రికీ భుయ్, రోహిత్ ,విహారి, భరత్
ముంబై: దేవధర్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్‌లో పాల్గొనే భారత్ ‘ఎ’, ‘బి’ జట్లను సీనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం ఎంపిక చేసింది. ఈ జట్టులో హైదరాబాద్‌కు చెందిన ఓపెనర్ రోహిత్ రాయుడుకు చోటు దక్కింది. ఇన్నాళ్లు రంజీ జట్లకే పరిమితమైన రోహిత్ రాయుడు తొలిసారి భారత్ ‘ఎ’ జట్టుకు ఎంపికయ్యాడు. విజయ్ హజారే వన్డే టోర్నీలో అతను 7 మ్యాచ్‌ల్లో 357 పరుగులు చేసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఆంధ్ర ఆటగాళ్లలో రికీ భుయ్ కూడా ‘ఎ’ జట్టులో ఉండగా... హనుమ విహారి, కోనా శ్రీకర్ భరత్ ‘బి’ జట్టుకు ఎంపికయ్యారు.
భారత ‘ఎ’ జట్టుకు అశ్విన్, ‘బి’ జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహిస్తారు. ఈ రెండు జట్లతో పాటు విజయ్ హజారే ట్రోఫీ విజేత కర్ణాటక జట్టు దేవధర్ టోర్నీలో తలపడుతుంది. మార్చి 4 నుంచి 8వ తేదీ వరకు ఈ టోర్నీ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇరానీ కప్‌లో పాల్గొనే రెస్టాఫ్ ఇండియా జట్టునూ ప్రకటించారు. దీనికి కరుణ్ నాయర్ సారథ్యం వహిస్తాడు. ఈ మ్యాచ్ వచ్చే నెల 14 నుంచి 18 వరకు జరుగుతుంది. ఇందులో రెస్టాఫ్ ఇండియా... రంజీ చాంపియన్ విదర్భతో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment