ఆ వీధి కుక్క చేసిన పని చూస్తే.. ఫిదా అవ్వాల్సిందే! | Indian Railways To Give This Stray Dog A A Security Job Heres why | Sakshi
Sakshi News home page

వీధి కుక్కకు సెక్యూరిటీ ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్న నెటిజన్లు! ఎందుకో తెలుసా?

Published Sun, Dec 31 2023 9:43 AM | Last Updated on Sun, Dec 31 2023 11:08 AM

Indian Railways To Give This Stray Dog A A Security Job Heres why - Sakshi

కుక్కలు మనుషుల పట్ల ప్రేమతో మెలిగిన ఘటనలు ఎన్నో చూశాం. ముఖ్యంగా తన సహజస్వభావమైన విశ్వాసంతో మనుషులకు ఇట్టే తొందరగా దగ్గరయ్యేపోయే జంతువు కూడా కుక్కే. అలాంటిది కుక్కలు ఇలా కూడా మనుషలను హెచ్చరిస్తాయా? అని ఈ వీధి కుక్కని చూస్తే అనిపిస్తుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

ఆ వీడియోలో..రైలులో ఫుట్‌బోర్డ్‌పై కూర్చొని లేదా వేలాడుతూ కొందరూ వ్యక్తులు కనిపిస్తుంటారు. ప్రమాదకరమైన సరే లెక్కచేయకుండా అలానే వేలాడుతూ లేదా కూర్చొని ఉంటారు. అధికారుల చెప్పిన వాళ్ల తీరు మాత్రం మారదు. ముఖ్యంగా యువకులే ఎక్కువగా అక్కడ తచ్చాడుతూ ఉండేది. అయితే ఈ కుక్క అలా ఫుట్‌బోర్డ్‌ మీద కూర్చొవద్దంటూ సదరు ప్యాసింజర్లను హెచ్చరిస్తూ తన భాషలో మొరుగుతూ చెబుతోంది. అలా ఆ ట్రైయిన్‌ బోగిలు కదులుతున్న వరుసకు తాను కూడా ఫాలో అవ్వతూ అలా ఫుట్‌ బోర్డ్‌ మీద కూర్చొని ఏ ప్యాసింజర్‌ కనిపించినా చాలు "పో లోపలకి" అన్నట్లు మొరిగి హెచ్చరించింది.

అందుకు సంబంధించిన వీడియోని ఐఆర్‌ఏఎస్‌ అధికారి అనంత్‌ రూపనగుడి ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ ఫుట్‌బోర్డ్‌పై కూర్చొని ప్రయాణిచడం ఎంత ప్రమాదకరం అని ఆ కుక్క అప్రమత్తం చేస్తున్న తీరుని చూసి అయిన మార్పు వస్తే బావుండనని అని క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. అయితే ఆ కుక్క ఇలా వింతగా ప్రవర్తిచడానికి గల కారణాలేంటిన్నది తెలియాల్సి ఉంది.  ఐతే ఈ వీడియోని చూసిన చాలామంది నెటిజన్లు మాత్రం ఆ కుక్కకు సెక్యూరిటీ ఉద్యోగం ఇస్తే బావుండనని కోరగా, మరికొందరు మాత్రం బహుశా ఫుట్‌ బోర్టుపై ప్రయాణం ప్రమాదం అని చెప్పేందుకు చేస్తున్న ప్రయత్నం కాబోలు అని కామెంట్లు చేశారు.

(చదవండి: అక్కడ నది హఠాత్తుగా నెత్తుటి రంగులోకి మారిపోయింది? రీజన్‌ ఏంటన్నది..?)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement