
సిమ్లా : పారాగ్లైడింగ్ చేస్తూ కొరియాకు చెందిన లీ తాయూన్(35) అనే వ్యక్తి కనిపించకుండాపోయాడు. ఈ సంఘటన మంగళవారం హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. టూర్ నిమిత్తం కంగ్రా జిల్లాలోని బిర్ బిల్లింగ్ వెళ్లిన లీ తాయూన్ సరదాగా పారాగ్లైడింగ్ చేస్తూ కనిపించకుండాపోయాడు.
అయితే ఎలాంటి అనుమతిలేకుండానే లీ తాయూన్ పారాగ్లైడింగ్ చేశాడని, అతని కోసం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారని కంగ్రా జిల్లా కలెక్టర్ తెలిపారు. కాగా, అతడు పారాగ్లైడింగ్ చేయడానికి వాడిన పరికరాలు ముల్తాన్‌లోని ధర్మాన్‌లో చెట్లపై లభ్యమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment