
సోషల్ మీడియాలో తాజాగా పారాగ్లైడింగ్‌కు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఒక విదేశీయునికి సంబంధించినది. అతను పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో ఎంతో ఉద్వేగానికి గురయ్యాడు. అతను గాలిలో స్పృహతప్పి పోయాడు. స్పృహలోకి రాగానే ఏం చేసాడో చూస్తే ఎవరైనా నవ్వు ఆపుకోలేరు.
ఈ 15 సెకన్ల వీడియోలో ఒక వ్యక్తి పారాగ్లైడింగ్ చేస్తూ కనిపిస్తాడు. అతని పరిస్థితి చూస్తే అతను పారాగ్లైడింగ్‌ని పూర్తిగా ఆస్వాదించడం లేదని మనకు అర్థం అవుతుంది. పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో అతని నోరు తెరిచి ఉంది. మెడ కూడా వేలాడుతోంది. వెనుకనున్న పారాగ్లైడింగ్ శిక్షకుడు అతని పరిస్థితి చూసి నవ్వుతున్నాడు. భయం లేదా అమిత ఉత్సాహం కారణంగా వ్యక్తి స్పృహ కోల్పోయే అవకాశం ఉంది. అతనిని చూసిన గైడ్ అతన్ని నవ్వించడానికి ప్రయత్నించాడు. ఆ వ్యక్తి స్పృహ వచ్చిన వెంటనే బిగ్గరగా అరవడం మొదలెడతాడు.
ఈ వీడియోను సెప్టెంబర్ 13న @Enezator అనే వినియోగదారు Xలో భాగస్వామ్యం చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 78 వేలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. ఈ వీడియోను చూసినవారు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్.. ‘అతను ఉత్సాహం ఎక్కువై మూర్ఛపోయినట్లు నాకు అనిపించడం లేదని’ రాశారు. మరొకరు ‘భయంతో స్పృహతప్పిపోయాడు’ అని రాశారు. ఈ వీడియోను చూసిన కొంతమంది ‘తాము నవ్వు ఆపుకోలేకపోతున్నామని’ కామెంట్ చేశారు.
ఇది కూడా చదవండి: ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది?
fainted from excitement in the air pic.twitter.com/k7X80jze05
— Enezator (@Enezator) September 13, 2023