అమ్మో.. స్మృతీ ఇరానీ ఎంత డేర్‌ చేశారు! | Smriti Irani paragliding in Bir Billing, Himachal Pradesh | Sakshi
Sakshi News home page

అమ్మో.. స్మృతీ ఇరానీ ఎంత డేర్‌ చేశారు!

Published Thu, Jul 6 2017 6:09 PM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM

అమ్మో.. స్మృతీ ఇరానీ ఎంత డేర్‌ చేశారు!

అమ్మో.. స్మృతీ ఇరానీ ఎంత డేర్‌ చేశారు!

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇన్‌స్టాగ్రమ్‌లో చేరి కొద్ది రోజులే అవుతున్నా ఆమె ఫోస్ట్‌ చేస్తున్న ఫొటోలు, వీడియోలు మాత్రం తెగ క్రేజ్‌ను సంపాధించుకుంటున్నాయి. ప్రస్తుతం టెక్స్‌టైల్స్‌ విభాగ మంత్రిగా పనిచేస్తున్న ఆమె ఆ శాఖకు సంబంధించిన అంశాలకంటే తన వ్యక్తిగత అంశాలు ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ అంశాలే పంచుకుంటున్నారు. అయితే, ఇప్పటి వరకు ఆమె పంచుకున్నవి ఒక ఎత్తయితే, తాజాగా పంచుకున్న వీడియో మరొక ఎత్తు.

ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మృతి ఇరానీ నిజంగా ఎంత డేరింగ్‌ మహిళ అని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆమె హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిర్‌ బిల్లింగ్‌ ప్రాంతంలో పారాగ్లిడింగ్‌కు వెళ్లారు. వందల ఎత్తులో ఎగురుతూ సరదాగా గడిపారు. పారాగ్లిడింగ్‌కు వెళ్లే వారిలో సాధారణంగా కాస్తంత భయం, బెరుగు కంగారు కనిపిస్తుంది. కానీ, ఆమె మాత్రం చాలా ఉల్లాసంగా ఈ వీడియోలో కనిపించారు. అయితే, ఈ వీడియో చూసిన కొందరు వేరే విధంగా కూడా కామెంట్లు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement