netigens
-
ఆ వీధి కుక్క చేసిన పని చూస్తే.. ఫిదా అవ్వాల్సిందే!
కుక్కలు మనుషుల పట్ల ప్రేమతో మెలిగిన ఘటనలు ఎన్నో చూశాం. ముఖ్యంగా తన సహజస్వభావమైన విశ్వాసంతో మనుషులకు ఇట్టే తొందరగా దగ్గరయ్యేపోయే జంతువు కూడా కుక్కే. అలాంటిది కుక్కలు ఇలా కూడా మనుషలను హెచ్చరిస్తాయా? అని ఈ వీధి కుక్కని చూస్తే అనిపిస్తుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో..రైలులో ఫుట్‌బోర్డ్‌పై కూర్చొని లేదా వేలాడుతూ కొందరూ వ్యక్తులు కనిపిస్తుంటారు. ప్రమాదకరమైన సరే లెక్కచేయకుండా అలానే వేలాడుతూ లేదా కూర్చొని ఉంటారు. అధికారుల చెప్పిన వాళ్ల తీరు మాత్రం మారదు. ముఖ్యంగా యువకులే ఎక్కువగా అక్కడ తచ్చాడుతూ ఉండేది. అయితే ఈ కుక్క అలా ఫుట్‌బోర్డ్ మీద కూర్చొవద్దంటూ సదరు ప్యాసింజర్లను హెచ్చరిస్తూ తన భాషలో మొరుగుతూ చెబుతోంది. అలా ఆ ట్రైయిన్ బోగిలు కదులుతున్న వరుసకు తాను కూడా ఫాలో అవ్వతూ అలా ఫుట్ బోర్డ్ మీద కూర్చొని ఏ ప్యాసింజర్ కనిపించినా చాలు "పో లోపలకి" అన్నట్లు మొరిగి హెచ్చరించింది. అందుకు సంబంధించిన వీడియోని ఐఆర్ఏఎస్ అధికారి అనంత్ రూపనగుడి ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ ఫుట్‌బోర్డ్‌పై కూర్చొని ప్రయాణిచడం ఎంత ప్రమాదకరం అని ఆ కుక్క అప్రమత్తం చేస్తున్న తీరుని చూసి అయిన మార్పు వస్తే బావుండనని అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. అయితే ఆ కుక్క ఇలా వింతగా ప్రవర్తిచడానికి గల కారణాలేంటిన్నది తెలియాల్సి ఉంది. ఐతే ఈ వీడియోని చూసిన చాలామంది నెటిజన్లు మాత్రం ఆ కుక్కకు సెక్యూరిటీ ఉద్యోగం ఇస్తే బావుండనని కోరగా, మరికొందరు మాత్రం బహుశా ఫుట్ బోర్టుపై ప్రయాణం ప్రమాదం అని చెప్పేందుకు చేస్తున్న ప్రయత్నం కాబోలు అని కామెంట్లు చేశారు. The best assistance rendered in a drive against the foot board travelling. 😀😛😂 #IndianRailways #SafetyFirst pic.twitter.com/vRozr5vnuz — Ananth Rupanagudi (@Ananth_IRAS) December 29, 2023 (చదవండి: అక్కడ నది హఠాత్తుగా నెత్తుటి రంగులోకి మారిపోయింది? రీజన్ ఏంటన్నది..?) -
గణేశుడి సన్నిథిలో సన్నీలియోన్.. నెటిజన్ల కామెంట్లు
విదేశాల్లో పుట్టి పెరిగిన భారత సంతతికి చెందిన సన్నీలియోన్ నీలిచిత్రాల్లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వెండి తెరపై కూడా ఎంతో పేరు తెచ్చుకున్న సన్నీలియోన్ పలు సినిమాలతో బిజీగా ఉంటుంది. ఆమెకు ఇక్కడ భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. భారతీయులకు ప్రధానమైన హిందూ పండుగల్లో గణేశ్ చతుర్థి ఒకటి. తాజాగా ఈ బ్యూటీ భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో గణేశ్ చతుర్థి ఉత్సవాల్లో పాల్గొంది. ముంబైలోని లాల్బాగ్ వద్ద గణేశుడి మండపానికి భర్త డానియల్ వెబర్‌తో కలిసి వెళ్లి పూజలు చేసింది. దీంతో ఆమెను చూసేందుకు భారీగా జనాలు అక్కడికి చేరుకున్నారు. ఆమెతో సెల్పీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఓ వైపు వర్షం పడుతున్నా ఏ మాత్రం లెక్కచేయకుండా నడుచుకుంటూ వెళ్లి బొజ్జ గణపయ్యను ఆమె దర్శించుకుంది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: వాల్తేరు వీరయ్య నటుడు బాబీకి స్నేహితుల నుంచే హత్య బెదిరింపులు!) సన్నీలియోన్ ఎక్కడున్నా భారతీయ మూలాలు ఉన్న స్త్రీ కాబట్టి ఆమెలో దైవభక్తి ఉందని నెటిజన్లు తెలుపుతున్నారు. తనకు ఊహ తెలీని టైంలో తప్పులు చేశానని సన్నీలియోన్ గతంలో ఇలా చెప్పింది. 'నేను చేసిన తప్పుల వల్ల ఇప్పుడు కొన్ని చోట్ల తల దించుకుంటున్నాను. ఎంతయినా భారతీయ మూలాలు నాలో ఉండడం వల్లేనేనేమో నేను ఇలా ఆలోచిస్తున్నాను కాబోలు.' అని సన్నీలియోన్ చెప్పింది. తాజాగా ఆమె భర్తతో పాటుగా బొజ్జ గణపయ్యను దర్శించుకోవడంతో ఆమెను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ##WATCH | Actor Sunny Leone and her husband seek blessing from Lord Ganpati at Mumbai's Lalbaugcha Raja Sarvajanik Ganeshotsav Mandal pic.twitter.com/cGPg3dphph — ANI (@ANI) September 22, 2023 -
కాజల్ మాకు ఆ అదృష్టం ఉందా?.. నెటిజన్ ప్రశ్నకు అదిరిపోయే రిప్లై
సినిమాలకు గుడ్ బై చెబుతుందంటూ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌పై భారీగానే పుకార్లు వచ్చాయి. వాటంన్నిటినీ పక్కకు నెట్టేసి ఇండియన్2, భగవంత్ కేసరి, సత్యభామ వంటి భారీ చిత్రాలతో తను బిజీగా ఉంది. ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడుగుతున్నటువంటి పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. చాలా రోజుల తర్వాత తన అభిమానులతో సరదాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె ముచ్చటించింది. తన పర్సనల్ లైఫ్, కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలను వారితో ఆమె పంచుకుంది. (ఇదీ చదవండి: ఈ కారణంతో కీర్తి, కృతి షాకింగ్ డెషిషన్ తీసుకోనున్నారా?) అయితే నేటిజన్స్ అడిగిన ప్రశ్నలన్నింటికీ కాజల్ ఎంతో ఓపికగా సమాధానం చెప్పింది. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఇలా ప్రశ్నించాడు 'మీరంటే నాకెంతో ఇష్టం.. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?' అని అడిగేశాడు కాజల్ అగర్వాల్ అతని ప్రశ్నకు సమాధానం చెబుతూ సారీ.. ఇప్పుడా అదృష్టం మీకు లేదు.. రెండున్నరేళ్ల క్రితమే ఆ అవకాశం మరొకరిని వరించింది. అంటూ సమాధానం చెప్పుకొచ్చింది. ఇంకేముంది ఇప్పుడిదే సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. తన స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లును ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు నీల్ కిచ్లు అనే కుమారుడు కూడా ఉన్నాడు. (ఇదీ చదవండి: Lust stories 2: తమన్నాకు ఊహించనంత రెమ్యునరేషన్?) -
అద్భుతం..అంతరిక్షంలో వికసించిన పువ్వు! ఫోటో వైరల్
అనంతమైన విశ్వం పరిశోధకులను, శాస్త్రవేత్తలను ఏదో రకంగా ఆకర్షిస్తుంది. అది కొత్త పరిశోధనలకు నాంది అయ్యి ప్రంపంచానికి సరికొత్త అద్భుతాలను అందించేందుకు దోహదపడుతుంది. అదీగాక అంతరిక్ష శాస్త్రవేత్తలు ఎన్నో కొత్త ప్రయోగాలతో సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికారు కూడా. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో మానవ అవసరాలకు సంబంధించిన ఎన్నో పరిశోధనలు చేశారు. అక్కడ మనం నివశించగలమా? మొక్కలు పెరుగతాయా? తదితరాలన్నింటి గురించి అధ్యయనాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అమెరికాకు చెందిన అంతర్జాతీయ అంతరిక్షసంస్థ అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకుని మొక్కలు పెరుతాయా లేఆదా అనే దానిపై 1970ల నుంచి పరిశోధనలు చేస్తున్నారు. ఆ పరిశోధన ఫలించింది. వారు పెంచిన ఓ మొక్క పెరగడమే గాక షష్పించింది. అత్యంత అసాధారణమైన వాతావరణంలో పుష్పించడం అనేది విస్మయానికి గురిచేసే విషయం. ఇది నాసా విజయానికి ప్రతీక. విశ్వ రహస్యాలను చేధించటానికి ఈ పరిశోధన ఉపకరిస్తుంది. అందుకు సంబంధించిన ఫోటోని నాసా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ జిన్నియా మొక్క అంతరిక్ష కేంద్రంలో వెజ్జీ సదుపాయంలో భాగంగా కక్ష్యలో పెరిగిందని ఓ క్యాప్షన్‌ని కూడా జోడించారు. ఈ మేరకు వ్యోమగామి కెజెల్ లిండ్‌గ్రెన్ మాట్లాడుతూ..మా అంతరిక్ష ఉద్యానవనం కేవలం ప్రదర్శ కోసం పెంచటం లేదని కక్షలో మొక్కలు ఎలా అభివృద్ధి చెందుతాయో తెలుసుకోవడం తోపాటు భూమి నుంచి పంటలు ఎలా పెంచాలో తెలుసుకునేందుకు ఉపకరిస్తుందన్నారు. ఇప్పటి వరకు పాలకూర, టొమాటో, చిల్లీ పిప్పర్ వంటి వాటిని అంతరిక్ష కేంద్రంలో పెంచినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, నాసా షేర్ చేసిన ఫోట్ నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఇది అద్భుతం, పైగా అందమైనది అని ప్రశంసించగా, మరికొందరూ ఈ మొక్క పెరగడానికి ఎంత సమయం తీసుకుందని ప్రశ్నస్తూ పోస్టులు పెట్టారు. ఈ ఫోటోకి ఆర లక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి. View this post on Instagram A post shared by NASA (@nasa) (చదవండి: ఐస్ క్రీమ్ తింటున్న కొద్దీ ఇంకా తినాలని ఎందుకు అనిపిస్తుంది?) -
ChatGPT రెసిపీ వైరల్..ఏలియన్స్ కంటే ఏఐ చాలా డేంజర్ బ్రో!
సాక్షి, ముంబై: ఇపుడు ఎక్కడ చూసినా చాట్‌జీపీటీ కబుర్లే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా చాట్‌బాట్ అనేక ప్రశ్నలకు సమాధాన మివ్వడం, వ్యాసాలు ఇవ్వడం మొదలు వంటల రెసిపీలను అందిస్తూ ఇంటర్నెట్ సంచలనంగా మారింది. సాధారణంగా గూగుల్‌ని మనం అడిగే ప్రశ్నలతోపాటు, అసైన్మెంట్లపై పని చేయడం ఇమెయిల్స్ ఇలా చాలా చాలా పనులను చాలా ఈజీగా బాట్ చేస్తోంది. తాజాగా చాట్‌జీపీటి సాయంతో ఒక కొత్త వంటకాన్ని తయారు చేసిన యువకుడు నెటిజన్లు విపరీతంగా ఆకర్షిస్తున్నాడు. అదీ మిగిలిపోయిన వాటినుంచి డెలీషియస్ డిష్‌ను తయారు చేసుకున్న వీడియోను షేర్ చేశాడు. (ఇదీ చదవండి: భారీగా లిథియం నిక్షేపాలు: ఇక భవిష్యత్తంతాఅద్భుతమే! ఆనంద్ మహీంద్ర) కంటెంట్ క్రియేటర్ శుభమ్ జోషి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేశారు. క్లిప్‌లో, బంగాళదుంపలు, టమోటాలు, ఉల్లిపాయలు, మసాలాలు, బ్రెడ్, జున్ను, ఉప్పు, మిరియాలు పాలు వంటి తన వద్ద ఉన్న పదార్థాలతో ఏమి చేసు కోవచ్చని అతను బోట్‌ని అడిగాడు.ను "చీజ్ పొటాటో అండ్ వెజిటబుల్ బేక్" సిద్ధం చేస్తానని చెప్పింది చాట్‌జీపీటి. ఇక అంతే.. ఓవెన్‌ను 180 డిగ్రీల సెల్సియస్‌కు ప్రీహీట్ చేయడం మొదలు, ప్రతి దశనూ వివరించింది. అలా తయారైన వంటకాన్ని ఆస్వాదించి వావ్....అంటూ శుభం ఆరగించాడు. దీనిపైన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జనవరి 21న షేర్ ఈ వీడియోను షేర్ చేయగా ఇప్పటివరకు ఐదు మిలియన్లకు పైగా వ్యూస్, రెండు లక్షలకు పైగా లైక్‌లను సంపాదించింది. (రెడిక్యులస్..నా పాపులారిటీ తగ్గుతోందంటావా? ట్విటర్ ఉద్యోగిపై వేటు) అయితే దీనిపై విభిన్నంగా స్పందించిన వారూ లేకపోలేదు.. "ఏలియన్స్ కంటే ఏఐ చాలా ప్రమాదం," అని, దీనికి ఏఐ ఎందుకు బాస్..కామన్ సెన్స్ ఉంటే చాలు అని ఒకరు, "పాలు, ఉల్లిపాయలు శత్రువులు బ్రో, వాటిని ఎప్పుడూ కలిపి ఉపయోగించకూడదంటూ ఇంకొరు కమెంట్ చేశారు. ‘ఓరి దేవుడా.. నువ్వు మనిషివి భయ్యా నీ తెలివితేటలను ఉపయోగించుకో! దీని మీద ఆధారపడితే నీ మెదడు పనిచేయడం మానేస్తుంది’ అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. View this post on Instagram A post shared by Shubham Joshi (@onlyshubhamjoshi) -
చంద్రబాబు వంటి చెలికాడు ఈ ముజ్జగాలలో ఎక్కడున్నాడు?
ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని చంద్రబాబు కలవడంపై ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. గత కొన్నాళ్లుగా అన్ని రకాల ఎన్నికల్లో ఓడి ప్రజల్లో పూర్తిగా విశ్వసనీయత కోల్పోయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఢిల్లీలో ఎంత ఘనకీర్తి ఉందో టీడీపీ కార్యకర్తలే అడగకముందే చెబుతారు. అంతేందుకు సొంత పార్టీ ఎంపీలే చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ముందుకు రావడానికి కూడా ఇబ్బంది పడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పట్ల మోదీ అపారమైన వినయ విధేయతలు ప్రదర్శించారంటూ ఎల్లో మీడియాలో వార్తలు రావడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై రాసిన వార్తలకు సంబంధించి ఎల్లో మీడియాకు చురకలంటించారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇంకెన్నాళ్లు అబద్దాలు చెప్పి జాకీలేసి లేపుతారంటూ నేరుగా ప్రశ్నించారు. ఎన్నిఎలివేషన్స్ ఇస్తారు? ఎన్ని అబద్దాలు చెప్పి జాకీలేసి లేపుతారు? ప్రధాని బతిమిలాతున్నట్లు…బాబుకే టైంలేక ఢిల్లీ వెళ్ళనట్లు పచ్చ మీడియా ప్రచారం. "అక్క"ఆరాటమే తప్ప "బావ" బతకడన్నట్లుంది పచ్చ మీడియా పరిస్థితి. #KickBabuSaveAP pic.twitter.com/UcfDE8xVXq — Vijayasai Reddy V (@VSReddy_MP) August 7, 2022 మరో రాజకీయ విశ్లేషకులు ఇలపావులూరి మురళీ మోహన రావు తనదైన శైలిలో చంద్రబాబు పర్యటనను విశ్లేషించారు. బాబును చూడగానే మోదీ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కళ్ళు జలపాతాలయ్యాయి. దేహం మీదున్న అన్ని వెంట్రుకలు లేచి నిలబడ్డాయి. "బాబూ...." అని పెద్దగా అరిచాడు. చంద్రబాబు మాత్రం పట్టించుకోలేదు. మామూలుగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, ఇతర నాయకులతో మాట్లాడుతున్నారు. ఫరూక్ అబ్దుల్లా అయితే బాబు చేయిని వదలలేదు. "వంకాయవంటి కూరయు, పంకజముఖి సీతవంటి పత్నియు, చంద్రబాబు వంటి చెలికాడు ఈ ముజ్జగాలలో ఎక్కడున్నాడు?" అంటూ శివరంజని రాగంలో పాటను ఆలపించారు. అక్కడున్న జాతీయనాయకులు అందరూ బాబును చుట్టుముట్టారు. అభినందలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అయితే బాబు మాత్రం చలించలేదు. చాల గుంభనంగా ఉండిపోయారు. ఇక అక్కడ తనకు బాబును కలవడానికి వీలుకాదని భావించిన మోదీ బాబు చేయిని ఆప్యాయంగా పట్టుకుని తెరవెనక్కు తీసుకెళ్లారు. "బాబూ..