
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి గత కొన్ని రోజులుగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో టెస్టుల్లో నిరాశపరిచిన కోహ్లి.. తనకు ఘనమైన రికార్డు ఉన్న ఆస్ట్రేలియా గడ్డ మీద కూడా శుభారంభం అందుకోలేకపోయాడు.
జాగ్రత్త పడి ఉంటే..
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో శుక్రవారం మొదలైన టెస్టులో కోహ్లి విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో పన్నెండు బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులే చేశాడు. ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖవాజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, కోహ్లి జాగ్రత్త పడి ఉంటే.. వికెట్ పడకుండా ఉండేదే!
ఎప్పుడెప్పుడు లండన్ ఫ్లైట్ ఎక్కేద్దామా!
ఈ నేపథ్యంలో మరోసారి కోహ్లి ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి. కొంతమందైతే అతడి కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగుతూ.. సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ‘‘ఎప్పుడెప్పుడు మ్యాచ్ ముగుస్తుందా.. ఎప్పుడెప్పుడు లండన్ ఫ్లైట్ ఎక్కేద్దామా! అని చూడటం తప్ప.. జట్టు కోసం నేనేం చేస్తున్నాన్న ఆలోచనే లేదు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
కాగా కోహ్లి భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తమ రెండో సంతానానికి లండన్‌లో జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కుమారుడు అకాయ్ పుట్టిన తర్వాత విరుష్క జోడీ ఎక్కువగా అక్కడే గడుపుతోంది. ముఖ్యంగా అనుష్క ఏవైనా ప్రమోషన్లు ఉంటే మాత్రమే ఇండియాకు వస్తోంది.
ఆస్ట్రేలియా పర్యటనకు మాత్రం కుటుంబ సమేతంగా!
మరోవైపు.. కోహ్లి సైతం ఇండియాలో మ్యాచ్ పూర్తవగానే లండన్ వెళ్లిపోతున్నాడు. అయితే, ఆస్ట్రేలియా పర్యటనకు మాత్రం కోహ్లి కుటుంబ సమేతంగా వచ్చినట్లు తెలుస్తోంది. తమ పిల్లలు వామిక, అకాయ్‌లను కూడా వెంట తీసుకు వచ్చినట్లు సమాచారం.
ఇక పెర్త్ స్టేడియంలో అనుష్క టీమిండియాను ఉత్సాహపరుస్తూ కనిపించింది. ముఖ్యంగా శనివారం నాటి రెండో రోజు ఆటలో ఆసీస్ ఆలౌట్ కాగానే ఆమె ఇచ్చిన రియాక్షన్ అభిమానులకు ఫిదా చేస్తోంది.
వదినమ్మ వచ్చేసింది..
‘‘వదినమ్మ వచ్చేసింది.. కోహ్లి భాయ్ నువ్వు సెంచరీ చేయడమే మిగిలి ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కనీసం రెండో ఇన్నింగ్స్‌లోనైనా బ్యాట్ ఝులిపిస్తే చూడాలని ఉందని ఫ్యాన్స్ రన్‌మెషీన్‌కు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.
కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్‌ను 104 పరుగులకే కట్టడి చేసి.. మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం సంపాదించింది.
చదవండి: హర్షిత్.. నీ కంటే నేను ఫాస్ట్‌గా బౌల్ చేయగలను: స్టార్క్ వార్నింగ్.. రాణా రియాక్షన్ వైరల్
Anushka Sharma Reaction, After Australia's last wicket😍#ViratKohli | #AnushkaSharma pic.twitter.com/AItKHrFfpB
— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrognxvirat) November 23, 2024
Comments
Please login to add a commentAdd a comment