తల్లితో కేఎస్ భరత్ ఆత్మీయ ఆలింగనం (PC: Twitter)
India vs Australia, 1st Test- KS Bharat: ‘‘నేను ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టినపుడు ఇక్కడి వరకు చేరుకుంటానని అస్సలు ఊహించలేదు. సుదీర్ఘ ప్రయాణంలో.. ఇప్పుడిలా.. నా టెస్టు జెర్సీని చూసిన క్షణాలు అత్యంత విలువైనవి. నాకిది గర్వకారణం! ఈ ప్రయాణం భావోద్వేగాలతో కూడుకున్నది’’ అంటూ వికెట్ కీపర్ బ్యాటర్ కోన శ్రీకర్ భరత్ ఉద్వేగానికి లోనయ్యాడు.
దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్ర జట్టుకు ఆడుతున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆస్ట్రేలియాతో మొదటి టెస్టు సందర్భంగా అరంగేట్రం చేశాడు. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. సహచర ఆటగాళ్లు, కుటుంబ సభ్యుల నడుమ టీమిండియా క్యాప్ అందుకున్న భరత్.. తన తల్లిని హత్తుకుని భావోద్వేగానికి లోనయ్యాడు.
ఆయన వల్లే ఇదంతా..
ఈ నేపథ్యంలో భరత్ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. ‘‘నేనిక్కడివరకు వచ్చానంటే అందుకు కారణం మా కోచ్ జై క్రిష్ణారావు. నాపై నాకు నమ్మకం లేని సమయంలో ఆయన నాపై విశ్వాసం ఉంచారు.
నిజానికి నాపై నాకంటే ఆయనకే ఎక్కువ నమ్మకం. ఆయన వల్లే ఇదంతా! ఒక్కరోజులో ఇదేమీ సాధ్యం కాలేదు. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇక్కడి దాకా వచ్చాను.
2018లో ఇంగ్లండ్‌తో ఇండియా-ఏ తరఫున ఆడినపుడు రాహుల్ సర్ నన్ను మొదటిసారి చూశారు. చాలా సేపు మేము మాట్లాడుకున్నాం. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ఆడటమే నాకు ముఖ్యం. నేనెప్పుడూ అలాగే ఆలోచించాలని ఆయన నాతో చెబుతూ ఉంటారు’’ అని 29 ఏళ్ల కేఎస్ భరత్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
చదవండి: IND vs AUS: తొలి బంతికే సిరాజ్ వికెట్.. రోహిత్, ద్రవిడ్ రియాక్షన్ మామూలుగా లేదుగా! వీడియో వైరల్
KS Bharat: కేఎస్ భరత్ అరంగేట్రం.. సీఎం జగన్ శుభాకాంక్షలు
Comments
Please login to add a commentAdd a comment