స్నేహితుల దినోత్సవం రోజున అక్కడినుంచి ఇంతదూరం వచ్చి నన్ను కలిసి నిజమైన స్నేహితుడివి అనిపించుకున్నావు. గతంలో నువ్వు నన్ను అనేకంగా ఛండాలంగా తిట్టావు. నా భార్యను, అమ్మను కూడా దూషించావు. నన్ను మోసగాడిని అన్నావు. అయినా నేను గత ఐదేళ్లలో నిన్ను ఒక్కమాట కూడా అనలేదు. ఎందుకంటే నీ సంగతి నాకు తెలుసు. స్నేహానికి, బంధుత్వానికి ప్రాణం ఇచ్చేవాడివి నీవు. నీ మనసు హెరిటేజ్ వెన్న అని నాకు బాగా తెలుసు. అందుకే నీ స్నేహం కోసం అయిదేళ్లనుంచి తపస్సు చేస్తున్నాను. ఇన్నాళ్లకు నన్ను కరుణించావా బాబూ....రాబోయే ఎన్నికల్లో నువ్వు నాకు ఒక్క సీటు ఇచ్చినా సరే, నేను, నా పార్టీ మొత్తం నీవెంటే ఉంటాము. పొత్తులు కాల్చి తిని అవతలపారేసే మొక్కజొన్నపొత్తులు అని నాకు తెలుసు. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. నువ్వు కనీసం వారానికొకమారైనా ఢిల్లీ రావాలి. నాకు ఏపీకి వద్దామని ఉంది కానీ నాలుగేళ్లక్రితం "మోడీ గో బాక్" అని హోర్డింగులు పెట్టావు కదా.. అందుకే నీ మాటను గౌరవించి నేను విజయవాడ రాలేదు. ఏమీ అనుకోవద్దు " అంటూ బాబును వాటేసుకుని గిరగిరా తిప్పారు మోడీ. చంద్రబాబు మాత్రం ఏమీ బదులివ్వకుండా "ఆలోచిస్తా" అన్నట్లుగా తలఊచి తన ఎంపీలతో బయటకు వెళ్లిపోయారు! ఇక నెటిజన్లు కూడా చంద్రబాబు పర్యటనపై తమ స్థాయిలో స్పందించారు. ఈసారికి రాష్ట్రపతిని , ఉపరాష్ట్రపతిని మీకు చెప్పకుండా ఎంపిక చేసినందుకు మమ్మల్ని మన్నించండి బాబు ... గతంలో మీరు ఎందరో రాష్ట్రపతులను, ప్రధానులను తయారు చేసేవారు.... కానీ ఈ మధ్య మీకు వయసు మీద పడిందని .. దానికి తోడుగా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తరువాత మతి చెడిందని.... వేళకు సరిగా మందులు కూడా వేసుకోవడం లేదని విన్నాం... అందుకే ఈ వయసులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని... మేమే రాష్ట్రపతిని , ఉపరాష్ట్రపతిని ఎంపిక చేసుకున్నాం... మరేమీ అనుకోవద్దు బాబు...అని... మోదీ గారు బ్రతిమలాడేసరికి ఐదు నిమిషాలు అయిపోయిందట ... సరే .... మీకు నేను ఇచ్చిన ఐదు నిమిషాల సమయం అయిపోయింది... మీరు ఇంకా ఏదైనా నాతో చెప్పాలి అనుకుంటే మరో సారి కలిసినప్పుడు చెప్పండి... నాకు ఇప్పుడు సమయం లేదని ... బాబు గారు బయటకు వచ్చేశారట.. ! ఇక చంద్రబాబు మోదీని కలవడం ఒక చరిత్రాత్మక భేటీ అన్నట్టుగా… వచ్చిన వార్తలను ఆటాడుకున్నారు నెటిజన్లు. చంద్రబాబు గుణం అర్థమయ్యాక మోదీ, షా కిలోమీటర్ల దూరం ఉంచుతున్నారు తనను… గత ఎన్నికల ముందు… దేశంలో చంద్రబాబు స్థాయిలో మోదీని అన్నిరకాలుగా అవమానించి, వ్యతిరేకించిన నాయకుడు ఇంకొకరు లేరు… అడ్డగోలుగా ఓడిన తరువాత గానీ బాబుకు తత్వం బోధపడలేదు… సారీ, ఆ తత్వమే అది కదా… ఇప్పుడు మోదీకి వ్యతిరేకంగా పోలేడు… జడుపు… మోదీ ఇక జన్మలో నమ్మడు… ప్రత్యేకంగా మోడీ చంద్రబాబును పక్కకు పిలిచి అయిదు నిమిషాలు మాట్లాడాడట… మీరు మమ్మల్ని మరిచిపోయారు, ఇలాగైతే మేం ఏమైపోవాలి, దేశం కోసమైనా మీరు అప్పుడప్పుడూ ఢిల్లీ వస్తుండాలి… మీ ఇల్లు అనుకొండి, మీతో చాలా మాట్లాడాల్సి ఉంది, ప్లీజ్ అని మోడీ పదే పదే మొహమాటపెట్టేశాడు. సర్లే, మరీ అంతగా బతిమిలాడకు, అప్పుడప్పుడూ వస్తుంటాలే అని చంద్రబాబు మోదీకి అభయహస్తం చూపి, ధైర్యాన్నిచ్చాడు అన్నట్టుగా ఉన్నాయి . థాంక్ గాడ్, చంద్రబాబు తిరిగి వచ్చేస్తున్నప్పుడు కారు దాకా నడిచివచ్చి వీడ్కోలు పలికాడని రాయలేదు..!! మొత్తమ్మీద చంద్రబాబు పర్యటన, ప్రధానిని కలవడంపై ఎల్లో మీడియా అతిగా స్పందించి నవ్వులపాలయ్యారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇదీ చదవండి: ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు షాక్.. ఎంపీ కేశినేని వైఖరితో నిర్ఘాంతపోయిన బాబు -
ఈ కుక్క పేరు ఏంటో తెలుసా! వింటే షాక్ అవుతారు
Her Pet Dog Name Covid: పెంపుడు కుక్కలను పెంచుకునే వాళ్లు తమ కుక్కలకు విచిత్రమైన పేర్లు పెట్టడం సహజం. కానీ కొంతమంది మరింత విచిత్రంగా మనుషులకు పెట్టిన పేర్లుతో పిలుస్తుంటారు. మరీ కొంతమంది మనుషులతో ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తూ విచిత్రంగా బిహేవ్ చేస్తుంటారు. అచ్చం అలానే ఇక్కడొక జంట తమ పెంపుడు కుక్కు ఓ విచిత్రమైన పేరు పెట్టడంతో అందరూ పెద్ద ఎత్తున మండిపడటం, విమర్శించడం మొదలు పెట్టారు. వివరాల్లోకెళ్తే...ఒక దంపతులకు కరోనా మొదటి వేవ్‌లో ఒక కుక్కపిల్ల దొరికింది. అయితే లాక్డౌన్ కారణంగా ఆ కుక్క యజమానిని కనుక్కోవడం వారికి కష్టమైంది.దీంతో ఈ కుక్క ఫోటోను తీసి పోస్టర్లు అంటించారు కూడా. కానీ ఎవరూ రాకపోవడంతో వారే ఆ కుక్కని పెంచుకోవడం మొదలు పెట్టారు. అయితే కరోనా లాక్డౌన్ సమయంలో దొరకడంతో కోవిడ్ అని పేరు పెట్టింది. అయితే అక్కడ వరకు అంతా బాగానే ఉంది. తనతోపాటు ఆ కుక్కపిల్లను బయటకు తీసుకువెళ్తున్నపుడల్లా మెదలైయ్యాయి అసలైన కష్టాలు. వాళ్లకు బయటకు తీసుకువెళ్లినప్పుడూ కోవిడ్ అని పిలవంగానే అందరూ విచిత్రంగ చూడటమే గాక అసలు అదేం పేరు అంటూ తిట్టడం మెదలు పెట్టారు. మరికొంతమంది ఆ కరోనా మహమ్మారితో మా ప్రియమైన వాళ్లని పోగొట్టుకున్నాం దయచేసి ఆ పేరు విన్నా కోపం వస్తోందంటూ మండిపడ్డారు. ఈ విషయాన్ని ఆ దంపతులు సోషల్ మీడియాలో నెటిజన్లుతో పంచుకున్నారు. ఆఖరికి నెటిజన్లు కూడా అదేం పేరు అంటూ చివాట్లు పెట్టడం మెదలు పెట్టారు. (చదవండి: అక్కడేం లేదు.. అయినా నాలుగు కోట్లు! అట్లుంటది మరి ఆయనతోని!) -
‘ఆస్క్ యువర్ కేటీఆర్’ .వారితో డిబేట్లో పాల్గొనను
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ‘ఆస్క్ యువర్ కేటీఆర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో పలువురు నెటిజన్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనిపై ఒక నెటిజన్ అడిగిన ప్రశ్న ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో డిబేట్లో పాల్గొనాలని కోరాడు. దీనికి కేటీఆర్ తనదైన శైలీలో సమాధానం ఇచ్చారు. ‘క్రిమినల్స్‌తో డిబేట్లో పాల్గొననని సమాధానం ఇచ్చారు’. గత కొన్ని రోజులుగా కేటీఆర్ నిర్వహిస్తున్న ‘ఆస్క్ యువర్ కేటీఆర్’ కార్యక్రమంలో నెటిజన్లు ఉత్సాహంగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. చదవండి: కరోనా ఉధృతి.. రాష్ట్ర సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ -
స్టేజీపై డ్యాన్స్‌తో రచ్చచేస్తున్న బామ్మ.. వైరల్
దేశంలో కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి దేశమంతా విలవిల్లాడుతోంది. కాగా, గత 15 నెలలుగా ప్రజలందరూ వైరస్ భయంతోనే గడుపుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలన్నా.. ఏదైనా శుభకార్యాలకు హాజరవ్వాలన్నా తెగ భయపడిపోతున్నారు. ఈ క్రమంలో ఓ పెళ్లిలో బామ్మ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిలో బామ్మ స్పానిష్ పాటపై స్టెప్పులేస్తూ తెగ రచ్చ చేస్తోంది. పాపిచు.. పాట లిరిక్స్ కు తగ్గట్టుగా హావభావాలను పండించింది. ఆమె ఎనర్జీ లెవల్స్ చూసి అక్కడి వారంతా ఆశ్చర్యపడుతున్నారు. ఆమె హుషారుతనం అక్కడి వారిని కట్టి పడేస్తోంది. దీంతో అక్కడి వారంతా బామ్మ చుట్టూచేరి మరీ ఆమెను మరింత ఉత్సాహపరిచారు. దీనికి సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు వావ్... బామ్మ ఏంత బాగా డ్యాన్స్ చేస్తోంది.. బామ్మను చూసి డ్యాన్స్ నేర్చుకోవాల్సిందే.. మీ డ్యాన్స్‌కు హ్యాట్సాఫ్ అంటూ.. కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఈ పాటను 2003లో పనామేనియన్ రాపర్ లోర్నా తొలిసారి విడుదల చేశాడు. ఇది అనేక దేశాలను ఓ ఊపు ఊపేసింది. స్పానిష్‌లో పాపిచులో అంటే మగవారికి ప్రియమైన అన్నపదంగా ఉపయోగిస్తారు. కాగా కరోనా నుంచి ఉపశమనం కోసం ఒక అంబులెన్స్ డ్రైవర్ పెళ్లి బరాత్‌లో చేసిన డ్యాన్స్ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.. -
Viral Video: గొర్రెకు మసాజ్ చేస్తున్న పిల్లి
పిల్లి ఏం చేసినా క్యూట్‌గా ఉంటుందంటారు క్యాట్ లవర్స్. కానీ దొంగలా పాలు తాగి ఏమీ ఎరగనట్టు నటించే ఆ మూగజీవిని చూస్తే చిర్రెత్తిపోతారు మరికొందరు. అయితే ఇక్కడ మాత్రం ఓ పిల్లి ఎలాంటి దొంగ వేషాలు వేయకుండా ఓ గొర్రెకు మసాజ్ చేసి నిద్ర పుచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో గొర్రె , పిల్లి మంచి ఫ్రెండ్స్‌గా మారాయి. గొర్రె కింద పడుకుంటే పిల్లి దాని వీపు మీద ఎక్కింది. ఏదో పరుపుపై పడుకున్నట్లుగా హయిగా అక్కడే సెటిలైంది. అంతటితో ఆగకుండా అది గొర్రెకు మసాజ్ చేయడం మొదలు పెట్టింది. పిల్లి తన రెండు కాళ్లతో గొర్రెను పైకి కిందకు నొక్కుతుంటే అది హాయిగా పడుకుంది. నిండుగా ఉన్న గొర్రె బూరులో పిల్లి తల దూర్చి మరీ పడుకుంది. ఇంత జరుగుతున్నా గొర్రె మాత్రం ఎటూ కదలకుండా నిద్రలో మునిగిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'పిల్లి ఎంత బాగా మసాజ్ చేస్తుంది', 'గొర్రె అలసిపోయిందేమో.. కనీసం లేవడం లేదు', 'అది పిల్లి చేస్తున్న మసాజ్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లుంది', 'పిల్లి మాకు కూడా మసాజ్ చేస్తుందా..' అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. -
ఇలాంటి లడ్డు నెవర్ బిఫోర్ .. ఎవర్ ఆఫ్టర్!
న్యూఢిల్లీ: మ్యాగీ ఈ పేరు తలుచుకోగానే ప్రతి ఒక్కరి నోట్లో నీరు ఊరుతాయి. దీన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా ఇష్టంగా తింటారు. దీని తయారీకి పట్టే సమయం కూడా చాలా తక్కువ. ఇది ఇన్స్టాంట్ మ్యాగీగా మనకు మార్కెట్లో లభిస్తుంది. దీని ప్యాకింగ్ చేసేటేప్పుడే అన్ని రకాల పదార్ధాలతో కలిసి ఉంటుంది. దీన్ని వేడినీళ్లలో వేయగానే.. మంచి రుచికరమైన మ్యాగీ క్షణాల్లో మన ముందుంటుంది. అయితే, కొంతమంది మాత్రం ట్రెండ్‌ను ఫాలో కాకుండా సెట్ చేశారు. మ్యాగీతో లడ్డు చేస్తే ఎలా ఉంటుందో అనుకున్నారో.. ఏమో గానీ.. వెంటనే వారి ఆలోచనను అమలు చేసేశారు. మ్యాగీతో లడ్డు ప్రయోగం చేశారు. ఇంతటితో ఆగకుండా దానిపై అందంగా కాజునికూడా ఉంచారు. ఇప్పుడు, దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ వావ్.. దీన్ని చూస్తే నోటిలో నీరు ఊరుతోంది.. ఎలా తయారు చేశారంటూ’.. సరదాగా కామెంట్లు పెడుతున్నారు. -
ఫోన్ దొంగిలించిన పక్షి.. వీడియో వైరల్
సాధారణంగా ఫోన్ మనజీవితంలో ఒక భాగమైపోయింది. కొంత మందిని దీన్ని ఆరోప్రాణంగా కూడా భావిస్తారు. అయితే.. ఇలాంటి ఫోన్‌ను ఎవరైన ఎత్తుకుపోతే ఇంకేమైనా ఉందా... అయితే తాజాగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఫోన్‌ను ఎత్తుకుపోయింది. ఏ దొంగలో కాదూ.. ఒక పక్షి. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒక మహిళ తన మిత్రులతో కలిసి టెర్రాస్ పైన సరదాగా మాట్లాడుకుంటున్నట్లున్నారు. వారి ఫోన్లను పక్కన పెట్టేసి మరీమాటల్లో మునిగిపోయారు. అయితే, ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. ఒక పక్షి వచ్చి పిట్ట గోడ మీద ఉంచిన స్మార్ట్‌ఫోన్‌ను నోటితో కరుచుకుని అక్కడి నుంచి ఎగురుకుంటు వెళ్లిపోతుంది. అయితే , ఒక్కసారి షాక్‌కు గురైన ఆ మహిళ ఆ పక్షి వెంట పరిగెత్తింది. ఆఫోన్ నాదీ.. నాదీ నాకిచ్చేయ్ అంటూ అరుస్తు దాని వెంట పడింది. ఆమెతో ఉన్న మిత్రులు మాత్రం ఆ పక్షిని పట్టుకొవడం మానేసి, తన సహచరి ఫోన్ కోసం పడుతున్న సరదా సన్నివేశాన్ని ఫోన్లో వీడియో తీస్తు.. తెగ నవ్వుకుంటున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ పాపం, ఆ పక్షి తినే పదార్థం అనుకొని ఉంటుందేమో.. ఎవరికైన గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుందేమో’.. అని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. -
డెలివరీ బాక్స్‌లో ముసిముసి నవ్వుల ‘చిన్నారి’
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలామంది తల్లులు తమ చంటి పిల్లల్నీ ఎదరు పొట్టకుగానీ వెనుక వీపు మీద కట్టుకుని పనిచేస్తూ.. జీవనం సాగిస్తూంటారు. ఇది మనం రెగ్యులర్‌గా ఎక్కడో ఒకదగ్గర చూస్తూనే ఉంటాము. యాచించే స్త్రీలు అయితే పిల్లల్ని చూపిస్తూ డబ్బులు అడుగుతుంటారు. అయితే చైనాలో ఓ తండ్రి మాత్రం తన ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో చంటిబిడ్డను వెంటబెట్టుకుని మరీ ఉద్యోగం చేస్తున్నాడు. ఆ చిన్నారి పాప కూడా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ.. తండ్రితోపాటు తనుకూడా వస్తువులను డెలివరీ చేస్తోంది. ఈ విషయం ఆనోటా ఈ నోటా సోషల్ మీడియాకు చేరడంతో ప్రస్తుతం ముసిముసి నవ్వుల డెలివరీ గార్ల్ ‘బుజ్జాయి’ నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. చైనాకు చెందిన లీ యువాన్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. రోజూ తన స్కూటర్ మీద వస్తువులను డెలివరీ చేసే యువాన్ తన రెండేళ్ల కూతుర్ని డెలివరీ బాక్స్‌లో కూర్చోబెట్టుకుని విధులు నిర్వహిస్తున్నాడు. డెలివరీ బాక్స్‌లో తన కూతురి కోసం డయపర్లు, తను తినే ఫుడ్‌ను తీసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు తను ఎటు వెళ్తే అటు తీసుకెళ్తున్నాడు. రోజూ తను ఎక్కడకు వెళ్తుంది? ఎందుకు వెళ్తుంది తెలియని పసిమనుసు..ఎవరైనా చూడగానే అందంగా నవ్వుతూ హాయ్ చెబుతోంది. లీయువాన్ మాట్లాడుతూ..‘‘తన కూతురు లీ ఫెర్రీ ఐదు నెలల వయసు ఉన్నప్పుడు తనకి నిమోనియా ఉన్నట్లు తెలిసింది. అప్పటి నుంచి తన చికిత్సకు చాలా ఖర్చవుతోంది. సేవింగ్స్‌లో ఎక్కువ భాగం ట్రీట్మెంట్కే కేటాయిస్తున్నాం. భార్యాభర్తలు ఇద్దరం కష్టపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. ఈ క్రమంలోనే లీఫెర్రీనీ చూసుకునేవారు ఎవరూ లేకపోవడంతో ఉదయం తనని తనతోపాటు తీసుకెళ్తాను. సాయంత్రానికి ఇంటికి వచ్చాక లీఫ్రెర్రీ రాత్రంతా అమ్మతో గడుపుతోంది’’ ఇలా తనని చూసుకునే సమయాన్నీ షేర్ చేసుకున్నాము’’ అని లీయువాన్ చెప్పాడు. లీ ఫెర్రీ ఆరునెలల వయసు ఉన్నప్పటినుంచే తనని నా డెలివరీ బాక్స్‌లో కూర్చోపెట్టుకుని విధులు నిర్వహిస్తున్నాను. ఇది కాస్త కష్టంగా ఉన్నప్పటికీ మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలతో ముందుకు సాగుతున్నాను. ప్రస్తుతం ఫెర్రీ పెద్దది అయ్యింది. రెండేళ్లు నిండడంతో తను ఇప్పుడు నడవ గలుగుతుంది. దీంతో తనని వెనుకాల కూర్చోపెట్టుకుని తీసుకెళ్లగలుగుతున్నాను’’అని లీ చెప్పాడు. ప్రస్తుతం నడుస్తోన్న ఫెర్రీ తండ్రితోపాటు డెలివరీ చేసేందుకు తెగ ముచ్చటపడుతూ తండ్రి వెనక హుషారుగా కూర్చుంటోంది. నెలల పసికందునుంచి రెండేళ్ల చిన్నారివరకు ఫెర్రీ డెలివరీ చేయడానికి వెళ్లిన వీడియోలు వైరల్ అవుతుండడంతో నెటిజన్లు లీయువాన్ను అభినందిస్తున్నారు. -
పారాగ్లైడింగ్.. పాపం భయపడింది!
