![Netizen Asking To Kajal Aggarwal One Question - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/2/KAJAL-AGRWAL.jpg.webp?itok=tGSNRv_8)
సినిమాలకు గుడ్ బై చెబుతుందంటూ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌పై భారీగానే పుకార్లు వచ్చాయి. వాటంన్నిటినీ పక్కకు నెట్టేసి ఇండియన్2, భగవంత్ కేసరి, సత్యభామ వంటి భారీ చిత్రాలతో తను బిజీగా ఉంది. ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడుగుతున్నటువంటి పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. చాలా రోజుల తర్వాత తన అభిమానులతో సరదాగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆమె ముచ్చటించింది. తన పర్సనల్ లైఫ్, కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలను వారితో ఆమె పంచుకుంది.
(ఇదీ చదవండి: ఈ కారణంతో కీర్తి, కృతి షాకింగ్ డెషిషన్ తీసుకోనున్నారా?)
అయితే నేటిజన్స్ అడిగిన ప్రశ్నలన్నింటికీ కాజల్ ఎంతో ఓపికగా సమాధానం చెప్పింది. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఇలా ప్రశ్నించాడు 'మీరంటే నాకెంతో ఇష్టం.. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?' అని అడిగేశాడు కాజల్ అగర్వాల్ అతని ప్రశ్నకు సమాధానం చెబుతూ సారీ.. ఇప్పుడా అదృష్టం మీకు లేదు.. రెండున్నరేళ్ల క్రితమే ఆ అవకాశం మరొకరిని వరించింది. అంటూ సమాధానం చెప్పుకొచ్చింది. ఇంకేముంది ఇప్పుడిదే సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. తన స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లును ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు నీల్ కిచ్లు అనే కుమారుడు కూడా ఉన్నాడు.
(ఇదీ చదవండి: Lust stories 2: తమన్నాకు ఊహించనంత రెమ్యునరేషన్?)
Comments
Please login to add a commentAdd a comment