Rahul Singh
-
మనోళ్లు దంచికొట్టారు.. ఒక్కడే 323 నాటౌట్! 357 రన్స్ ఆధిక్యం
Hyderabad vs Arunachal Pradesh- Hyderabad lead by 357 runs: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో హైదరాబాద్ అద్భుత ప్రదర్శన సాగుతోంది. ఇప్పటికే ఆరంభ మ్యాచ్‌లో తిలక్ వర్మ కెప్టెన్సీలో నాగాలాండ్‌పై 194 పరుగుల తేడాతో గెలుపొందిన హైదరాబాద్.. రెండో మ్యాచ్‌లో రాహుల్ సింగ్ గహ్లోత్ సారథ్యంలో మేఘాలయను 81 రన్స్‌తో చిత్తు చేసింది. 172 పరుగులకే ఆలౌట్ ముచ్చటగా మూడో మ్యాచ్‌లోనూ అద్భుత ఆట తీరుతో సిక్కింపై 198 పరుగుల తేడాతో గెలుపొందింది. హ్యాట్రిక్ విజయాల తర్వాత ఇప్పుడు మరో భారీ గెలుపుపై కన్నేసింది. ప్లేట్ గ్రూపులో ఉన్న హైదరాబాద్- అరుణాచల్ ప్రదేశ్ మధ్య శుక్రవారం రంజీ మ్యాచ్ మొదలైంది.సొంతగడ్డపై నెక్స్‌జెన్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బౌలింగ్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌ను 172 పరుగులకే కట్టడి చేసింది. సంచలన ఆరంభం.. హైదరాబాద్ బౌలర్లలో సీవీ మిలింద్, కార్తికేయ మూడేసి వికెట్లు తీయగా.. టి.త్యాగరాజన్ రెండు, సాకేత్, ఇల్లిగరం సంకేత్ తలా ఓ వికెట్ తీశారు. ఈ క్రమంలో తొలి రోజే బ్యాటింగ్ ఆరంభించిన హైదరాబాద్‌కు ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్, గహ్లోత్ రాహుల్ సింగ్ సంచలన ఆరంభం అందించారు. 33 ఫోర్లు, 21 సిక్సర్లు తన్మయ్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ నమోదు చేయగా.. గహ్లోత్ 105 బంతుల్లో 185 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. తన్మయ్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొదటి రోజు ఆట ముగిసే సరికి 160 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 323 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 33 ఫోర్లు, 21 సిక్సర్లు ఉన్నాయి. రంజీ మ్యాచ్‌లో తన్మయ్ టీ20 తరహా ఇన్నింగ్స్ కారణంగా హైదరాబాద్ మొదటి రోజు వికెట్ నష్టానికి 48 ఓవర్లలోనే 529 పరుగులు చేసింది. తద్వారా అరుణాచల్ ప్రదేశ్‌పై 357 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తన్మయ్‌కు తోడుగా అభిరథ్ రెడ్డి 19 రన్స్‌తో క్రీజులో ఉన్నాడు. చదవండి: చూసుకోవాలి కదా... జడ్డూ సైగ.. కోపంగా వెళ్లిన అశ్విన్! రనౌట్ వల్ల.. -
Hyd: రెండ్రోజుల్లోనే టెస్టు ఖతం.. వరుసగా రెండో విజయం
రంజీ ట్రోఫీ-2024లో హైదరాబాద్ క్రికెట్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మేఘాలయను ఏకంగా ఇన్నింగ్స్ 81 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రెండురోజుల్లోనే మ్యాచ్ ముగించి సత్తా చాటింది. రంజీ ట్రోఫీ ‘ప్లేట్’ గ్రూప్‌లో భాగంగా మేఘాలయాతో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బౌలింగ్ చేసింది. మేఘాలయను తొలి ఇన్నింగ్స్‌లో 33.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ చేసింది. మేఘాలయ బ్యాటర్లలో కెప్టెన్ కిషన్ లింగ్డో (51) మినహా అంతా విఫలమయ్యారు. ఇక హైదరాబాద్ బౌలర్లలో పాలకోడేటి సాకేత్ సాయిరామ్ (4/33) నాలుగు వికెట్లు పడగొట్టగా... సీవీ మిలింద్, తనయ్ త్యాగరాజన్, రవితేజ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 47 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు సాధించింది. ఫలితంగా 71 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో 182/4 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన హైదరాబాద్ ఏడు వికెట్ల నష్టానికి 346 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రోహిత్ రాయుడు 124 పరుగులతో అజేయంగా నిలవగా.. చందన్ సహానీ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. సీవీ మిలింద్ 38 బంతుల్లోనే 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో మళ్లీ బ్యాటింగ్‌కు దిగిన మేఘాలయను 154 పరుగులకు కట్టడి చేసిన హైదరాబాద్ జయభేరి మోగించింది. కాగా ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో హైదరాబాద్ నాగాలాండ్‌ను ఇన్నింగ్స్ 194 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో అతడు జట్టును వీడగా.. రాహుల్‌సింగ్ గహ్లోత్ సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. -
హైదరాబాద్ ఓటమి.. కేదార్ జాదవ్ కెప్టెన్సీలో మహారాష్ట్ర గెలుపు
జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌హజారే ట్రోఫీలో హైదరాబాద్‌కు ‘హ్యాట్రిక్’ పరాజయం ఎదురైంది. గ్రూప్ ‘బి’లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర 3 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. ఈ వన్డే టోర్నీలో తొలి 2 మ్యాచ్‌లు నెగ్గిన హైదరాబాద్ ఆపై వరుసగా మూడు మ్యాచ్‌లలో పరాజయంపాలైంది. మహారాష్ట్రతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (117 బంతుల్లో 103; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించగా... కెప్టెన్ రాహుల్ సింగ్ (69), రాహుల్ బుద్ధి (58 నాటౌట్), రవితేజ (51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో అండగా నిలిచారు. అనంతరం మహారాష్ట్ర 49.4 ఓవర్లలో 7 వికెట్లకు 316 పరుగులు సాధించింది. అంకిత్ బావ్నే (108 బంతుల్లో 113; 12 ఫోర్లు, 1 సిక్స్) శతకానికి తోడు అజీమ్ కాజీ (80), కౌశల్ తాంబే (38), కెప్టెన్ కేదార్ జాదవ్ (32 నాటౌట్) రాణించి జట్టును గెలిపించారు. మరోవైపు చండీగఢ్‌లో ఆంధ్ర, గుజరాత్ జట్ల మధ్య జరగాల్సిన గ్రూప్ ‘డి’ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. చదవండి: టీమిండియా హెడ్‌కోచ్ అయితేనేం! కుమారుల కోసం అలా.. -
ఆరోగ్య సంరక్షణపై దశాబ్దాల నిర్లక్ష్యం
ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల ఘోర దుస్థితికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత కాకపోవచ్చు. కానీ ఉన్న వసతులను మెరుగుపర్చే విషయంలో మోదీ ప్రభుత్వం పెద్దగా చేసిందేమీ లేదు. ప్రజారోగ్య మౌలిక వసతులను తగినంతగా నిర్మించడంలో వైఫల్యానికి 1947 నుంచి అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాలూ కారణమే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాలు దీనికి ప్రధానంగా బాధ్యత వహించాలి. కాని ఈ వైఫల్యానికి ఇతర పార్టీలు కూడా ఎంతో కొంత బాధ్యత వహించక తప్పదు. పైగా కొందరు బీజేపీ కీలక నేతల అహేతుకమైన, అశాస్త్రీయమైన ఆలోచనా తీరు కలవరం కల్గిస్తోంది. ఆధునిక ఆరోగ్య మౌలిక వసతుల కల్పనకు ఆధునిక, హేతుపూర్వకమైన శాస్త్రీయ దృక్పథం చాలా అవసరం. పరస్పరం ఆరోపించుకునే క్రీడను కట్టిపెడదాం. మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థది ఒకానొక దుఃఖకరమైన నిర్లక్ష్యపూరితమైన విషాదకర గాథ అని చెప్పడంలో సందేహమే లేదు. ఈ పరమ నిర్లక్ష్యానికి దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రధాని నరేంద్రమోదీ ఏడేళ్ల పాలనలోనే ఇలా జరిగిందని చెప్పలేము. దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న నిరంతర నిర్లక్ష్య ఫలితంగానే ప్రస్తుతం కరోనా మహమ్మారి విసురుతున్న పెనుసవాళ్లను ఎదుర్కోలేక ప్రభుత్వ వ్యవస్థ చేష్టలుడిగిపోతోంది. కరోనా ఫస్ట్ వేవ్ కూడా తీవ్రంగా విరుచుకుపడింది కానీ దాన్ని మనం కొన్ని అగ్రదేశాల కంటే కాస్త మెరుగైన రీతిలోనే ఎదుర్కోగలిగాం. కానీ ఆ తర్వాతే నిర్లక్ష్యం, అలసత్వం ఆవరించింది. 2021లో కరోనా సోకిన కేసులు, మరణాల రేట్లు ఇతరదేశాలతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయని సంబరపడిపోయాం. ఆ తర్వాత సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరమైన ప్రాణాంతకమైన మ్యుటెంట్ రకాలతో విరుచుకుపడింది. అప్పటికే చాలీచాలని సౌకర్యాలతో, తక్కువ మంది వైద్య సిబ్బందితో కునారిల్లుతున్న ఆరోగ్య మౌలిక వసతుల కల్పనా రంగం దీని తాకిడిని ఏమాత్రం తట్టుకోలేకపోతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఇప్పుడున్న అంబులెన్సుల కంటే అయిదు రెట్ల సంఖ్యలో అంబులెన్సులు భారత్‌కు అవసరమని తెలుస్తోంది. అంబులెన్స్ సౌకర్యం లేక కార్లు, రిక్షాలలో సైతం తీసుకుపోతున్న కరోనా రోగులు శ్వాస సమస్యతో రొప్పుతూ, ఆసుపత్రిలో బెడ్ కోసం తీవ్ర ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్నటువంటి హృదయ విదారకమైన దృశ్యాల వర్ణనలతో టీవీలు, సోషల్ మీడియా నిత్యం ముంచెత్తుతున్నాయి. అనేకమంది ఆసుపత్రుల వెలుపలే చనిపోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ కాలంలో ప్రపంచదేశాలన్నింటికంటే అధికంగా భారత్‌లోనే కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తం కరోనా మరణాల్లో మూడో వంతు భారత్‌లోనే సంభవించాయి. అయితే అధికారిక గణాంకాల కంటే 10 రెట్లు అధికంగా వాస్తవ మరణాలు ఉంటున్నాయని ఆధార సహితంగా తెలుస్తూండటం గమనార్హం. ఈరోజుల్లో యావత్ ప్రపంచ దృష్టి భారత్‌మీదే కేంద్రీకృతమై ఉందంటే ఏమాత్రం ఆశ్చర్యపడాల్సింది లేదు. గంగానదిలో డజన్లకొద్దీ శవాలు తేలియాడుతున్న భయానక దృశ్యాలు వణికిస్తున్నాయి. ఈ పవిత్ర నది గట్లలో భారీ యంత్రాల సాయంతో గోతులు తవ్వుతూ నదిలో కొట్టుకువస్తున్న శవాలను పూడ్చటానికి స్మశాన క్షేత్రాలను రూపొందిస్తున్నారు. గత బుధవారం ఒక టీవీ చానల్ వారు ఉత్తరప్రదేశ్ లోని ఎటావాలో ఉన్న అతిపెద్ద ఆసుపత్రిని సందర్శించారు. దాంట్లో 100 పడకలు ఉన్నాయి. కానీ అంతకుమించిన రోగులు ఆసుపత్రిలో నేలమీద పడుకుని ఉన్నారు. ఇదే ఘోరమనుకుంటే అంతమంది రోగులున్న ఆ ఆసుపత్రిలో ఒక్క డాక్టర్ కానీ, నర్సు కానీ కనిపించలేదంటే నమ్మశక్యం కాదు. చివరకు ఆసుపత్రి పాలనాయంత్రాంగం నుంచి ఒక్కరూ అక్కడ లేకపోవడం విచారకరం. పైగా పారిశుధ్య సిబ్బంది గైర్హాజరీతో ఒక్క టాయెలెట్ కూడా అక్కడ పనిచేయడం లేదు. ఇంతవరకు మహమ్మారి పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా వ్యాపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో వైరస్ వ్యాపిస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో పరిస్థితి ఏమిటి? గ్రామాల్లో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఉనికిలోనే లేని నేపథ్యంలో ప్రభుత్వ ఆరోగ్య వసతి కల్పన ఘోరంగా ఉంటోంది. భారత్‌కు 73 సంవత్సరాల క్రితం స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు, ఆర్థిక, సామాజిక అభివృద్ధికోసం ప్రాధమ్యాలను దేశం నిర్ణయించుకోవలసి వచ్చింది. విషాదకరంగా ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అనే రెండు అత్యంత కీలకమైన రంగాలను ప్రారంభం నుంచి నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దేశంలో ఉన్నత విద్యారంగంలో ప్రపంచ స్థాయి బోధనా సంస్థలను నెలకొల్పారు. అద్భుతమైన ఆసుపత్రులను నిర్మించారు. కానీ ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో తగినన్ని ప్రాథమిక పాఠశాలలు లేవు. వైద్య క్లినిక్కులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలూ లేవు. దీని ఫలితంగానే ముఖ్యంగా బాలికల్లో అక్షరాస్యతా స్థాయి పడిపోయింది. అదేవిధంగా సగటు ఆయుర్దాయం కూడా పడిపోయింది. మంచి ప్రజారోగ్య సంరక్షణకు ఇదే అసలైన సూచిక. చైనా, చివరకు ముస్లిం దేశమైన ఇండోనేషియా వంటి అతిపెద్ద దేశాలు కూడా తమ ప్రాధమ్యాలను సరైన విధంగా నిర్ణయించుకున్నాయి. ఇవి తొలి నుంచీ ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత నిచ్చాయి. ఈ రెండు దేశాల్లోనూ 1947 నాటికి భారత్ కంటే తక్కువ అక్షరాస్యతను, తక్కువ ఆయుర్దాయాన్ని కలిగి ఉండేవి. కానీ 1980లలో ఈ రెండు కీలక రంగాల్లో ఈ దేశాలు అవలీలగా భారత్‌ని దాటి ముందుకెళ్లిపోయాయి. ప్రజారోగ్య మౌలిక వసతులను తగినంతగా నిర్మించడంలో వైఫల్యానికి 1947 నుంచి అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాలూ కారణమే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాలు దీనికి ప్రధానంగా బాధ్యత వహించాలి. కాని ఈ వైఫల్యానికి ఇతర పార్టీలు కూడా ఎంతో కొంత బాధ్యత వహించక తప్పదు. వివిధ కేంద్రప్రభుత్వాలు నియమిస్తూ వచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రుల ఎంపికలోనే ప్రజారోగ్యానికి ఎంత తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనేది దాగి ఉంది. జనతాపార్టీ తరపున రాజ్ నారాయణ్, కాంగ్రెస్ తరపు ఏఆర్ ఆంతూలే వంటి వారు దీనికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. అత్యంత ప్రముఖ, అగ్రశ్రేణి సంస్థలు సైతం కాలం గడిచేకొద్దీ నిర్వహణాలోపం, అవినీతి కారణంగా ప్రమాణాలు దిగజార్చుకుంటూ వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక చిన్న హిల్ స్టేషన్ అయిన కసౌలీలో 1904లోనే కేంద్ర పరిశోధనా సంస్థ (సీఆర్ఐ)ని నెలకొల్పారు. ఇది ఒకప్పుడు పలు రకాల వ్యాక్సిన్లు, సీరమ్ల తయారీదారుగా పేరుకెక్కింది. వీటిలో కొన్నింటిని ఎగుమతి కూడా చేసేవారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించినప్పుడు అన్బుమణి రామ్‌దాస్‌ని కేంద్ర ఆరోగ్యమంత్రిగా చేశారు. ఈయన కాంగ్రెస్ కూటమిపార్టీల్లో ఒక పార్టీకి చెందిన నేత. నా అభిప్రాయంలో ఆయన ఎంపిక ఏమాత్రం సరైనది కాదు. ఆయన హయాంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వచ్చిన ఒక ప్రతికూల నివేదిక కారణంగా అంతవరకు వ్యాక్సిన్లు, సీరమ్ల ప్రముఖ ఉత్పత్తిదారుగా ఉన్న సీఆర్ఐ కేవలం ఒక పరీక్షా ప్రయోగశాల స్థాయికి కుదించుకుపోయింది. ప్రభుత్వ నిర్వహణలో ఆధునిక ఆరోగ్య మౌలిక వసతుల కల్పనకు ఆధునిక, హేతుపూర్వకమైన శాస్త్రీయ దృక్పథం చాలా అవసరం. కానీ ఇప్పుడు జ్యోతిష శాస్త్రానికి సైన్సు స్థాయిలో ప్రాధాన్యత కల్పిస్తున్నారు. పైగా ప్రత్యామ్నాయ వైద్యాన్ని అలోపతి కంటే ఆధిక్యతా స్థానంలో ఉంచాలని ప్రతిపాదిస్తున్నారు. ప్రాచీన భారతదేశంలో శాస్త్రీయ, వైద్య ఆవిష్కరణల పేరిట సెమినార్లు ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి ఆవు విసర్జించే వ్యర్థ పదార్ధాలను కేన్సర్ వంటి కీలక వ్యాధులకు కూడా ఉపశమన కారులుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇలాంటి మూఢ విశ్వాసాలు దేశంలో చలామణీ అవుతున్నప్పుడు, సమర్థవంతమైన, ఆధునిక ఆరోగ్య మౌలిక వసతులను మనం ఏర్పర్చుకోగలమా? శాస్త్రీయ దృక్పథాన్ని, మానవవాదాన్ని, ప్రశ్నించి సంస్కరించే స్ఫూర్తిని అభివృద్ధి పర్చుకోవడం ప్రతి పౌరుడి విధి అని రాజ్యాంగమే నిర్దేశించింది. సైన్స్, ఔషధ రంగంలో భవిష్యత్తులో నిర్వహించే ప్రతి సమావేశంలోనూ భారత రాజ్యాంగం ప్రవచించిన ఈ విశిష్ట వాక్యాన్ని ప్రముఖంగా పొందుపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాసకర్త: రాహుల్ సింగ్ సీనియర్ జర్నలిస్టు -
నేడే యూపీ తొలిదశ
పశ్చిమ యూపీలోని 73 స్థానాలకు ఎన్నికలు లక్నో: కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు శనివారం జరగనున్నాయి. పశ్చిమ యూపీలోని మీరట్, ఆగ్రా తదితర 15 జిల్లాల్లో 73 నియోజకవర్గాలకు జరగనున్న పోలింగ్‌లో 2.6 కోట్ల మంది ఓటేయనున్నారు. 839 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కుమారుడు పంకజ్(నోయిడా), ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ అల్లుడు రాహుల్ సింగ్(బులంద్‌షహర్ జిల్లా సికందరాబాద్ నుంచి ఎస్పీ తరఫున) బరిలో ఉన్నారు. ముజఫర్‌నగర్ అల్లర్ల నిందితుడైన సర్దానా సిటింగ్ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ మళ్లీ పోటీ చేస్తున్నారు. ముజఫర్‌నగర్‌లోని 887 పోలింగ్ కేంద్రాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. గోమాంసం తిన్నాడనే ఆరోపణలపై 2015లో ఒక ముస్లిం హత్యకు గురైన దాద్రీ నియోజకవర్గం(గౌతమ్‌బుద్ధ నగర్ జిల్లా) లోనూ ఈ దశలోనే పోలింగ్ జరుగుతోంది. ముస్లిం జనాభా అధికంగా ఉన్న పశ్చిమ యూపీలో ఎంఐఎం కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తొలిదశ పోలింగ్ మిగతా ఆరు దశల పోలింగ్‌పై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశాయి. ఎస్పీ–కాంగ్రెస్‌కు ఓటేయండి: యూపీ తొలిదశ ఎన్నికల్లో ఎస్పీ–కాంగ్రెస్ కూటమికి ఓటేయాలని కోల్‌కతాలోని టిప్పు సుల్తాన్ మసీదు ఇమామ్ సయ్యద్ మహ్మమద్ నూరూర్ రెహ్మన్ బర్కతీ ఓటర్లకు పిలుపునిచ్చారు. బీజేపీ ఆరెస్సెస్‌లు విభజనవాద రాజకీయాలతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నాయని, అవి ముస్లింలకు వ్యతిరేకమని ఆరోపించారు. -
ఊపిరాడకే ప్రత్యూష మృతి
ముంబై: శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న ‘బాలికా వధు’ ఫేం నటి ప్రత్యూష బెనర్జీ ఊపిరాడకే చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్టులో స్పష్టమైంది. గొంతుబిగుసుకుపోయిన ఆనవాళ్లున్నాయని తేలింది. కాగా, ప్రత్యూష అంత్యక్రియలు శనివారం ముంబైలో నిర్వహించారు. బుల్లితెర నటులు పలువురు హాజరై కన్నీటితో తుది వీడ్కోలు పలికారు. కాగా, ఈ కేసుకు సంబంధించి ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్‌ను ముంబై పోలీసులు విచారిస్తున్నారు. రాహుల్ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ప్రత్యూష సెల్ నుంచి వెళ్లిన చివరి కాల్స్, వీరి మధ్య జరిగిన సందేశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. అయితే.. ప్రత్యూష తన వివాహానికి దుస్తుల్ని డిజైన్ చేయమని కాస్ట్యూమ్ డిజైనర్ అయిన స్నేహితుడు రోహిత్‌ను అడిగినట్లు తెలుస్తోంది. -
ప్రత్యూషది ఆత్మహత్య కాదు హత్యే
ముంబై: ప్రముఖ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ(24) మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నా.. సన్నిహితులు మాత్రం అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమె ఆత్మహత్యా చేసుకుందా లేక హత్యా అనేది విచారణలో తేలాల్సివుంది. ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని సహనటి పాల్ డాలీ బింద్రా బింద్రా చెప్పారు. బిగ్ బాస్ లో ప్రత్యూష తో కలిసి నటించిన అజీజ్ ఖాన్ మాట్లాడుతూ ఇది కచ్చితంగా ప్రీ పాన్డ్ మర్డర్ అయి వుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యూష మృతదేహంపై మెడ, ఎడమ చెంపపై గాయాలు ఉండటం, నోటినుంచి రక్త రావడంతో ప్రత్యూషది హత్య అని సన్నిహితులు భావిస్తున్నారు. ఆమె హత్యకు గురైందనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మృతదేహంపై గాయాలు ఉండటం, సూసైడ్ నోట్ లభించకపోవడం , ప్రియుడు రాజ్ సింగ్ పరారీలో ఉండడంతో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెది హత్యా లేక ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పోస్ట్ మార్టం నివేదిక అనంతరం మరికొన్ని వివరాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంది. మరోవైపు ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్‌సింగ్, ఆమె చనిపోయినపుడు ఆసుపత్రిలో ప్రశాంతంగా కనిపించడం, ప్రత్యూష తల్లిదండ్రులకు విమాన టికెట్లు బుక్ చేయడంపై సన్నిహితులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి పెళ్లికూతురు ఆనందిగా తెలుగు టీవీ ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రత్యూష ముంబై శివార్లలోని సొంత ఫ్లాట్‌లో అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే. -
'ప్రత్యూష జీవితాన్ని సర్వనాశనం చేశాడు'
ముంబై: రాహుల్ రాజ్‌సింగ్ తన కూతురు జీవితాన్ని సర్వనాశనం చేశాడని బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ తండ్రి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కూతురు ప్రశాంతంగా ఉండేదని, రాహుల్ సింగ్ వచ్చాక హింసకు గురైందని కన్నీటిపర్యంతమయ్యాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాహుల్‌ను వదిలిపెట్టేది లేదని అన్నాడు. ప్రత్యూష బెనర్జీ శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. ముంబై శివార్లలోని బంగూర్‌నగర్‌లో ఉన్న సొంత ఫ్లాట్‌లో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నానని ఆమె సోదరి రిషిత ఆవేదన వ్యక్తం చేసింది. 'ఆ సమయంలో నేను టూషన్ క్లాస్‌లో ఉన్నాను. ఇంటికి తిరిగి వచ్చాక, అందరూ ఏడుస్తున్నారు. నా సోదరి ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నా. ఆమె ఈ పని చేసుండదు' అని రిషిత చెప్పింది. -
పరారీలో ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్
ముంబై: బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ(24) మరణానికి గల కారణాలను ఇప్పుడే చెప్పలేమని ముంబై పోలీసులు చెప్పారు. ఈ కేసును విచారిస్తున్నామని, ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్సింగ్ను ప్రశ్నించనున్నట్టు తెలిపారు. కాగా రాహుల్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. రాజ్ సింగ్‌తో అనుబంధానికి సంబంధించి ఆమె ఇబ్బందులను ఎదుర్కోందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకునే ముందు ప్రతూష్, రాజ్సింగ్లు చాటింగ్ చేసుకున్నట్టు వెల్లడైంది. వాట్సాప్‌లో ఇద్దరూ పరస్పరం ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాజ్సింగ్కు వాట్సాప్ మెసేజ్ పంపింది. అనంతరం 3:30 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్న ప్లాట్‌లో పోలీసులు పరిశీలించారు. సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు చెప్పారు. డబ్బింగ్ సీరియల్ చిన్నారి పెళ్లికూతురులో ఆనందిగా తెలుగు టీవీ ప్రేక్షకులకు చిరపరిచితురాలైన ప్రత్యూష బెనర్జీ(24) శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. ముంబై శివార్లలోని బంగూర్‌నగర్‌లో ఉన్న సొంత ఫ్లాట్‌లో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సిద్ధార్థ్ ఆస్పత్రికి తరలించారు. -
బెంబేలెత్తించిన అశ్విన్ యాదవ్
సాక్షి, హైదరాబాద్: ఎస్బీహెచ్ బౌలర్ అశ్విన్ యాదవ్ (7/64) విజృంభించడంతో డెక్కన్ క్రానికల్ బ్యాట్స్‌మెన్ విలవిలలాడారు. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో భాగంగా మంగళవారం మొదలైన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన డెక్కన్ జట్టు 166 పరుగులకే కుప్పకూలింది. రాహుల్ సింగ్ (57 బంతుల్లో 63, 10 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడి అర్ధసెంచరీ పూర్తిచేశాడు. మిగతా వారిలో ఒక్క ప్రణీత్ కుమార్ (36) మాత్రమే ఫర్వాలేదనిపించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఎస్బీహెచ్ కూడా తడబడింది. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఎస్బీహెచ్ 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. అనిరుధ్ (76 బంతుల్లో 74, 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకంతో రాణించాడు. అహ్మద్ ఖాద్రీ 40 పరుగులు చేయగా, డెక్కన్ బౌలర్ ఆకాశ్ భండారీ 3 వికెట్లు తీశాడు. షిండే 5 వికెట్లు తీసినా.... ఆంధ్రాబ్యాంక్‌తో జరుగుతున్న మరో మ్యాచ్‌లో ఈఎంసీసీ భారీ స్కోరు సాధించింది. ఆంధ్రా బ్యాంక్ బౌలర్ అమోల్ షిండే 5 వికెట్లు పడగొట్టినప్పటికీ భారీ స్కోరుకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోయాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈఎంసీసీ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది. సూర్యతేజ (102 బంతుల్లో 83, 10 ఫోర్లు), శరత్ (81 బంతుల్లో 50, 9 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. విక్రమ్ సూర్యతేజ 44, రవితేజ 38, విశ్వజిత్ పట్నాయక్ 35, ఆకాశ్ 30 పరుగులు చేశారు.