తిలక్ వర్మ, తన్మయ్ అగర్వాల్
మొహాలీ: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. హరియాణాతో బుధవారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తిలక్ వర్మ (4/23), రవితేజ (3/23) ధాటికి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హరియాణా 39.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. అనంతరం హైదరాబాద్ 41 ఓవర్లలో ఐదు వికెట్లకు 167 పరుగులు చేసి విజయం సాధించింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (77 నాటౌట్; 5 ఫోర్లు), కొల్లా సుమంత్ (20), తనయ్ (18 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. నేడు జరిగే రెండో మ్యాచ్‌లో ఢిల్లీతో హైదరాబాద్ ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment