IND vs WI: Ishan Kishan, Yashasvi Debut KS Bharat Dropped Fans Reactions - Sakshi
Sakshi News home page

#KS Bharat: ఇషాన్‌ కిషన్‌ అరంగేట్రం.. అందుకే భరత్‌పై వేటు! కానీ పాపం..

Published Wed, Jul 12 2023 8:08 PM | Last Updated on Wed, Jul 12 2023 8:50 PM

IND vs WI: Ishan Kishan Yashasvi Debut KS Bharat Dropped Fans Reactions - Sakshi

ఇషాన్‌ కిషన్‌- కేఎస్‌ భరత్‌

West Indies vs India, 1st Test: ఎట్టకేలకు ఇషాన్‌ కిషన్‌ టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌-2023 ఫైనల్‌ సందర్భంగా జట్టుకు ఎంపికైన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో వెస్టిండీస్‌తో పర్యటన నేపథ్యంలో టెస్టు జట్టులో చోటిచ్చారు సెలక్టర్లు.

ఇక జూలై 12న టీమిండియా- విండీస్‌ మధ్య ఆరంభమైన తొలి మ్యాచ్‌ సందర్భంగా 24 ఏళ్ల ఇషాన్‌.. విరాట్‌ కోహ్లి చేతుల మీదుగా టీమిండియా టెస్టు క్యాప్‌ అందుకున్నాడు. అదే విధంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చెప్పినట్లుగానే మరో యువ బ్యాటర్‌ యశస్వి జైశ్వాల్‌ కూడా అరంగేట్రం చేశాడు. రోహిత్‌ శర్మ చేతుల మీదుగా క్యాప్‌ అందుకున్న అతడు.. కెప్టెన్‌కు జోడీగా ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు.

అందుకే భరత్‌పై వేటు
కాగా వికెట్‌ కీపర్‌గా ఇషాన్‌ జట్టులోకి రావడంతో ఆంధ్ర క్రికెటర్‌ కేఎస్‌ భరత్‌పై వేటు పడింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ఇద్దరు లెఫ్టాండ్‌ బ్యాటర్లు యశస్వి, ఇషాన్‌లకు అభినందనలు తెలుపుతూనే.. భరత్‌కు మరొక్క అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. 

ఆస్ట్రేలియాతో స్వదేశంలో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 సందర్భంగా భరత్‌ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. పటిష్ట ఆసీస్‌తో మ్యాచ్‌లో వికెట్‌ కీపర్‌గా రాణించినప్పటికీ.. బ్యాటర్‌గా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అదే విధంగా ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌-2023లోనూ తన మార్కు చూపలేకపోయాడు. 

అయితే, రెండు సందర్భాల్లోనూ
రెండు ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తంగా 28 పరుగులు చేయగలిగాడు. అయితే, రెండు సందర్భాల్లోనూ శ్రీకర్‌ భరత్‌ ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్టును ఎదుర్కోవడం విశేషం. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ సారథి అంజుమ్‌ చోప్రా తదితరులు భరత్‌కు అండగా నిలిచారు. వికెట్‌ కీపర్‌గా తన వంతు బాధ్యతలు సక్రమంగానే నెరవేరుస్తున్న భరత్‌ను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం కాస్త వీక్‌గా ఉన్న విండీస్‌తో ఆడే అవకాశం ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కానీ భరత్‌పై వేటు వేసిన యాజమాన్యం ఇషాన్‌కు ఛాన్స్‌ ఇచ్చింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఈ జార్ఖండ్‌ బ్యాటర్‌ తనను తాను నిరూపించుకుంటే భరత్‌ స్థానానికి ఎసరు తప్పదు!

పంత్‌ స్థానంలో అప్పుడు
ఇక యాక్సిడెంట్‌ కారణంగా ప్రధాన వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ దూరం కావడంతో అతడి స్థానాన్ని భరత్‌తో భర్తీ చేశారు. పంత్‌ త్వరగా కోలుకుని తిరిగి వస్తే ఇషాన్‌ కిషన్‌, భరత్‌లలో ఎవరో ఒకరికి మాత్రమే బ్యాకప్‌గా జట్టులో స్థానం లభిస్తుంది. మరోవైపు.. మరో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ కూడా గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కాగా భరత్‌ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 5 టెస్టులాడి 129 పరుగులు సాధించాడు.

చదవండి: మార్కు చూపించిన తిలక్‌ వర్మ.. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో విహారి! ఫైనల్లో జట్టును..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement