Vijay Hazare Trophy 2023: ఆంధ్ర, హైదరాబాద్‌ ఓటమి | Vijay Hazare Trophy 2023: Chhattisgarh beat Andhra to continue Hyderabad | Sakshi
Sakshi News home page

Vijay Hazare Trophy 2023: ఆంధ్ర, హైదరాబాద్‌ ఓటమి

Published Tue, Nov 28 2023 2:27 AM | Last Updated on Tue, Nov 28 2023 2:27 AM

Vijay Hazare Trophy 2023: Chhattisgarh beat Andhra to continue Hyderabad - Sakshi

జైపూర్‌: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌హజారే ట్రోఫీలో ఆంధ్ర, హైదరాబాద్‌ జట్లకు పరాజయం ఎదురైంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్‌ 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై గెలుపొందింది. హైదరాబాద్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. రోహిత్‌ రాయుడు (130 బంతుల్లో 102; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. ఛత్తీస్‌గఢ్‌ 48.1 ఓవర్లలో 4 వికెట్లకు 273 పరుగులు సాధించింది. రిషభ్‌ తివారి (65), సంజీత్‌ దేశాయ్‌ (47), అశుతోష్‌ సింగ్‌ (45 నాటౌట్‌), ఏక్‌నాథ్‌ (43 నాటౌట్‌) రాణించారు.

చండీగఢ్‌: మరో మ్యాచ్‌లో అస్సాం 5 వికెట్ల తేడాతో ఆంధ్రను ఓడించింది. ఆంధ్ర 31.5 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. అశి్వన్‌ హెబర్‌ (68 బంతుల్లో 50; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... హనుమ విహారి (23), రికీ భయ్‌ (20) విఫలమయ్యారు. ఆంధ్ర ఇన్నింగ్స్‌లో ఐదుగురు ‘డకౌట్‌’ కావడం విశేషం. ఆకాశ్‌ సేన్‌ గుప్తా (5/20) ఐదు వికెట్లతో ఆంధ్రను దెబ్బ తీశాడు. అస్సాం 24.2 ఓవర్లలో 5 వికెట్లకు 114 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కెరీర్‌లో తొలి వన్డే ఆడిన మాధవ్‌ రాయుడు (4/36) రాణించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement