విజయ్ హజారే ట్రోఫీలోనూ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ తన జోరును కనబరుస్తున్నాడు. టోర్నీలో రెండో శతకం సాధించిన తిలక్ వర్మ హైదరాబాద్‌ను నాకౌట్ స్టేజీకి మరింత దగ్గర చేశాడు. శనివారం మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో తిలక్ వర్మ(77 బంతుల్లో 126 నాటౌట్, 14 ఫోర్లు, ఏడు సిక్సర్లు), రోహిత్ రాయుడు(51 బంతుల్లో 39 నాటౌట్) నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 164 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ఇందులో తిలక్ వర్మవే 126 పరుగులు ఉన్నాయంటే అతనెంత ఎంత ధాటిగా ఆడాడో అర్థమవుతుంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన మణిపూర్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. తొమ్మిదో నెంబర్ బ్యాటర్ బికాష్ సింగ్ 44 పరుగులు నాటౌట్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. రెక్స్ సింగ్ 36 పరుగులు సాధించాడు. హైదరాబాద్ బౌలర్లలో ఎం. శశాంక్ 3, తిలక్ వర్మ, రోహిత్ రాయుడు చెరో రెండు వికెటక్లు తీశారు.
ఇప్పటివరకు లిస్ట్ ఏ క్రికెట్‌లో 23 మ్యాచ్‌లు ఆడిన తిలక్‌వర్మకు ఇది ఐదో సెంచరీ కావడం గమనార్హం. ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబాయి ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు తిలక్‌వర్మ. 14 మ్యాచుల్లో 397 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం ముంబాయి ఇండియన్స్ అతడిని రిటైన్ చేసుకుంది.
Tilak Verma - The Young Champ 🥰
— Oh My Cricket (@OhMyCric) April 6, 2022
#mumbaiindians #IPL2022 #TilakVarma pic.twitter.com/juEpRWVf9S
చదవండి: FIFA: సాకర్ సమరం.. దిగ్గజాలపై కన్ను వేయాల్సిందే
కోహ్లిని మించిన కెప్టెన్ లేడు.. కింగ్‌ను ఆకాశానికెత్తిన రైజింగ్ స్టార్
Comments
Please login to add a commentAdd a comment