ఖాద్దర్: మనలో చాలా మంది ఎగ్జిబిషన్‌కు వెళ్తారు. అక్కడ జైంట్ విల్ ఉంటుంది. అయితే.. కొంత మంది మాత్రమే, ధైర్యంచేసి ఎక్కుతారు. అది పైకి పోయి కిందకు వచ్చేవరకు కూడా భయపడుతూనే ఉంటారు. అయితే, పారాగ్లైడింగ్ అడ్వెంచర్ కూడా ఇలాంటిదే.. ఇది బాగా ఎత్తైన ప్రదేశంలో నుంచి చేస్తారు. దీన్ని డ్రైవ్ చేయాలంటే కొంచెం ధైర్యంకూడా ఉండాలి. ఇప్పుడు హిమచల్ ప్రదేశ్‌లో ఒక మహిళ చేసిన పారాగ్లైడింగ్ అడ్వెంచర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతొంది. దీనిలో.. ఖాజ్జర్ ప్రాంతానికి చెందిన మహిళ ధైర్యంచేసి పారాగ్లైడింగ్ కు సిద్ధమైంది. మొదట బాగానే ఉంది. క్రమంగా వేగం పెరిగి, ఒక్కసారిగా ఆకాశంలోకి వెళ్ళిపోయింది. దీంతో ఆమహిళ వెంటనే కళ్ళుమూసుకుంది.
వెంటనే తన వెనుక ఉన్న గైడ్ ఆమెకు ధైర్యం చెబుతున్న కూడా ఆమె అవేమి పట్టించుకొవడంలేదు. ఆమె కళ్ళుతెరచి కిందకు చూసింది. అయితే , భయపడిపోయిన ఆ మహిళ వెంటనే హిందిలో ‘మూజే ఛోడ్‌దో..(నన్ను వదిలేయండి)’.. హల్లుజానేదో..(మెల్లగా పోనివ్వండి)..అంటూ హిందీలో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అయితే, ఈ వీడియోను ఇన్‌క్రెడెబుల్ హిమాలయా అనే ట్రావెల్ ఏజేన్సీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘మా అక్క ఉంది కాస్త మెల్లగా పోనివ్వండా...పాపం భయపడింది..బతికితే చాలనుకుంటొంది..కాబోలు..అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 2019లో ఇదే తరహాలో ఒక ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ఆ వీడియోను కోడ్ చేస్తూ తాజా వీడియోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment