రోహిత్‌ రాయుడు డబుల్‌ సెంచరీ | rohit rayudu gets double century | Sakshi
Sakshi News home page

రోహిత్‌ రాయుడు డబుల్‌ సెంచరీ

Published Thu, Jul 13 2017 10:35 AM | Last Updated on Tue, Sep 5 2017 3:57 PM

రోహిత్‌ రాయుడు డబుల్‌ సెంచరీ

రోహిత్‌ రాయుడు డబుల్‌ సెంచరీ

సాక్షి, హైదరాబాద్‌: ఎ–1 డివిజన్‌ మూడు రోజుల క్రికెట్‌ లీగ్‌లో జై హనుమాన్‌ జట్టు బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ రాయుడు (402 బంతుల్లో 207; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. దీంతో స్పోర్టింగ్‌ ఎలెవన్‌తో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో జై హనుమాన్‌ జట్టు భారీస్కోరు సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 238/4తో రెండోరోజు బుధవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన జై హనుమాన్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 154 ఓవర్లలో 430 పరుగులు చేసింది. తొలిరోజు సెంచరీతో ఆకట్టుకున్న రోహిత్‌ రాయుడు రెండో రోజు ఆటలో దాన్ని డబుల్‌ సెంచరీగా మలిచి ఈ సీజన్‌లో తన జోరును కొనసాగిస్తున్నాడు. ప్రత్యర్థి బౌలర్లలో తనయ్‌ త్యాగరాజన్‌ 6 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన స్పోర్టింగ్‌ ఎలెవన్‌ జట్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి 28 ఓవర్లలో 2 వికెట్లకు 88 పరుగులతో నిలిచింది. తన్మయ్‌ అగర్వాల్‌ (30), తనయ్‌ త్యాగరాజన్‌ (30) క్రీజులో ఉన్నారు.  

కాంటినెంటల్‌ జట్టుతో జరుగుతోన్న మరో మ్యాచ్‌లో కేంబ్రిడ్జ్‌ జట్టు బ్యాట్స్‌మన్‌ మాన్‌సింగ్‌ రమేశ్‌ (290 బంతుల్లో 212 నాటౌట్‌; 21 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ ద్విశతకంతో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌ను కేంబ్రిడ్జ్‌ ఎలెవన్‌ జట్టు 100 ఓవర్లలో 434 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. జె. మల్లికార్జున్‌ (100 బంతుల్లో 107; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకంతో ఆకట్టుకోగా, సుజిత్‌ మనోహర్‌ (75) అర్ధసెంచరీ చేశాడు. తర్వాత కాంటినెంటల్‌ జట్టు ఆటముగిసే సమయానికి 2 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 3 పరుగులతో ఉంది.

ఇతర మ్యాచ్‌ల వివరాలు

ఎస్‌బీఐ తొలి ఇన్నింగ్స్‌: 391/9 (బి. సుమంత్‌ 66, ఆకాశ్‌ భండారి 34; శ్రవణ్‌ 3/42, పుష్కర్‌ వల్లూరు 3/89), డెక్కన్‌ క్రానికల్‌ తొలి ఇన్నింగ్స్‌: 153 (సందీప్‌ రాజన్‌ 49; రవికిరణ్‌ 3/32, ఆకాశ్‌ భండారి (5/76), డెక్కన్‌ క్రానికల్‌ రెండో ఇన్నింగ్స్‌ (ఫాలోఆన్‌): 15/2 (10 ఓవర్లలో).

ఆంధ్రాబ్యాంక్‌ తొలి ఇన్నింగ్స్‌: 196, బీడీఎల్‌ తొలి ఇన్నింగ్స్‌: 184 (చంద్రశేఖర్‌ 57, సాకేత్‌ సాయిరామ్‌ 38; రవితేజ 3/38), ఆంధ్రాబ్యాంక్‌ రెండో ఇన్నింగ్స్‌: 184/6 (ఆశిష్‌ రెడ్డి 55, అభినవ్‌ కుమార్‌ 36; సాకేత్‌ సాయిరామ్‌ 5/73),
ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్‌: 318/5 (ఎన్‌. శరత్‌ ముదిరాజ్‌ 87, బెంజమిన్‌ 112, షేక్‌ సొహైల్‌ 63 బ్యాటింగ్‌), ఆర్‌. దయానంద్‌తో మ్యాచ్‌.

పూల్‌ ‘బి’ మ్యాచ్‌ల వివరాలు

ఏఓసీ తొలి ఇన్నింగ్స్‌: 232 హైదరాబాద్‌ బాట్లింగ్‌ తొలి ఇన్నింగ్స్‌: 216 (వినయ్‌ గౌడ్‌ 34, రవీందర్‌ రెడ్డి 77, ఎస్‌ పాండే 5/48), ఏఓసీ రెండో ఇన్నింగ్స్‌: 140/5 (శ్రీ చరణ్‌ 3/37);

జెమిని ఫ్రెండ్స్‌ తొలి ఇన్నింగ్స్‌: 344 (మీర్‌ సయ్యద్‌ అలీ 40; ఏ. జయసూర్య 5/49), ఇండియా సిమెంట్స్‌ తొలి ఇన్నింగ్స్‌: 127 (సి. రాకేశ్‌ కుమార్‌ 52; అబ్దుల్‌ అల్‌ ఖురేషి 5/40), ఇండియా సిమెంట్స్‌ రెండో ఇన్నింగ్స్‌ (ఫాలోఆన్‌): 130/4 (ఎంఎస్‌ఆర్‌ చరణ్‌ 83).
ఎవర్‌గ్రీన్‌ తొలి ఇన్నింగ్స్‌: 133, ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ తొలి ఇన్నింగ్స్‌: 240 (ఎస్‌. చిరంజీవి 54, ఏ. రాకేశ్‌44; సుఖైన్‌ జైన్‌ 4/60, ఆదిత్య తోమర్‌ 3/56), ఎవర్‌గ్రీన్‌ రెండో ఇన్నింగ్స్‌: 80/5 (వై. జగదీశ్‌ కుమార్‌ 3/24).

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement