
Her Pet Dog Name Covid: పెంపుడు కుక్కలను పెంచుకునే వాళ్లు తమ కుక్కలకు విచిత్రమైన పేర్లు పెట్టడం సహజం. కానీ కొంతమంది మరింత విచిత్రంగా మనుషులకు పెట్టిన పేర్లుతో పిలుస్తుంటారు. మరీ కొంతమంది మనుషులతో ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తూ విచిత్రంగా బిహేవ్ చేస్తుంటారు. అచ్చం అలానే ఇక్కడొక జంట తమ పెంపుడు కుక్కు ఓ విచిత్రమైన పేరు పెట్టడంతో అందరూ పెద్ద ఎత్తున మండిపడటం, విమర్శించడం మొదలు పెట్టారు.
వివరాల్లోకెళ్తే...ఒక దంపతులకు కరోనా మొదటి వేవ్‌లో ఒక కుక్కపిల్ల దొరికింది. అయితే లాక్‌డౌన్ కారణంగా ఆ కుక్క యజమానిని కనుక్కోవడం వారికి కష్టమైంది.దీంతో ఈ కుక్క ఫోటోను తీసి పోస్టర్లు అంటించారు కూడా. కానీ ఎవరూ రాకపోవడంతో వారే ఆ కుక్కని పెంచుకోవడం మొదలు పెట్టారు. అయితే కరోనా లాక్‌డౌన్ సమయంలో దొరకడంతో కోవిడ్ అని పేరు పెట్టింది. అయితే అక్కడ వరకు అంతా బాగానే ఉంది. తనతోపాటు ఆ కుక్కపిల్లను బయటకు తీసుకువెళ్తున్నపుడల్లా మెదలైయ్యాయి అసలైన కష్టాలు.
వాళ్లకు బయటకు తీసుకువెళ్లినప్పుడూ కోవిడ్ అని పిలవంగానే అందరూ విచిత్రంగ చూడటమే గాక అసలు అదేం పేరు అంటూ తిట్టడం మెదలు పెట్టారు. మరికొంతమంది ఆ కరోనా మహమ్మారితో మా ప్రియమైన వాళ్లని పోగొట్టుకున్నాం దయచేసి ఆ పేరు విన్నా కోపం వస్తోందంటూ మండిపడ్డారు. ఈ విషయాన్ని ఆ దంపతులు సోషల్ మీడియాలో నెటిజన్లుతో పంచుకున్నారు. ఆఖరికి నెటిజన్లు కూడా అదేం పేరు అంటూ చివాట్లు పెట్టడం మెదలు పెట్టారు.
(చదవండి: అక్కడేం లేదు.. అయినా నాలుగు కోట్లు! అట్లుంటది మరి ఆయనతోని!)
Comments
Please login to add a commentAdd a comment