
సాధారణంగా బాగా ఆకలి వేసినప్పుడూ.. వంట చేసుకొని తినే ఓపిక లేనప్పడు క్షణాల్లో తయారయ్యే మ్యాగీని చేసుకుంటారు. అందరికీ మ్యాగీ అంటే.. నూడిల్స్‌లా ఉండి.. అందులో వేసుకోవడానికి మసాలాతో కూడిన ప్యాకెట్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అదేవిధంగా మ్యాగీని అందరూ నీటితో చేస్తారన్న సంగతి విధితమే. మ్యాగీని ఒకేలా చేసుకొని తినడం బోర్ కొట్టిన ఓ మహిళా భిన్నంగా ఆలోచించి.. కొత్త తరహాలో తయారు చేశారు. అందులో నీటికి బదులుగా పాలను పోసీ కొంత చక్కెరను కూడా కలిపి తయారు చేశారు. ఆ వంటకానికి ‘స్వీట్ మ్యాగీ’ అనే పేరును కూడా జోడించారు. అంతటితో ఆగకుండా ఆ మహిళా ‘స్వీట్ మ్యాగీ’ తయారి విధానాన్ని వీడియో తీసి ట్విటర్ పోస్ట్ చేశారు.
దాంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్లు చేస్తున్నారు.‘మీరు వదిలేసిన మసాలా ప్యాకెట్ నాకు ఇవ్వగలరా.. నేను ఎక్కువ మసాలా ఉపయోగిస్తానను’ అని ఒకరు, ‘చాలా సృజనాత్మకంగా ఉంది. కానీ తయారు చేయడానికి ప్రయత్నిస్తా అనుకోవడం లేదు’ అని మరొకరు, ‘ఓ దేవుడా.. మ్యాగీని ఇలా కూడా తయారు చేస్తారా.. నేను ఎక్కడా చూడలేదు’ అని ఇంకొకరు కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment