ఈ పాట రిలీజ్‌ చేయడం హ్యాపీగా ఉంది: బాలకృష్ణ | Balakrishna Released Namah Shivaya Song From Natyam Movie | Sakshi
Sakshi News home page

Natyam: నమః శివాయ సాంగ్‌ వచ్చేసింది

Published Sat, Aug 7 2021 8:24 AM | Last Updated on Sat, Aug 7 2021 11:14 AM

Balakrishna Released Namah Shivaya Song From Natyam Movie - Sakshi

Natyam Movie Song: ‘‘నాట్యం’లోని ‘నమః శివాయ’ అనే పాటను నేను రిలీజ్‌ చేయడం హ్యాపీగా ఉంది. అన్ని పాజిటివ్‌ వైబ్స్‌ ఉన్న ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు బాలకృష్ణ. ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్‌ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా, కొరియోగ్రాఫర్‌గా, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా, కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పరిచయమవుతున్న చిత్రం ‘నాట్యం’. రేవంత్‌ కోరుకొండ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా త్వరలో రిలీజ్‌ కానుంది. ఈ చిత్రంలో ‘నమః శివాయ’ అంటూ సాగే తొలి పాటను బాలకృష్ణ విడుదల చేశారు.

‘‘లేపాక్షి ఆలయంలో ఈ పాటను 40 డిగ్రీల ఎండలో చిత్రీకరించాం. జగద్గురు ఆది శంకరాచార్య వారి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పాటగా మలిచాం. శ్రవణ్‌ భరద్వాజ్‌ ఈ పాటను క్లాసిక్, ఫోక్‌ స్లైల్లో ఆధ్యాత్మికంగా మలిచారు. కాల  భైరవ, లలిత కావ్య ఈ పాటను పాడారు. ఈ చిత్రంలో కమల్‌ కామరాజు క్లాసికల్‌ డ్యాన్సర్‌గా కనిపిస్తారు. ఈ పాత్ర కోసం సంధ్యా రాజు వద్ద ఆయన ఏడాదిపాటు కూచిపూడిలో శిక్షణ తీసుకున్నారు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement