rohit rayudu
-
బుచ్చిబాబు టోర్నీ ఫైనల్: పటిష్ట స్థితిలో హైదరాబాద్
చెన్నై: ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. ఛత్తీస్‌గఢ్ జట్టుతో జరుగుతున్న ఫైనల్లో హైదరాబాద్ ప్రత్యర్థి జట్టుకు 518 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. మ్యాచ్ మూడో రోజు హైదరాబాద్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 70.2 ఓవర్లలో 281 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రాహుల్ సింగ్ (68; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ రాధేశ్ (41; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.రోహిత్ రాయుడు భారీ సెంచరీఛత్తీస్గఢ్ బౌలర్ జీవేశ్ ఆరు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఛత్తీస్‌గఢ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 70.2 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటవ్వడంతో హైదరాబాద్‌కు 236 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి నాలుగు వికెట్లు తీయగా... రోహిత్ రాయుడు, తనయ్ త్యాగరాజన్‌లకు మూడు వికెట్ల చొప్పున లభించాయి. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 118.4 ఓవర్లలో 417 పరుగులు చేసింది. రోహిత్ రాయుడు (155; 8 ఫోర్లు, 8 సిక్స్‌లు) భారీ సెంచరీ సాధించాడు. అభిరత్ (85; 10 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ రాధేశ్ (48; 7 ఫోర్లు) ఆకట్టుకున్నారు.టీమిండియా స్టార్లు సైతంకాగా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లలో టీమిండియా స్టార్లు శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం శ్రేయస్, సర్ఫరాజ్ దులిప్ ట్రోఫీ-2024తో బిజీగా ఉండగా.. సూర్య, ఇషాన్ గాయాల బారిన పడ్డారు. చదవండి: DT 2024: భారత ‘ఎ’ జట్టులోషేక్ రషీద్.. టీమిండియాతో చేరని సర్ఫరాజ్ ఖాన్! -
Hyd: రెండ్రోజుల్లోనే టెస్టు ఖతం.. వరుసగా రెండో విజయం
రంజీ ట్రోఫీ-2024లో హైదరాబాద్ క్రికెట్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మేఘాలయను ఏకంగా ఇన్నింగ్స్ 81 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రెండురోజుల్లోనే మ్యాచ్ ముగించి సత్తా చాటింది. రంజీ ట్రోఫీ ‘ప్లేట్’ గ్రూప్‌లో భాగంగా మేఘాలయాతో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బౌలింగ్ చేసింది. మేఘాలయను తొలి ఇన్నింగ్స్‌లో 33.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ చేసింది. మేఘాలయ బ్యాటర్లలో కెప్టెన్ కిషన్ లింగ్డో (51) మినహా అంతా విఫలమయ్యారు. ఇక హైదరాబాద్ బౌలర్లలో పాలకోడేటి సాకేత్ సాయిరామ్ (4/33) నాలుగు వికెట్లు పడగొట్టగా... సీవీ మిలింద్, తనయ్ త్యాగరాజన్, రవితేజ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 47 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు సాధించింది. ఫలితంగా 71 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో 182/4 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన హైదరాబాద్ ఏడు వికెట్ల నష్టానికి 346 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రోహిత్ రాయుడు 124 పరుగులతో అజేయంగా నిలవగా.. చందన్ సహానీ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. సీవీ మిలింద్ 38 బంతుల్లోనే 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో మళ్లీ బ్యాటింగ్‌కు దిగిన మేఘాలయను 154 పరుగులకు కట్టడి చేసిన హైదరాబాద్ జయభేరి మోగించింది. కాగా ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో హైదరాబాద్ నాగాలాండ్‌ను ఇన్నింగ్స్ 194 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో అతడు జట్టును వీడగా.. రాహుల్‌సింగ్ గహ్లోత్ సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. -
Vijay Hazare Trophy 2023: ఆంధ్ర, హైదరాబాద్ ఓటమి
జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌హజారే ట్రోఫీలో ఆంధ్ర, హైదరాబాద్ జట్లకు పరాజయం ఎదురైంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్ 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై గెలుపొందింది. హైదరాబాద్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. రోహిత్ రాయుడు (130 బంతుల్లో 102; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. ఛత్తీస్‌గఢ్ 48.1 ఓవర్లలో 4 వికెట్లకు 273 పరుగులు సాధించింది. రిషభ్ తివారి (65), సంజీత్ దేశాయ్ (47), అశుతోష్ సింగ్ (45 నాటౌట్), ఏక్నాథ్ (43 నాటౌట్) రాణించారు. చండీగఢ్: మరో మ్యాచ్‌లో అస్సాం 5 వికెట్ల తేడాతో ఆంధ్రను ఓడించింది. ఆంధ్ర 31.5 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. అశి్వన్ హెబర్ (68 బంతుల్లో 50; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... హనుమ విహారి (23), రికీ భయ్ (20) విఫలమయ్యారు. ఆంధ్ర ఇన్నింగ్స్‌లో ఐదుగురు ‘డకౌట్’ కావడం విశేషం. ఆకాశ్ సేన్ గుప్తా (5/20) ఐదు వికెట్లతో ఆంధ్రను దెబ్బ తీశాడు. అస్సాం 24.2 ఓవర్లలో 5 వికెట్లకు 114 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కెరీర్లో తొలి వన్డే ఆడిన మాధవ్ రాయుడు (4/36) రాణించాడు. -
Vijay Hazare Trophy: రోహిత్ రాయుడు, తిలక్ వర్మ సెంచరీలు
న్యూఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీలో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌తో శనివారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ వీజేడీ పద్ధతిలో 17 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. రోహిత్ రాయుడు (156; 12 ఫోర్లు, 8 సిక్స్‌లు), తిలక్ వర్మ (132; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కడంతో... తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 360 పరుగులు సాధించింది. అనంతరం హిమాచల్ 48 ఓ వర్లలో 9 వికెట్లకు 335 పరుగులు చేసింది. ఈ దశలో వెలుతురు మందగించడంతో ఆటను నిలిపి వేశారు. వీజేడీ పద్ధతిలో హిమాచల్ లక్ష్యాన్ని లెక్కించగా 353 పరుగులుగా వచ్చింది. దాంతో హైదరాబాద్ 17 పరుగులతో విజయాన్ని ఖాయం చేసుకుంది. బెంగళూరులో ఆంధ్ర, గోవా జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. -
రోహిత్ రాయుడు సెంచరీ వృథా
సీజన్ మొత్తం నిలకడగా రాణించిన హైదరాబాద్ జట్టుకు కీలకపోరులో నిరాశే ఎదురైంది. హేమాహేమీలతో కూడిన ముంబై జోరు ముందు నిలవలేక సెమీఫైనల్లో ఓటమి పాలైంది. బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించి గౌరవప్రద స్కోరు చేసినా... పటిష్ట ముంబై లైనప్ ముందు అది సరిపోలేదు. స్టార్ బ్యాట్స్‌మెన్ జోరుకు తోడు వరుణుడు కూడా సహకరించడంతో విజయ్ హజారే టోర్నీలో ముంబై ఫైనల్‌కు దూసుకెళ్లింది. బెంగళూరు: విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నీలో హైదరాబాద్ జట్టు పోరాటం ముగిసింది. సంచలనాలు సృష్టిస్తూ తొలిసారి సెమీస్ చేరిన హైదరాబాద్ పటిష్ట ముంబైని నిలవరించలేక ఓటమి పాలైంది. క్వార్టర్స్‌లో ఆంధ్రపై గెలిచి మంచి జోరు మీదున్న హైదరాబాద్ సెమీస్‌లో ముంబై దూకుడు ముందు నిలువలేకపోయింది. రోహిత్ రాయుడు (132 బంతుల్లో 121 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగడంతో... టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ తుషార్ దేశ్‌పాండే (3/55) రాణించాడు. అనంతరం యువ సంచలనం పృథ్వీ షా (44 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (53 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో సత్తా చాటడంతో ముంబై 60 పరుగుల తేడాతో గెలుపొందింది. లక్ష్యఛేదనలో 25 ఓవర్లలో 155/2తో ముంబై బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. వర్షం తగ్గకపోవడంతో వీజేడీ పద్ధతి ప్రకారం ముంబైను విజేతగా ప్రకటించారు. వీజీడీ పద్ధతి ప్రకారం 25 ఓవర్లలో ముంబై విజయం ఖరారు కావాలంటే 95 పరుగులు చేయాల్సింది. అయితే ఆ స్కోరుకంటే ముంబై 60 పరుగులు ఎక్కువగానే చేసి విజయాన్ని దక్కించుకుంది. అతనొక్కడే... ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్న కెప్టెన్ అంబటి రాయుడు నిర్ణయం హైదరాబాద్‌కు కలిసిరాలేదు. ఈ టోర్నీలో ఇప్పటివరకు జట్టుకు శుభారంభాలు అందించిన ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (11), అక్షత్ రెడ్డి (7) విఫలమయ్యారు. తుషార్ చెలరేగడంతో వీరిద్దరూ పెవిలియన్ చేరారు. అనంతరం బావనక సందీప్ (29; 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి రోహిత్ రాయుడు ఇన్నింగ్స్‌ను చక్కబెట్టే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 50 పరుగులు జోడించాక సందీప్ ఔటయ్యాడు. ఆ తర్వాత అంబటి రాయుడు (11), సుమంత్ (3), సీవీ మిలింద్ (10) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. ఈ సమయంలో రోహిత్ రాయుడు ఆకాశ్ భండారి (19; 2 ఫోర్లు)తో కలిసి ఏడో వికెట్‌కు 57 పరుగులు... మెహదీ హసన్ (17 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 58 పరుగులు జోడించి జట్టుకు మంచి స్కోరు అందించాడు. లక్ష్యం చిన్నబోయింది... ఓ మోస్తరు లక్ష్యఛేదనలో బరిలో దిగిన ముంబైకి ఓపెనర్లు మెరుపు ఆరంభాన్నిచ్చారు. రోహిత్ శర్మ (24 బంతుల్లో 17; 2 ఫోర్లు) అండగా పృథ్వీ షా రెచ్చిపోయాడు. హైదరాబాద్ కెప్టెన్ అంబటి రాయుడు లెగ్ స్పిన్నర్ ఆకాశ్ భండారితో తొలి ఓవర్ వేసే అవకాశం ఇచ్చాడు. అయితే భండారి బౌలింగ్‌లో బౌండరీలతో పృథ్వీ షా విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 9.5 ఓవర్లలో 73 పరుగులు జోడించారు. షా ధాటికి హైదరాబాద్ ప్రధాన పేసర్ సిరాజ్ 3 ఓవర్లలోనే 33 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం మెహదీ హసన్ వరుస ఓవర్లలో వీరిద్దరినీ ఔట్ చేసినా... కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అజింక్య రహానే (17 నాటౌట్)తో కలిసి మూడో వికెట్‌కు అజేయంగా 73 పరుగులు జోడించాడు. దీంతో ముంబై 25 ఓవర్లలోనే 155/2తో నిలిచింది. నేడు జరిగే రెండో సెమీఫైనల్లో జార్ఖండ్‌తో ఢిల్లీ తలపడనుంది. గెలిచిన జట్టుతో శనివారం జరిగే ఫైనల్లో ముంబై ఆడుతుంది. -
భారత ‘ఎ’ జట్టులో రోహిత్ రాయుడు
ముంబై: దేవధర్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్లో పాల్గొనే భారత్ ‘ఎ’, ‘బి’ జట్లను సీనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం ఎంపిక చేసింది. ఈ జట్టులో హైదరాబాద్‌కు చెందిన ఓపెనర్ రోహిత్ రాయుడుకు చోటు దక్కింది. ఇన్నాళ్లు రంజీ జట్లకే పరిమితమైన రోహిత్ రాయుడు తొలిసారి భారత్ ‘ఎ’ జట్టుకు ఎంపికయ్యాడు. విజయ్ హజారే వన్డే టోర్నీలో అతను 7 మ్యాచ్‌ల్లో 357 పరుగులు చేసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఆంధ్ర ఆటగాళ్లలో రికీ భుయ్ కూడా ‘ఎ’ జట్టులో ఉండగా... హనుమ విహారి, కోనా శ్రీకర్ భరత్ ‘బి’ జట్టుకు ఎంపికయ్యారు. భారత ‘ఎ’ జట్టుకు అశ్విన్, ‘బి’ జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహిస్తారు. ఈ రెండు జట్లతో పాటు విజయ్ హజారే ట్రోఫీ విజేత కర్ణాటక జట్టు దేవధర్ టోర్నీలో తలపడుతుంది. మార్చి 4 నుంచి 8వ తేదీ వరకు ఈ టోర్నీ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇరానీ కప్‌లో పాల్గొనే రెస్టాఫ్ ఇండియా జట్టునూ ప్రకటించారు. దీనికి కరుణ్ నాయర్ సారథ్యం వహిస్తాడు. ఈ మ్యాచ్ వచ్చే నెల 14 నుంచి 18 వరకు జరుగుతుంది. ఇందులో రెస్టాఫ్ ఇండియా... రంజీ చాంపియన్ విదర్భతో తలపడుతుంది. -
హైదరాబాద్ ఆశలు సజీవం
సాక్షి, హైదరాబాద్: సమష్టి ఆటతీరుతో ఆకట్టుకున్న హైదరాబాద్ జట్టు విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. జమ్మూ కశ్మీర్‌తో సోమవారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో హైదరాబాద్ 149 పరుగులతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ సరిగ్గా 50 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది. జమ్మూ కశ్మీర్ బౌలర్ ఉమర్ నజీర్ ధాటికి హైదరాబాద్ 41 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ రోహిత్ రాయుడు (130 బంతుల్లో 130; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు), బావనాక సందీప్ (74 బంతుల్లో 72; 5 ఫోర్లు) బాధ్యతాయుత బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. రోహిత్ ఈ టోర్నీలో రెండో సెంచరీ నమోదు చేయగా... సందీప్ రెండో అర్ధ సెంచరీ సాధించాడు. స్కోరు 212 పరుగులవద్ద సందీప్ ఔటవ్వడంతో నాలుగో వికెట్‌కు 171 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత ధాటిగా పరుగులు సాధించే క్రమంలో హైదరాబాద్ వికెట్లు కోల్పోయి 312 పరుగులకు ఆలౌటైంది. జమ్మూ కశ్మీర్ బౌలర్ ఉమర్ నజీర్ 52 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం విశేషం. 313 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జమ్మూ కశ్మీర్ ఏదశలోనూ లక్ష్యాన్ని ఛేధించేలా కనిపించలేదు. హైదరాబాద్ బౌలర్లు సిరాజ్ (2/33), రవికిరణ్ (2/17), ఆకాశ్ భండారి (3/34) వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఆ జట్టు 34.1 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఇదే గ్రూప్‌లోని ఇతర మ్యాచ్‌ల్లో ఛత్తీస్‌గఢ్ ఏడు వికెట్లతో జార్ఖండ్‌పై... సౌరాష్ట్ర ఎనిమిది వికెట్లతో సర్వీసెస్‌పై గెలిచాయి. ప్రస్తుతం గ్రూప్ ‘డి’లో విదర్భ, హైదరాబాద్, ఛత్తీస్‌గఢ్ 16 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా... 12 పాయింట్లతో సౌరాష్ట్ర రెండో స్థానంలో ఉంది. బుధవారం జరిగే చివరి రౌండ్లో ఛత్తీస్‌గఢ్‌తో హైదరాబాద్; విదర్భతో సౌరాష్ట్ర తలపడతాయి. సమీకరణాల ప్రకారం ఈ నాలుగు జట్లకూ క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలు మిగిలి ఉన్నాయి. -
రోహిత్ రాయుడు సెంచరీ
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై హైదరాబాద్ క్రికెట్ జట్టు అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకుంది. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా గ్రూప్ ‘డి’లో రెండో విజయం సాధించింది. జార్ఖండ్‌తో మంగళవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 66 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 333 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ రాయుడు (135 బంతుల్లో 126; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత సెంచరీ చేయగా... కెప్టెన్ అక్షత్ రెడ్డి (73 బంతుల్లో 75; 8 ఫోర్లు, ఒక సిక్స్), బావనాక సందీప్ (45 బంతుల్లో 69; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. తొలి వికెట్‌కు అక్షత్‌తో 139 పరుగులు జోడించిన రోహిత్... రెండో వికెట్‌కు సందీప్‌తో 106 పరుగులు జత చేశాడు. జార్ఖండ్ బౌలర్లలో రాహుల్ శుక్లా రెండు వికెట్లు పడగొట్టగా... వరుణ్ ఆరోన్, వికాశ్, షాబాజ్ నదీమ్, విరాట్ సింగ్ ఒక్కో వికెట్ తీశారు. 334 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జార్ఖండ్ 46.5 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. అతుల్ సింగ్ (58 నాటౌట్; 7 ఫోర్లు), ఇషాన్ కిషన్ (51; 4 ఫోర్లు, ఒక సిక్స్), సౌరభ్ తివారి (49; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో రవికిరణ్ (2/41), సిరాజ్ (2/51), మెహదీ హసన్ (2/65) రాణించారు. గిరినాథ్‌కు ఆరు వికెట్లు... ఇదే టోర్నీలో భాగంగా చెన్నైలో గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఆరు వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్‌ను ఓడించి వరుసగా రెండో విజయం నమోదు చేసింది. గిరినాథ్ రెడ్డి (6/24) అద్భుత బౌలింగ్‌తో విజృంభించి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ 44.2 ఓవర్లలో 184 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఆంధ్ర జట్టు 38.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసి విజయాన్నందుకుంది. అశ్విన్ హెబర్ (42; 5 ఫోర్లు), కెప్టెన్ హనుమ విహారి (61; 9 ఫోర్లు) రెండో వికెట్‌కు 103 పరుగులు జతచేశారు. వీరిద్దరు అవుటయ్యాక రికీ భుయ్ (32 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్స్), డీవీ రవితేజ (33 నాటౌట్; 5 ఫోర్లు) జాగ్రత్తగా ఆడి ఆంధ్ర విజయాన్ని ఖాయం చేశారు. -
రోహిత్ రాయుడు డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: ఎ–1 డివిజన్ మూడు రోజుల క్రికెట్ లీగ్‌లో జై హనుమాన్ జట్టు బ్యాట్స్‌మన్ రోహిత్ రాయుడు (402 బంతుల్లో 207; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. దీంతో స్పోర్టింగ్ ఎలెవన్‌తో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో జై హనుమాన్ జట్టు భారీస్కోరు సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 238/4తో రెండోరోజు బుధవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన జై హనుమాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 154 ఓవర్లలో 430 పరుగులు చేసింది. తొలిరోజు సెంచరీతో ఆకట్టుకున్న రోహిత్ రాయుడు రెండో రోజు ఆటలో దాన్ని డబుల్ సెంచరీగా మలిచి ఈ సీజన్లో తన జోరును కొనసాగిస్తున్నాడు. ప్రత్యర్థి బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ 6 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన స్పోర్టింగ్ ఎలెవన్ జట్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి 28 ఓవర్లలో 2 వికెట్లకు 88 పరుగులతో నిలిచింది. తన్మయ్ అగర్వాల్ (30), తనయ్ త్యాగరాజన్ (30) క్రీజులో ఉన్నారు. కాంటినెంటల్ జట్టుతో జరుగుతోన్న మరో మ్యాచ్‌లో కేంబ్రిడ్జ్ జట్టు బ్యాట్స్‌మన్ మాన్సింగ్ రమేశ్ (290 బంతుల్లో 212 నాటౌట్; 21 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ ద్విశతకంతో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌ను కేంబ్రిడ్జ్ ఎలెవన్ జట్టు 100 ఓవర్లలో 434 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. జె. మల్లికార్జున్ (100 బంతుల్లో 107; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకంతో ఆకట్టుకోగా, సుజిత్ మనోహర్ (75) అర్ధసెంచరీ చేశాడు. తర్వాత కాంటినెంటల్ జట్టు ఆటముగిసే సమయానికి 2 ఓవర్లలో వికెట్ నష్టానికి 3 పరుగులతో ఉంది. ఇతర మ్యాచ్‌ల వివరాలు ఎస్బీఐ తొలి ఇన్నింగ్స్: 391/9 (బి. సుమంత్ 66, ఆకాశ్ భండారి 34; శ్రవణ్ 3/42, పుష్కర్ వల్లూరు 3/89), డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 153 (సందీప్ రాజన్ 49; రవికిరణ్ 3/32, ఆకాశ్ భండారి (5/76), డెక్కన్ క్రానికల్ రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్): 15/2 (10 ఓవర్లలో). ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స్: 196, బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 184 (చంద్రశేఖర్ 57, సాకేత్ సాయిరామ్ 38; రవితేజ 3/38), ఆంధ్రాబ్యాంక్ రెండో ఇన్నింగ్స్: 184/6 (ఆశిష్ రెడ్డి 55, అభినవ్ కుమార్ 36; సాకేత్ సాయిరామ్ 5/73), ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 318/5 (ఎన్. శరత్ ముదిరాజ్ 87, బెంజమిన్ 112, షేక్ సొహైల్ 63 బ్యాటింగ్), ఆర్. దయానంద్‌తో మ్యాచ్. పూల్ ‘బి’ మ్యాచ్‌ల వివరాలు ఏఓసీ తొలి ఇన్నింగ్స్: 232 హైదరాబాద్ బాట్లింగ్ తొలి ఇన్నింగ్స్: 216 (వినయ్ గౌడ్ 34, రవీందర్ రెడ్డి 77, ఎస్ పాండే 5/48), ఏఓసీ రెండో ఇన్నింగ్స్: 140/5 (శ్రీ చరణ్ 3/37); జెమిని ఫ్రెండ్స్ తొలి ఇన్నింగ్స్: 344 (మీర్ సయ్యద్ అలీ 40; ఏ. జయసూర్య 5/49), ఇండియా సిమెంట్స్ తొలి ఇన్నింగ్స్: 127 (సి. రాకేశ్ కుమార్ 52; అబ్దుల్ అల్ ఖురేషి 5/40), ఇండియా సిమెంట్స్ రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్): 130/4 (ఎంఎస్ఆర్ చరణ్ 83). ఎవర్గ్రీన్ తొలి ఇన్నింగ్స్: 133, ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ తొలి ఇన్నింగ్స్: 240 (ఎస్. చిరంజీవి 54, ఏ. రాకేశ్44; సుఖైన్ జైన్ 4/60, ఆదిత్య తోమర్ 3/56), ఎవర్గ్రీన్ రెండో ఇన్నింగ్స్: 80/5 (వై. జగదీశ్ కుమార్ 3/24).