ఖాద్దర్: మనలో చాలా మంది ఎగ్జిబిషన్‌కు వెళ్తారు. అక్కడ జైంట్ విల్ ఉంటుంది. అయితే.. కొంత మంది మాత్రమే, ధైర్యంచేసి ఎక్కుతారు. అది పైకి పోయి కిందకు వచ్చేవరకు కూడా భయపడుతూనే ఉంటారు. అయితే, పారాగ్లైడింగ్ అడ్వెంచర్ కూడా ఇలాంటిదే.. ఇది బాగా ఎత్తైన ప్రదేశంలో నుంచి చేస్తారు. దీన్ని డ్రైవ్ చేయాలంటే కొంచెం ధైర్యంకూడా ఉండాలి. ఇప్పుడు హిమచల్ ప్రదేశ్‌లో ఒక మహిళ చేసిన పారాగ్లైడింగ్ అడ్వెంచర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతొంది. దీనిలో.. ఖాజ్జర్ ప్రాంతానికి చెందిన మహిళ ధైర్యంచేసి పారాగ్లైడింగ్ కు సిద్ధమైంది. మొదట బాగానే ఉంది. క్రమంగా వేగం పెరిగి, ఒక్కసారిగా ఆకాశంలోకి వెళ్ళిపోయింది. దీంతో ఆమహిళ వెంటనే కళ్ళుమూసుకుంది. వెంటనే తన వెనుక ఉన్న గైడ్ ఆమెకు ధైర్యం చెబుతున్న కూడా ఆమె అవేమి పట్టించుకొవడంలేదు. ఆమె కళ్ళుతెరచి కిందకు చూసింది. అయితే , భయపడిపోయిన ఆ మహిళ వెంటనే హిందిలో ‘మూజే ఛోడ్‌దో..(నన్ను వదిలేయండి)’.. హల్లుజానేదో..(మెల్లగా పోనివ్వండి)..అంటూ హిందీలో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అయితే, ఈ వీడియోను ఇన్‌క్రెడెబుల్ హిమాలయా అనే ట్రావెల్ ఏజేన్సీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘మా అక్క ఉంది కాస్త మెల్లగా పోనివ్వండా...పాపం భయపడింది..బతికితే చాలనుకుంటొంది..కాబోలు..అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 2019లో ఇదే తరహాలో ఒక ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ఆ వీడియోను కోడ్ చేస్తూ తాజా వీడియోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. చదవండి: వైరల్: అమ్మో..పాము ఎంత భయంకరంగా దాడిచేసింది! -
పాక్ సినిమాలో ఐటెం సాంగ్; నెటిజన్లు ఫైర్
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో కాఫ్ కంగనా పేరుతో ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం నిర్మించిన చిత్రంలోని ఐటెం సాంగ్ వివాదాస్పదమైంది. ఆ పాటపై పాక్ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వివరాల్లోకెళితే.. పాక్ మిలిటరీ పీఆర్ విభాగం నిర్మించిన చిత్రం కాఫ్ కంగనా. ఈ చిత్రంలో నీలమ్ మునీర్ అనే యువతి ఐటెం సాంగ్ చేసింది. మేరే ఖ్వాబోంమే అంటూ సాగే ఈ పాట భారత్‌ను ద్వేషిస్తూ సాగుతుంది. అయితే పాటను అసభ్యకరంగా చిత్రీకరించడంతో నెటిజన్ల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐఎస్పీఆర్ డీజీ ఆసిఫ్ గపూర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. భారత్‌కు చెందిన యువతి పాత్రను నీలమ్ పోషించిందనీ, పాక్‌కు చెందిన యువతి పాత్ర కాదని సమర్థించుకున్నారు. పాట ఏ సందర్భంలో వచ్చేదీ సినిమా చూస్తే అర్థమవుతుందని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాక, ఈ చిత్రం కశ్మీర్ ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు రూపొందించిందనీ, పాట చిత్రీకరణ ఐఎస్పీఆర్ ప్రధాన కార్యాలయంలో కానీ, ఇస్లామాబాద్‌లో కానీ చిత్రీకరించలేదని వివరించారు. ఈ విషయంపై నీలమ్ మునీర్ స్పందిస్తూ.. ఐఎస్పీఆర్ నిర్మించినందునే ఐటెం సాంగ్ చేశానని, దేశం కోసం ఇలా చేయడం తనకు తప్పనిపించలేదని పేర్కొంది. అంతేకాక, నా జీవితంలో ఇదే మొదటి ఐటెం సాంగ్. అలాగే చివరిది కూడా అని తెలిపింది. ఈ వివరణలకు పాక్ నెటిజన్లు శాంతించలేదు. గపూర్‌ను, నీలంను ట్రోల్ చేస్తున్నారు. కశ్మీర్, దేశ రక్షణ పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విరుచుకుపడుతున్నారు. కంగనా అనే హిందూ యువతి, అలీ ముస్తఫా అనే పాకిస్తాన్ ముస్లిం యువకుడి మధ్య నడిచే ప్రేమ ఈ చిత్ర కథాంశం. ఐఎస్పీఆర్ అనేది పాకిస్తాన్ ఆర్మీకి, ఆ దేశ పౌర సమాజానికి మధ్య వారధిగా పనిచేస్తుంది. సైన్యం గురించిన వివరాలు, చిత్రాలు, విశేషాలు వంటివి అధికారికంగా వెల్లడించే ఒక ఆర్మీ విభాగం. అంతేకాక, సైన్యానికి సంబంధించిన అంశాలు మీడియాకు అందిస్తుంది. ఈ విభాగం నిర్మించిన చిత్రమే కాఫ్ కంగనా. -
‘బెస్ట్ యాక్టర్.. బెస్ట్ డ్రామా!’
సాక్షి, అమరావతి: కేంద్రంలోని బీజేపీ సర్కారుతో నాలుగేళ్ల పాటు అధికారాన్ని పంచుకుని ప్రత్యేక హోదాను గాలికి వదిలేసిన సీఎం చంద్రబాబు. కానీ, ఇప్పుడు అవిశ్వాసంపై చర్చ సందర్భంగా పార్లమెంట్లో ఎంపీ గల్లా జయదేవ్ బాగా మాట్లాడారంటూ, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై గళం వినిపించారంటూ ట్వీట్ చేయడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పలువురు నెటిజన్లు.. నాలుగేళ్లుగా హోదా విషయాన్ని మరిచిపోయారా? అని చంద్రబాబును ప్రశ్నించారు. హోదా మాటెత్తితే అరెస్టులు చేస్తానంటూ గతంలో హెచ్చరించిన చంద్రబాబు ఇప్పుడు హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెట్టడాన్ని తప్పుబడుతూ ‘బెస్ట్ యాక్టింగ్... బెస్ట్ యాక్టర్ చంద్రబాబు... బెస్ట్ డ్రామా’ అని ట్వీటర్లో పోస్టింగులు పెట్టారు. ‘ప్యాకేజీ ముద్దు... హోదా వద్ద’న్న బాబు మాటలను గుర్తు చేశారు. టీడీపీ నేతలు నాటకాలాడుతున్నారంటూ మండిపడ్డారు. కేంద్రం సంగతి తేల్చడం సరే.. మీరిచ్చిన హామీల సంగతేంటని కొందరు సీఎంను ప్రశ్నించారు. ట్వీటర్, ఫేస్బుక్, గూగుల్‌లో ఇలాంటి కామెంట్స్ వైరల్‌గా మారాయి. చంద్రబాబు ట్విట్టర్లో పోస్టింగ్ పెట్టిన 4 గంటల్లోనే 232 మంది వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. గల్లా జయదేవ్, నారా లోకేష్ ట్వీట్లకూ ఇదే రీతిలో వ్యతిరేకత వచ్చింది. -
హేమమాలినిపై సానుభూతి ఎందుకు?
జైపూర్: భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యురాలు హేమమాలిని కారు యాక్సిడెంట్‌పై సామాజిక వెబ్సైట్లలో వివాదం రాజుకుంది. అతి వేగంగా దూసుకొచ్చిన హేమ మాలిని కారు కారణంగానే ఆల్టో కారులోని నాలుగేళ్ల చిన్నారి చనిపోతే, ఆరేళ్ల బాలుడు రెండు కాళ్లు దెబ్బతింటే వారి పట్ల సానుభూతి చూపించాల్సిందిపోయి మీడియాగానీ, ప్రభుత్వంగానీ హేమమాలిని పట్ల సానుభూతి ఎందుకు చూపిస్తున్నారని నెటిజన్లు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. తన కారు కారణంగా చనిపోయిన నాలుగేళ్ల చిన్నారి, ఆమె సోదరుడిని ఆస్పత్రికి తరలించాల్సిన బాధ్యతను విస్మరించి తాను మాత్రం ఆస్పత్రికి తరలిపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇది మరో సల్మాన్ ఖాన్‌లా ప్రవర్తించడం కాదా అని నెటజన్లు ట్విట్టర్లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దారినపోతున్న డాక్టరయ్య కారణంగా అయితేనేమి జైపూర్‌లోని ఫోర్టీస్ ఆస్పత్రికి హేమ మాలిని తరలిస్తే, బాధితులను మాత్రం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తారా ? ఇదేమి వివక్ష ? వీఐపీలు, సామాన్యులు సమానమేనంటూ ఎప్పుడు గొంతు చించుకుని ఆరిచే మీడియా అసలు బాధితులను పట్టించుకోకుండా, నొసటికి గాయమైన హేమ మాలిని కవరేజీకి ప్రాధాన్యతనివ్వడం ఆత్మవంచన కాదా? అని సూటిగా అడుగుతున్నారు. ‘ఆల్టోను ఒవర్ టేక్ చేయబోతే యాక్సిడెంట్ అయినట్టుగా హేమమాలిని కారు డ్రైవర్ మహేశ్ ఠాకూర్ చెబుతున్నారు. అదే నిజమైతే హేమ కారుకు ముందున కుడివైపు, ఆల్టోకు వెనుక ఎడమ వైపు ఎలా దెబ్బలు తగులుతాయి' అని మరో నెటిజన్ ట్విట్టర్లో ప్రశ్నించారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన ఓ పోలీసు అధికారి మాత్రం హేమమాలిని కారు అతి వేగం కారణంగా డివైడర్ మీది నుంచి దూసుకెళ్లడం వల్ల యాక్సిడెంట్ అయిందని చెప్పారు. రాజస్థాన్‌లోని దౌసా వద్ద గురువారం సాయంత్రం యాక్సిడెంట్ అయిన విషయం తెల్సిందే. -
జనం కోసం.. ysjagan @ twitter!