పవన్ సోదరుడిగా కమల్ కామరాజు | Kamal Kamaraju to play Pawan Kalyans brother | Sakshi
Sakshi News home page

పవన్ సోదరుడిగా కమల్ కామరాజు

Sep 25 2016 8:44 AM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ సోదరుడిగా కమల్ కామరాజు - Sakshi

పవన్ సోదరుడిగా కమల్ కామరాజు

చాలా రోజులుగా ఊరిస్తూ వస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కాటమరాయుడు సెట్స్ మీదకు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సికింద్రాబాద్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న...

చాలా రోజులుగా ఊరిస్తూ వస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కాటమరాయుడు సెట్స్ మీదకు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సికింద్రాబాద్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ సినిమా వీరంకు రీమేక్గా తెరకెక్కుతోంది. అయితే పూర్తిగా రీమేక్లా కాకుండా మూల కథను మాత్రమే తీసుకొని పవన్ ఇమేజ్కు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేశారు.

తాజాగా ఈ సినిమాలో పవన్ తమ్ముడిగా నటిస్తున్న కమల్ కామరాజు ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు. కాటమరాయుడులో తనది కీలక పాత్ర అన్న కమల్, తను పవన్ కళ్యాణ్ చిన్న తమ్ముడిగా నటిస్తున్నట్టుగా తెలిపాడు. అంతేకాదు సినిమాలో తనకు లవ్ స్టోరి కూడా ఉంటుందని, తన గర్ల్ ఫ్రెండ్గా మానస నటిస్తోందని తెలిపాడు. గతంలో పవన్తో కలిసి జల్సా సినిమాలో చిన్న పాత్రలో నటించిన పవన్ మరోసారి పవన్ స్టార్తో తెరను పంచుకోవటం ఆనందంగా ఉందన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement