Man Prepares Dish With Leftovers After Consulting ChatGPT, Internet Reacts - Sakshi
Sakshi News home page

ChatGPT రెసిపీ వైరల్‌..ఏలియన్స్ కంటే ఏఐ చాలా డేంజర్‌ బ్రో!

Published Sat, Feb 11 2023 3:36 PM | Last Updated on Sat, Feb 11 2023 4:04 PM

ChatGPT Man Prepares Dish With Leftovers After Consulting Internet Reacts - Sakshi

సాక్షి, ముంబై: ఇపుడు ఎక్కడ చూసినా చాట్‌జీపీటీ కబుర్లే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా  చాట్‌బాట్ అనేక ప్రశ్నలకు సమాధాన మివ్వడం, వ్యాసాలు ఇవ్వడం మొదలు వంటల రెసిపీలను అందిస్తూ ఇంటర్నెట్‌ సంచలనంగా మారింది.  సాధారణంగా గూగుల్‌ని మనం అడిగే ప్రశ్నలతోపాటు, అసైన్‌మెంట్‌లపై పని చేయడం  ఇమెయిల్స్‌ ఇలా చాలా చాలా పనులను చాలా ఈజీగా బాట్ చేస్తోంది.  తాజాగా చాట్‌జీపీటి సాయంతో ఒక కొత్త వంటకాన్ని తయారు  చేసిన యువకుడు నెటిజన్లు విపరీతంగా ఆకర్షిస్తున్నాడు. అదీ మిగిలిపోయిన వాటినుంచి  డెలీషియస్‌ డిష్‌ను తయారు చేసుకున్న వీడియోను షేర్‌ చేశాడు. 

(ఇదీ చదవండి:  భారీగా లిథియం నిక్షేపాలు: ఇక భవిష్యత్తంతాఅద్భుతమే! ఆనంద్‌ మహీంద్ర)

కంటెంట్ క్రియేటర్ శుభమ్ జోషి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేశారు. క్లిప్‌లో, బంగాళదుంపలు, టమోటాలు, ఉల్లిపాయలు, మసాలాలు, బ్రెడ్, జున్ను, ఉప్పు, మిరియాలు పాలు వంటి తన వద్ద ఉన్న పదార్థాలతో ఏమి చేసు కోవచ్చని అతను బోట్‌ని అడిగాడు.ను "చీజ్‌ పొటాటో అండ్‌ వెజిటబుల్ బేక్" సిద్ధం చేస్తానని చెప్పింది చాట్‌జీపీటి. ఇక అంతే.. ఓవెన్‌ను 180 డిగ్రీల సెల్సియస్‌కు ప్రీహీట్ చేయడం మొదలు, ప్రతి దశనూ వివరించింది.  అలా తయారైన  వంటకాన్ని ఆస్వాదించి వావ్‌....అంటూ శుభం ఆరగించాడు. దీనిపైన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  జనవరి 21న షేర్ ఈ వీడియోను షేర్‌ చేయగా  ఇప్పటివరకు ఐదు మిలియన్లకు పైగా వ్యూస్‌, రెండు లక్షలకు పైగా లైక్‌లను సంపాదించింది. (రెడిక్యులస్‌..నా పాపులారిటీ తగ్గుతోందంటావా? ట్విటర్‌ ఉద్యోగిపై వేటు)

అయితే దీనిపై విభిన్నంగా స్పందించిన వారూ లేకపోలేదు.. "ఏలియన్స్ కంటే ఏఐ చాలా ప్రమాదం," అని, దీనికి ఏఐ ఎందుకు బాస్‌..కామన్‌ సెన్స్‌ ఉంటే చాలు అని ఒకరు, "పాలు, ఉల్లిపాయలు శత్రువులు బ్రో, వాటిని ఎప్పుడూ కలిపి ఉపయోగించకూడదంటూ ఇంకొరు కమెంట్‌ చేశారు. ‘ఓరి దేవుడా.. నువ్వు మనిషివి భయ్యా నీ తెలివితేటలను ఉపయోగించుకో! దీని మీద ఆధారపడితే నీ మెదడు పనిచేయడం మానేస్తుంది’ అని ఇంకొకరు వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement