భార్యను బలవంతంగా పారాగ్లైడింగ్ చేయిస్తే ఇలానే ఉంటుంది: ఫన్నీ వైరల్‌ వీడియో | Wifes Rant During Paragliding Goes Viral | Sakshi
Sakshi News home page

Viral Video: దేవుడా! నేనెందుకు అతన్ని పెళ్లి చేసుకున్నా..పారాగ్లైడింగ్ చేస్తున్నప్పడూ భార్య చేసిన గొడవ

Published Tue, Jan 18 2022 4:24 PM | Last Updated on Tue, Jan 18 2022 6:33 PM

Wifes Rant During Paragliding Goes Viral - Sakshi

Blaming her husband for taking on such adventures for fun: ఇటీవల కాలంలో భారతదేశంలో పారాగ్లైడింగ్ బాగా జనాదరణ పోందుతోంది. అంతేకాదు సాహస ప్రియులందరికీ ఇదే తొలి ఎంపికలో ఒకటిగా ఉంది. అయితే మనం ఇష్టపూర్వకంగా సాహసం చేయడం వేరు వేరేవాళ్ల బలవంతం మీద సాహాసయాత్ర చేస్తే వాళ్ల పరిస్థితి ఎంతలా ఉంటుందో చెప్పనవసరం లేదు. అచ్చం అలానే ఇక్కడొక భర్త తన భార్యకు ఇష్టం లేకపోయిన బలవంతంగా పారాగ్లైడింగ్ చేయిస్తే ఆమె చేసిన హడావిడి అంత ఇంత కాదు.

అసలు విషయంలోకెళ్తే...ఒక మహిళ తన భర్త బలవంతంపై పారాగ్లైడింగ్‌కి వెళ్లింది. అయితే ఆమె సాహాసయాత్ర ప్రారంభంలోనే తనకు చాలా భయంగా ఉంది.. తాను వెళ్లను అని చెబుతూనే ఉంది. ఈ మేరకు యాత్ర ప్రారంభంకాగానే ఒకటే భయంగా అరుస్తూ చేతులతో కళ్లు మూసేసుకుని కేకలు వేస్తోంది.

పాపం పారాగ్లైడింగ్‌ గైడ్‌ ధైర్యం చెప్పటానికి ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. పారాగ్లైడింగ్‌ పైకి వెళ్తున్నంత సేపు సదరు మహిళ భయంతో తన చేతులు మొద్దు బారిపోతున్నాయంటూ ఏడుస్తుంది. అయితే గైడ్‌ ఆమెను నవ్వించేందుకు జోక్‌లు వేస్తున్నప్పటికీ ఆమె తన భర్తను తిడుతూ..."దేవుడు నేను ఎందుకు పెళ్లి చేసుకున్న అతన్ని అంటూ భర్తను నిందించింది. అంతేకాదు నిన్ను చంపేస్తా అంటూ భర్తపై కోపంతో అరుస్తూ ఉంటుంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మీరు కుడా ఓ లుక్కేయండి.

(చదవండి: దేశీయ వ్యాక్సిన్‌తో ఒమిక్రాన్‌కి చెక్‌! త్వరలో క్లినికల్‌ ట్రయల్స్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement