![VHT 2023 Bawane 113 Jadhav Help Maharashtra Beat Hyderabad By 3 Wickets - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/2/vht.jpg.webp?itok=5QeLoHXj)
తన్మయ్ అగర్వాల్- కేదార్ జాదవ్
జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌హజారే ట్రోఫీలో హైదరాబాద్‌కు ‘హ్యాట్రిక్’ పరాజయం ఎదురైంది. గ్రూప్ ‘బి’లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర 3 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. ఈ వన్డే టోర్నీలో తొలి 2 మ్యాచ్‌లు నెగ్గిన హైదరాబాద్ ఆపై వరుసగా మూడు మ్యాచ్‌లలో పరాజయంపాలైంది.
మహారాష్ట్రతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (117 బంతుల్లో 103; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించగా... కెప్టెన్ రాహుల్ సింగ్ (69), రాహుల్ బుద్ధి (58 నాటౌట్), రవితేజ (51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో అండగా నిలిచారు.
అనంతరం మహారాష్ట్ర 49.4 ఓవర్లలో 7 వికెట్లకు 316 పరుగులు సాధించింది. అంకిత్ బావ్నే (108 బంతుల్లో 113; 12 ఫోర్లు, 1 సిక్స్) శతకానికి తోడు అజీమ్ కాజీ (80), కౌశల్ తాంబే (38), కెప్టెన్ కేదార్ జాదవ్ (32 నాటౌట్) రాణించి జట్టును గెలిపించారు. మరోవైపు చండీగఢ్‌లో ఆంధ్ర, గుజరాత్ జట్ల మధ్య జరగాల్సిన గ్రూప్ ‘డి’ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది.
Comments
Please login to add a commentAdd a comment