న్యూఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీలో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌తో శనివారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ వీజేడీ పద్ధతిలో 17 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. రోహిత్ రాయుడు (156; 12 ఫోర్లు, 8 సిక్స్‌లు), తిలక్ వర్మ (132; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కడంతో... తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 360 పరుగులు సాధించింది.
అనంతరం హిమాచల్ 48 ఓ వర్లలో 9 వికెట్లకు 335 పరుగులు చేసింది. ఈ దశలో వెలుతురు మందగించడంతో ఆటను నిలిపి వేశారు. వీజేడీ పద్ధతిలో హిమాచల్ లక్ష్యాన్ని లెక్కించగా 353 పరుగులుగా వచ్చింది. దాంతో హైదరాబాద్ 17 పరుగులతో విజయాన్ని ఖాయం చేసుకుంది. బెంగళూరులో ఆంధ్ర, గోవా జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
Comments
Please login to add a commentAdd a comment