క్ తీవ్ర విమర్శలు చేశారు. మస్క్ విమర్శలను ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ తప్పుపట్టారు. ఆస్ట్రేలియాలో ఇంటర్నెట్‌ను నియంత్రించడానికి ఈ నిషేధం బ్యాక్ డోర్‌లా ఉందని మస్క్ వ్యాఖ్యానించారు.
మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆంటోనీ స్పందించారు.ఇలాన్ మస్క్‌కు ఓ ఎజెండా ఉందని, ఆయన ‘ఎక్స్(ట్విటర్)’ యజమాని అయినందునే అలా మాట్లాడుతున్నారన్నారు. సోషల్ మీడియా నిషేధంపై ఎవరితోనైనా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆంటోనీ తెలిపారు.
కాగా,ఆస్ట్రేలియా ప్రభుత్వం గత వారం పిల్లల సోషల్‌మీడియా వాడకంపై నిషేధ బిల్లును దిగువ సభలో ప్రవేశపెట్టింది.ఈ బిల్లు దిగువ సభ ఆమోదం పొందింది. దీనికి సెనేట్ కూడా ఆమోదం తెలిపితే చట్టరూపం దాల్చనుంది.జనవరి నుంచి ట్రయల్ బ్యాన్,ఏడాది తర్వాత రియల్ బ్యాన్‌ను అమలు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment