అనంతమైన విశ్వం పరిశోధకులను, శాస్త్రవేత్తలను ఏదో రకంగా ఆకర్షిస్తుంది. అది కొత్త పరిశోధనలకు నాంది అయ్యి ప్రంపంచానికి సరికొత్త అద్భుతాలను అందించేందుకు దోహదపడుతుంది. అదీగాక అంతరిక్ష శాస్త్రవేత్తలు ఎన్నో కొత్త ప్రయోగాలతో సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికారు కూడా. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో మానవ అవసరాలకు సంబంధించిన ఎన్నో పరిశోధనలు చేశారు. అక్కడ మనం నివశించగలమా? మొక్కలు పెరుగతాయా? తదితరాలన్నింటి గురించి అధ్యయనాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ మేరకు అమెరికాకు చెందిన అంతర్జాతీయ అంతరిక్షసంస్థ అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకుని మొక్కలు పెరుతాయా లేఆదా అనే దానిపై 1970ల నుంచి పరిశోధనలు చేస్తున్నారు. ఆ పరిశోధన ఫలించింది. వారు పెంచిన ఓ మొక్క పెరగడమే గాక షష్పించింది. అత్యంత అసాధారణమైన వాతావరణంలో పుష్పించడం అనేది విస్మయానికి గురిచేసే విషయం. ఇది నాసా విజయానికి ప్రతీక. విశ్వ రహస్యాలను చేధించటానికి ఈ పరిశోధన ఉపకరిస్తుంది. అందుకు సంబంధించిన ఫోటోని నాసా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
ఈ జిన్నియా మొక్క అంతరిక్ష కేంద్రంలో వెజ్జీ సదుపాయంలో భాగంగా కక్ష్యలో పెరిగిందని ఓ క్యాప్షన్‌ని కూడా జోడించారు. ఈ మేరకు వ్యోమగామి కెజెల్ లిండ్‌గ్రెన్ మాట్లాడుతూ..మా అంతరిక్ష ఉద్యానవనం కేవలం ప్రదర్శ కోసం పెంచటం లేదని కక్షలో మొక్కలు ఎలా అభివృద్ధి చెందుతాయో తెలుసుకోవడం తోపాటు భూమి నుంచి పంటలు ఎలా పెంచాలో తెలుసుకునేందుకు ఉపకరిస్తుందన్నారు.
ఇప్పటి వరకు పాలకూర, టొమాటో, చిల్లీ పిప్పర్ వంటి వాటిని అంతరిక్ష కేంద్రంలో పెంచినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, నాసా షేర్ చేసిన ఫోట్ నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఇది అద్భుతం, పైగా అందమైనది అని ప్రశంసించగా, మరికొందరూ ఈ మొక్క పెరగడానికి ఎంత సమయం తీసుకుందని ప్రశ్నస్తూ పోస్టులు పెట్టారు. ఈ ఫోటోకి ఆర లక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి.
(చదవండి: ఐస్ క్రీమ్ తింటున్న కొద్దీ ఇంకా తినాలని ఎందుకు అనిపిస్తుంది?)
Comments
Please login to add a commentAdd a comment