జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ మరో పరాజయాన్ని చవిచూసింది. బుధవారం గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో సర్వీసెస్ 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 50 ఓవర్లలో 210 పరుగుల వద్ద ఆలౌటైంది. రాహుల్ బుద్ధి (87 బంతుల్లో 80; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), తన్మయ్ అగర్వాల్ (45; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. సర్వీసెస్ 40.5 ఓవర్లలో 4 వికెట్లకు 211 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పలివాల్ (101 బంతుల్లో 77 నాటౌట్; 6 ఫోర్లు), వినీత్ ధన్కర్ (76 బంతుల్లో 78; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో సర్వీసెస్‌ను గెలిపించారు.
విహారి, హెబ్బర్ రాణించినా..
చండీగఢ్: గ్రూప్ ‘డి’లో ఆంధ్ర జట్టు కూడా వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడింది. రాజస్తాన్ 38 పరుగుల తేడాతో ఆంధ్రపై విజయం సాధించింది. ముందుగా రాజస్తాన్ 50 ఓవర్లలో 290 పరుగుల వద్ద ఆలౌటైంది. అభిజిత్ తోమర్ (115 బంతుల్లో 124; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, రామ్ చౌహాన్ (68 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. పిన్నింటి తపస్వికి 4 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఆంధ్ర 47.4 ఓవర్లలో 252 పరుగుల వద్ద ఆలౌటైంది. హనుమ విహారి (80 బంతుల్లో 60; 9 ఫోర్లు), అశ్విన్ హెబ్బర్ (89 బంతుల్లో 68; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించినా... మిడిలార్డర్ వైఫల్యంతో ఆంధ్ర ఓటమిపాలయ్యింది. అనికేత్ చౌదరి 4 వికెట్లతో దెబ్బ తీసాడు.
Comments
Please login to add a commentAdd a comment