హైదరాబాద్‌ గెలుపు | Tanmay Agarwal,Tilak Varma again hand Hyderabad 2nd win on trot | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ గెలుపు

Published Tue, Feb 23 2021 4:32 AM | Last Updated on Tue, Feb 23 2021 4:32 AM

Tanmay Agarwal,Tilak Varma again hand Hyderabad 2nd win on trot - Sakshi

తన్మయ్‌ అగర్వాల్

సూరత్‌: దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. చత్తీస్‌గఢ్‌తో సోమవారం జరిగిన ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. చత్తీస్‌గఢ్‌ నిర్దేశించిన 243 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ 40.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (116 బంతుల్లో 122; 15 ఫోర్లు, సిక్స్‌) సెంచరీ చేయగా... తిలక్‌ వర్మ (78 బంతుల్లో 60; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. తొలి వికెట్‌కు వీరిద్దరు 131 పరుగులు జోడించారు. హిమాలయ్‌ అగర్వాల్‌ (36 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగు తేడాతో అర్ధ సెంచరీని కోల్పోయాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన చత్తీస్‌గఢ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 242 పరుగులు చేసింది. హర్‌ప్రీత్‌ సింగ్‌ భాటియా (63; 6 ఫోర్లు), అశుతోష్‌ సింగ్‌ (51; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. హైదరాబాద్‌ బౌలర్లలో మెహదీ హసన్‌ (3/32), రవితేజ (2/60) రాణించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement