టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. అతడు ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రిషబ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. అయితే అతడు పూర్తి స్థాయిగా కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో పంత్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో కీలకమైన టెస్టు సిరీస్‌కు దూరం కావడం దాదాపు ఖాయమనిపిస్తోంది. దీంతో ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాటర్ కోన శ్రీకర్ భరత్ టెస్టుల్లో భారత్ తరపున అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. అదే విధంగా ఆస్ట్రేలియా సిరీస్ సమయానికి సిద్దంగా ఉండాలని భరత్‌కు బీసీసీఐ కూడా తెలియజేసినట్లు తెలుస్తోంది.
గత కొంత కాలంగా భారత జట్టుకు భరత్ ఎంపిక అవుతున్నప్పటికీ.. కేవలం బ్యాకప్ వికెట్ కీపర్‌గా మాత్రమే ఉండిపోయాడు. 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భరత్‌కు తొలి సారిగా భారత జట్టులో చోటు దక్కింది. అయితే తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. కానీ రెండో టెస్టులో సబ్‌స్ట్యూట్‌గా వచ్చిన భరత్.. తన వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో అందరిని అకట్టుకున్నాడు.
అదే విదంగా ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా భరత్‌కు చోటు దక్కింది. కానీ రెండు మ్యాచ్‌లకు కూడా బెంచ్‌కే పరిమితమ్యాడు. ఇక భరత్‌కు దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో కూడా భరత్ పర్వాలేదనిపిస్తున్నాడు.
ఇషాన్ కిషన్ టెస్టు ఎంట్రీ..
బంగ్లాదేశ్‌పై వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ టెస్టుల్లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు భరత్‌కు బ్యాక్‌ఆప్ వికెట్ కీపర్‌గా కిషన్‌ను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో స్వదేశంలో భారత జట్టు నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ సిరీస్‌లో భారత్ విజయం సాధిస్తే.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది.
చదవండి: Rishabh Pant: ఐసీయూ నుంచి ప్రైవేటు గదికి రిషభ్ పంత్.. కారణమిదే?
Comments
Please login to add a commentAdd a comment