
కన్నడ హీరో యోగి ఫల్గుణ్ ‘మొనగాడు’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు. భానుశ్రీ హీరోయిన్. ఎం.ఎం. వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ రాగ క్రియేషన్స్, సామి అసోసియేట్స్ పతాకాలపై పోషం మట్టారెడ్డి, టి.పి.సిద్దరాజు, కె.నారాయణమూర్తి నిర్మిస్తున్న ‘మొనగాడు’ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి జంబూద్వీప శక్తి పీఠాధిపతి ఆదిదండి శక్తిశ్రీ జగద్గురు భగవతీ మహరాజ్ స్వామీజీ క్లాప్ ఇచ్చారు. ‘‘తెలుగు సినిమాల్లో నటించాలన్న కోరిక ‘మొనగాడు’ లాంటి సినిమా ద్వారా నెరవేరుతున్నందుకు హ్యాపీ’’ అన్నారు యోగి ఫల్గుణ్. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్. సి.హెచ్, సంగీతం: వినోద్ యాజమాన్య, సహ నిర్మాతలు: నాగరాణి రమాదేవి, యలమెల్లి బాలకృష్ణ.
Comments
Please login to add a commentAdd a comment