ఇలాంటి లడ్డు నెవర్‌ బిఫోర్‌ .. ఎవర్‌ ఆఫ్టర్‌! | Sakshi
Sakshi News home page

కాదేదీ లడ్డుకీ అనర్హం!

Published Mon, Apr 19 2021 5:02 PM

Someone Just Made Maggi Laddu, And Its Gone Viral - Sakshi

న్యూఢిల్లీ: మ్యాగీ ఈ పేరు తలుచుకోగానే ప్రతి ఒక్కరి నోట్లో నీరు ఊరుతాయి. దీన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు  చాలా ఇష్టంగా తింటారు. దీని తయారీకి పట్టే సమయం కూడా చాలా తక్కువ. ఇది ఇన్‌స్టాంట్‌ మ్యాగీగా మనకు మార్కెట్‌లో లభిస్తుంది. దీని ప్యాకింగ్‌ చేసేటేప్పుడే అన్ని రకాల పదార్ధాలతో కలిసి ఉంటుంది. దీన్ని వేడినీళ్లలో వేయగానే.. మంచి రుచికరమైన మ్యాగీ క్షణాల్లో మన ముందుంటుంది.

అయితే, కొంతమంది మాత్రం ట్రెండ్‌ను ఫాలో కాకుండా సెట్‌ చేశారు. మ్యాగీతో లడ్డు చేస్తే ఎలా ఉంటుందో అనుకున్నారో.. ఏమో గానీ.. వెంటనే వారి ఆలోచనను అమలు చేసేశారు. మ్యాగీతో లడ్డు ప్రయోగం చేశారు. ఇంతటితో ఆగకుండా దానిపై అందంగా కాజునికూడా ఉంచారు. ఇప్పుడు, దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ వావ్‌.. దీన్ని చూస్తే నోటిలో నీరు ఊరుతోంది.. ఎలా తయారు చేశారంటూ’.. సరదాగా కామెంట్‌లు పెడుతున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement