Deodhar Trophy 2023: Riyan Parag Scores Century 102 Runs In 68 Balls With 6 Fours And 5 Sixes, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Deodhar Trophy 2023:పరాగ్‌ విధ్వంసకర సెంచరీ.. 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో! నీలో ఇంత టాలెంట్‌ ఉందా?

Published Tue, Aug 1 2023 2:20 PM

 Deodhar Trophy 2023: Two hundreds in five days for Riyan Parag - Sakshi

దియోదర్‌ ట్రోఫీ-2023లో ఈస్ట్‌జోన్‌ స్టార్‌ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా వెస్ట్‌జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పరాగ్‌ మెరుపు సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 68 బంతులు ఎదుర్కొన్న పరాగ్‌ 6 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 102 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ టోర్నీలో అతడికి ఇది రెండో సెంచరీ కావడం గమానర్హం.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఈస్ట్‌జోన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. నార్త్‌జోన్‌ బ్యాటర్లలో పరాగ్‌తో పాటు అభిమన్యు ఈశ్వరన్‌(38), ఉత్కర్ష్‌ సింగ్‌(50) విరాట్‌ సింగ్‌(42) పరుగులతో రాణించారు. ఇక 320 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్ట్‌జోన్‌ 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. ఇక  రియాన్‌ పరాగ్‌ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పరాగ్‌ ప్రదర్శనపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. "నీలో ఇంత టాలెంట్‌ ఉందా, అస్సలు ఊహించలేదంటూ" సెటైర్లు వేస్తున్నారు.

నార్త్‌జోన్‌ ఘన విజయం
ఇక మరో మ్యాచ్‌లో నార్త్‌ఈస్ట్‌జోన్‌పై నార్త్‌జోన్‌ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నార్త్‌ ఈస్ట్‌జోన్‌ కేవలం 101 పరుగులకే కుప్పకూలింది. మయాంక్‌ మార్కండే 4 వికెట్లు, మయాంక్‌ యాదవ్‌ 3 వికెట్లతో నార్త్‌ఈస్ట్‌ పతనాన్ని శాసించారు. అనంతరం 102 పరుగుల లక్ష​ంతో బరిలోకి దిగిన నార్త్‌జోన్‌ 12 ఓవర్లలోనే ఛేదించింది. నార్త్‌జోన్‌ బ్యాటర్లలో ప్రభుసిమ్రాన్‌ సింగ్‌(40 నాటౌట్‌), హిమాన్షు రాణా(52 నాటౌట్‌) పరుగులతో రాణించారు.
చదవండి: Ravindra Jadeja On Kapil Dev Remarks: మేమంతా దేశం కోసమే ఆడతాం.. అంతేగానీ: కపిల్‌ దేవ్‌కు జడ్డూ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement