
ప్యారాగ్లైడింగ్ చేయాలంటే గుండెలో దమ్ముండాలి. మరి.. ఆకాశంలో అంత ఎత్తున ఎగరడమంటే మాటలా? మహేశ్‌బాబుకి ఆ దమ్ముంది. అందుకే రివ్వున ఎగిరారు. డాడీకి తగ్గ సన్ గౌతమ్. ‘నేను కూడా చేయగలను’ అంటూ ధైర్యంగా ప్యారాగ్లైడింగ్‌కి రెడీ అయ్యాడు. న్యూ ఇయర్ సందర్భంగా మహేశ్ తన భార్యపిల్లలు నమ్రత, గౌతమ్, సితారలతో కలసి హాలిడే ట్రిప్ వెళ్లారు. ఒమన్‌లో భర్త, కొడుకు చేసిన సందడిని నమ్రత సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. అంతకుముందు మహేశ్ చాలాసార్లు ప్యారాగ్లైడింగ్ చేశారు. ఈసారి గౌతమ్ కూడా ఉత్సాహపడ్డాడు.
తండ్రీ కొడుకులిద్దరూ గాల్లో కొద్ది సేపు చక్కర్లు కొట్టారు. ‘‘గౌతమ్ తొలిసారిగా ప్యారాగ్లైడింగ్ చేశాడు. అప్పుడే పిల్లలు పెద్దవాళ్లు అయిపోతున్నారు’’ అని ఈ సందర్భంగా నమ్రత పేర్కొన్నారు. ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత మహేశ్‌బాబు తిరిగి ‘భరత్ అను నేను’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న ఈ సినిమా ఏప్రిల్ 27న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment