Shriram
-
మెరైన్ బీమాపై శ్రీరామ్ జనరల్ ఫోకస్
చెన్నై: బీమా సంస్థ శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ వాహనయేతర బీమా విభాగాలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా మెరైన్, అగ్ని ప్రమాదాలు మొదలైన వాటికి సంబంధించిన బీమా పాలసీలను ప్రవేశపెడుతోంది. కంపెనీ చీఫ్ అండర్‌రైటింగ్ ఆఫీసర్ శశికాంత్ దహూజా ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం తమ వ్యాపారంలో మోటార్ ఇన్సూరెన్స్ వాటా సుమారు 92 శాతంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. డైవర్సిఫికేషన్ ప్రణాళికల్లో భాగంగా ఫైర్, మెరైన్, ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో కొత్త బీమా పాలసీలను ప్రవేశపెట్టనున్నట్లు శశికాంత్ చెప్పారు. వచ్చే రెండు మూడేళ్లలో వాహనయేతర వ్యాపారాన్ని 15 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇది 7–8 శాతంగా ఉంది. కేవలం ఒక విభాగంపై ఎక్కువగా ఆధారపడకూడదనే వ్యాపార వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ నికర లాభం 37% పెరిగి రూ.98 కోట్లకు చేరింది. ఈ ఏడాది వ్యాపారం 30% మేర వృద్ధి చెందగలదని అంచనా వేస్తున్నట్లు శశికాంత్ చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల బీమా పాలసీల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయని, గత ఆర్థిక సంవత్సరంలో రూ.82 కోట్ల విలువైన పాలసీలను విక్రయించామన్నారు. ఈ ఏడాది వీటి విక్రయాలు రూ.200 కోట్ల వరకు ఉండొచ్చని చెప్పారు. ప్రస్తుతం సంస్థలో 3,780 మంది ఉద్యోగులు ఉన్నారని, ఈ ఆర్థిక సంవత్సరం కొత్తగా 700 మందిని నియమించుకోనున్నామని శశికాంత్ తెలిపారు. -
యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ జట్టు
ముంబై: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ (ఎస్హెచ్ఎఫ్ఎల్) సంస్థలు చేతులు కలిపాయి. యూబీ కో.లెండ్ ప్లాట్‌ఫాం ద్వారా రుణాలు ఇచ్చేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. దీనితో చిన్న, మధ్య తరహా సంస్థలకు అలాగే గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాల్లోని మధ్య.. అల్పాదాయ వర్గాలకు గృహ రుణాలు అందించనున్నాయి. ఆర్థిక రంగంలో యాక్సిస్ బ్యాంక్, లోన్ ప్రాసెసింగ్ టెక్నాలజీలో ఎస్హెచ్ఎఫ్ఎల్ అనుభవాలు.. రుణ గ్రహీతల ప్రొఫైల్‌ను మదింపు చేసి, రుణాలు ఇచ్చేందుకు ఉపయోగపడగలవని ఇరు సంస్థలు తెలిపాయి. ఎంఎస్ఎంఈలు, అఫోర్డబుల్ హోమ్ సెగ్మెంట్లలో విస్తరించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడగలదని యాక్సిస్ బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ మునీష్ షర్దా, ఎస్హెచ్ఎఫ్ఎల్ ఎండీ రవి సుబ్రమణియన్ తెలిపారు. -
సౌందర్య తర్వాత ఆమె అంటేనే నాకు ఇష్టం: సి. కల్యాణ్
‘‘సినిమా ఇండస్ట్రీలో ఒక్కరితో ఎప్పుడూ సక్సెస్ రాదు.. ఒకరికొకరు తోడవ్వాలి. మా గురువుగారు (దాసరి నారాయణరావు) అదే చెప్పేవారు’’ అని నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. ఈ సినిమాతో సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అజయ్ మైసూర్ సమర్పణలో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం నిర్మించిన ఈ చిత్రం మార్చి 4న విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ‘టెన్త్ క్లాస్ డైరీస్’ టీజర్‌ను సి. కల్యాణ్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా సి. కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘అభినయం పరంగా సౌందర్య తర్వాత అవికా గోర్ అంటే నాకు ఇష్టం. ఆ అమ్మాయికి రావాల్సినంత సక్సెస్ ఇంకా రాలేదు. ఈ సినిమాతో తప్పకుండా సక్సెస్ వస్తుంది’’ అన్నారు. ‘‘అంజిని చూస్తే ‘టెన్త్ క్లాస్ డైరీస్’ తీసిన దర్శకుడిలా లేడు. బి. గోపాల్, వీవీ వినాయక్‌లా కమర్షియల్ సినిమాలు తీసిన దర్శకుడిలా ఉన్నాడు’’ అన్నారు ఛోటా కె. నాయుడు. ‘‘మేం ఈ సినిమా ఆరంభించినప్పుడు ఒక బడ్జెట్ అనుకున్నాం. తర్వాత కొంచెం పెరుగుతోందని అనుకున్నప్పుడు సపోర్ట్ అవసరమని అడగ్గానే రవి కొల్లిపర ముందుకొచ్చారు ’’ అన్నారు అచ్యుత రామారావు. ‘‘96, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్, కొత్త బంగారు లోకం’ కోవలో ‘టెన్త్ క్లాస్ డైరీస్’ ఉంటుంది’’ అన్నారు ‘గరుడవేగ’ అంజి. ‘‘నేను పదో తరగతిలో ఉన్నప్పుడు ‘ఉయ్యాలా జంపాలా’ సినిమా చేశాను. ‘టెన్త్ క్లాస్ డైరీస్’లో నా క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది’’ అన్నారు అవికా గోర్. -
ప్రభుత్వ వాదనలు వినకుండానే..
సాక్షి, అమరావతి: పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకోవడం, తమ ఉత్తర్వులపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు రావడంపై.. రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా, లేదా అనేది తేలుస్తామంటూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కు తీసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ ఉత్తర్వుల్ని వెనక్కు తీసుకోవాలని (రీకాల్) ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కనీసం వాదనలు కూడా వినకుండానే కొట్టేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళతామని, అప్పటివరకు విచారణ వాయిదా వేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని కూడా పట్టించుకోలేదు. సుప్రీంకోర్టుకు వెళ్లినా తమకు అభ్యంతరం లేదని, విచారణను వాయిదావేసే ప్రసక్తేలేదని చెప్పింది. సోమవారం జరిగిన విచారణలో కనీసం అడ్వొకేట్ జనరల్ వాదనను వినిపించుకోకుండానే అనుబంధ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేస్తామని, రెండువారాలు వాయిదా వేయాలని అడిగినా పట్టించుకోకుండా బుధవారానికి వాయిదా వేసింది. ‘రాష్ట్రంలో పోలీసులు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం, తరువాత వారిని కోర్టు ముందు హాజరుపరచడమో లేదా విడుదల చేయడమో చేస్తున్నారు. దీనిపై డీజీపీని కోర్టుకు పిలిపించి వివరణ కోరాం. ఇలాంటివి పునరావృత్తం కావని డీజీపీ కోర్టుకు హామీ ఇచ్చారు. అయినా పోలీసుల్లో పెద్ద మార్పేమీ రాలేదు. ఇదే సమయంలో హైకోర్టు ఉత్తర్వులపై సామాజిక మాధ్యమాల్లో పలువురు విమర్శలు, దూషణల దాడులకు దిగారు. ఇందులో అధికార పార్ట ఎంపీ కూడా ఉన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అన్న అంశాన్ని తేలుస్తాం’ అని న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఏజీగా కోర్టు నిష్పక్షపాతాన్ని కోరుకుంటున్నా.. అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ వాదనలు వినకుండానే ధర్మాసనం.. ప్రభుత్వ అనుబంధ పిటిషన్‌ను కొట్టేసింది. తన వాదనలు వినాలని ఏజీ పలుమార్లు అభ్యర్థించినా జస్టిస్ రాకేశ్‌కుమార్ పట్టించుకోలేదు. తనకు వాదనలు చెప్పే అవకాశం, పలు న్యాయస్థానాల తీర్పులను ప్రస్తావించే అవకాశం ఇవ్వకపోవడం ఎంతమాత్రం సరికాదని శ్రీరామ్ బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. తన వాదనలు వినలేదన్న విషయాన్ని ఉత్తర్వుల్లో ప్రస్తావించాలని ఏజీ కోరినా జస్టిస్ రాకేశ్‌కుమార్ సానుకూలంగా స్పందించలేదు. దీనిపై తీవ్ర అసంతృప్తిని, ఆవేదనను వ్యక్తం చేసిన అడ్వొకేట్ జనరల్.. తాను చెప్పిన వివరాలను ఉత్తర్వుల్లో ప్రస్తావించడం ద్వారా కోర్టు నిష్పక్షపాతాన్ని ఏజీగా తాను కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ఏజీ నుంచి ఇలాంటి వాదనను ఆశించడంలేదని ధర్మాసనం వ్యాఖ్యానించగా, న్యాయస్థానం నుంచి తాము కూడా ఇలాంటి దానిని ఆశించడంలేదని ఏజీ ఘాటుగా బదులిచ్చారు. సుప్రీంకోర్టులో కేసు తేలిన తరువాతే ఈ కేసులో కోర్టుకు సహకరిస్తానని తేల్చిచెప్పారు. ఓ అడ్వొకేట్ జనరల్ ఇలా అసంతృప్తిని, ఆవేదనను వ్యక్తంచేసే పరిస్థితిని న్యాయస్థానం కల్పించడం తెలుగు రాష్ట్రాల న్యాయవ్యవస్థ చరిత్రలో అరుదైన ఘటనగానే చెప్పాలి. ఇందుకనుగుణంగా మధ్యాహ్నం జరిగిన విచారణకు ఏజీ కాకుండా ప్రభుత్వ న్యాయవాది సుమన్ హాజరయ్యారు. ఫలానా కారణాల ఆధారంగా రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందన్న భావనతో కోర్టు విచారణ జరుపుతున్న పరిస్థితుల్లో, ఆ అంశాలపై కౌంటర్ దాఖలు చేసే హక్కు ప్రభుత్వానికి ఉందని, అందువల్ల విచారణను రెండు వారాలకు వాయిదా వేయాలని సమన్ కోరారు. ఇందుకు సైతం నిరాకరించిన ధర్మాసనం ఏజీ ఎందుకు రాలేదని ప్రశ్నించింది. ఏజీ తాను మధ్యాహ్నం విచారణకు రాబోనని ముందే చెప్పారని, అందుకే తాను వచ్చానని సుమన్ చెప్పారు. వాదనలు వినిపించేందుకు ఏజీ కాకుండా మీరెలా వస్తారని సుమన్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. తాను ఏజీకి అనుబంధ బృందంగా పనిచేస్తున్నానని, ఇదే ధర్మాసనం చాలా కేసుల్లో అడ్వొకేట్ జనరల్ తరఫున తాను హాజరయ్యేందుకు అనుమతినిచ్చి, వాదనలు కూడా విందని, ఇప్పుడు ఈ కేసులో మాత్రం అనుమతించబోమని చెప్పడం సరికాదని సుమన్ స్పష్టం చేశారు. అయినా ధర్మాసనం వినిపించుకోలేదు. సుమన్ వాదనలు వినిపిస్తుండగానే కోర్టువర్గాలు ఆయన మైక్‌ను మ్యూట్ (మాట వినిపించకుండా) చేసేశాయి. పిటిషనర్లు కోరనిదానిపై విచారణకు వీల్లేదు.. రాజ్యాంగం వైఫల్యం చెందిందని చెప్పేందుకు హైకోర్టు చూపిన కారణాలపై పోలీసుల తరఫున హాజరవుతున్న ప్రభుత్వ ప్రత్యేక సీనియర్ కౌన్సిల్ ఎస్.ఎస్.ప్రసాద్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాజకీయ అనిశ్చితి, న్యాయ అరాచకం, శాసనవ్యవస్థ వైఫల్యం వంటివి ఉన్నప్పుడే రాజ్యాంగం వైఫల్యం చెందినట్లు భావించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఓ తీర్పులో చెప్పిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు లేనప్పుడు రాజ్యాంగం వైఫల్యంపై సుమోటో (తనంతట తాను)గా విచారణ చేపట్టే పరిధి హైకోర్టుకు లేదని చెప్పారు. హైకోర్టు ముందు విచారణకు ఉన్న కేసులకు, హైకోర్టు విచారిస్తామంటున్న అంశాలకు పొంతన లేదన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందని కోర్టు తీర్పునిస్తే.. రాజ్యాంగం కల్పించిన రక్షణ కోర్టుకు ఉండదని, కోర్టుకు రాజకీయ దురుద్దేశాలు ఆపాదించే పరిస్థితి వస్తుందని తెలిపారు. రాజ్యాంగ వైఫల్యం చెందిందని ఓ రాజకీయ పార్టీ ఫిర్యాదు చేస్తే దానికి ఎంత విలువ ఉంటుందో, కోర్టు తీర్పునకు కూడా అంతే విలువ ఉంటుందన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందని ప్రకటించాలని పిటిషనర్లు కోరలేదని, పిటిషనర్లు కోరని అంశంపై విచారణకు వీల్లేదని చెప్పారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారని, వారిని కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశించాలని కోరుతూ పలువురు వ్యక్తులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే రాజధాని ప్రాంతంలో తాము చేస్తున్న నిరసనలకు పోటీగా ఇతరులెవ్వరూ కార్యక్రమాలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలంటూ టీడీపీ నేత తెనాలి శ్రావణ్‌కుమార్ పిల్ వేశారు. ఈ వ్యాజ్యాలపై కొద్దికాలంగా విచారణ జరుపుతున్న జస్టిస్ రాకేశ్ నేతృత్వంలోని ధర్మాసనం.. రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా అన్న అంశాన్ని తేలుస్తామంటూ ఆ దిశగా విచారణ మొదలుపెట్టింది. -
అందమైన ప్రయాణం
‘‘మా జీవితంలో మరో అద్భుతమైన ఏడాది ప్రారంభమైన రోజు ఇది (అక్టోబర్ 17). నా కలల రాకుమారుడితో ప్రతిరోజూ నా జీవితం కొత్తగా, సాహసోపేతంగా ఉంటోంది. మా ఇద్దరి మనస్తత్వాలు వేరు. అయినప్పటికీ నా జీవితంలో నువ్వు (భర్త శ్రీరామ్ నేనేని ఉద్దేశించి) ఉండటాన్ని గొప్పగా అనుకుంటాను. నాకూ నీకూ హ్యాపీ యానివర్సరీ.. రామ్’’ అని పెళ్లిరోజు సందర్భంగా మాధురీ దీక్షిత్ తన ఫీలింగ్స్‌ని పంచుకున్నారు. ‘‘21 ఏళ్ల క్రితం నా సోల్‌మెట్‌ను కనుగొన్నాను. అప్పటినుండి మా ప్రయాణాన్ని ప్రారంభించాం. ప్రతిరోజూ మాకు కొత్తగా, అందంగా ఉంటుంది. ఇలాగే మా ప్రయాణాన్ని మేమిద్దరం కలిసి ఎంతో ఎడ్వంచరస్గా కొనసాగిస్తాం. హ్యాపీ ట్వంటీఫస్ట్ యానివర్సరీ’’ అన్నారు శ్రీరామ్ నేనే. కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే అమెరికాలో డాక్టర్‌గా చేస్తున్న శ్రీరామ్ నేనేను 21 ఏళ్ల క్రితం అక్టోబర్ 17న వివాహం చేసుకున్నారు మాధురి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. -
రవీంద్రనాథ్ ఠాగూర్ భావాలతో...
శ్రీరామ్, జీవన్, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దాడి’. మధు శోభ.టి దర్శకత్వంలో శంకర్. ఎ నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్‌కి ముందే కొంతభాగం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం చివరి షెడ్యూల్ ఆగస్ట్ మొదటి వారంలో ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా శంకర్.ఎ మాట్లాడుతూ– ‘‘విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ భావాలతో ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా విడుదల చేసిన మా ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. మధుశోభ మేకింగ్ చాలా బాగుంది. మణిశర్మగారి సంగీతం, కాసర్ల శ్యామ్, భాష్యశ్రీల సాహిత్యం మా సినిమాకు ప్లస్ అవుతాయి’’ అన్నారు. -
సీనియర్ నటుడు కన్నుమూత
ముంబై: భారత సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు శ్రీరాం లగూ(92) కన్నుమూశారు. వయోభారంతో పుణెలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. కాగా థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన శ్రీరాం.. పలు హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. ఇరవైకి పైగా మరాఠీ నాటకాలకు దర్శకత్వం వహించి నాటకరంగంలో సేవలు అందించారు. కేవలం నటుడిగానే కాకుండా ఈఎన్టీ సర్జన్‌గా, సామాజిక కార్యకర్తగా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కాగా శ్రీరాం లగూ మరణం పట్ల కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ విచారం వ్యక్తం చేశారు. ‘ గొప్ప నటుడు శ్రీరాం లగూ. మనం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయాం. విలక్షణ నటనతో థియేటర్ ఆర్టిస్టుగా రాణించిన ఆయన.. సిల్వర్ స్క్రీన్‌పై తనదైన ముద్ర వేశారు. పలు సామాజిక కార్యక్రమాల్లోనూ భాగమైన శ్రీరాం లగూకు నివాళులు అర్పిస్తున్నా’ అని ట్విటర్లో పేర్కొన్నారు. ఇక సినీ పరిశ్రమ సైతం శ్రీరాం లగూ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసింది. సహజ, సమయస్ఫూర్తి గల నటుడిని కోల్పోయాం అని బాలీవుడ్ నటుడు రిషి కపూర్ ట్వీట్ చేశారు. My tributes to all time great artist Shreeram Lagoo. We have lost a versatile personality. A unique theatre actor dominated silver screen and created impact. He was social activists simultaneously. — Prakash Javadekar (@PrakashJavdekar) December 17, 2019 -
అది హత్యే!
సాయంత్రం ఆరు అవుతోందప్పుడు. ఫ్రెండ్ శ్రీరామ్‌ను కలిసేందుకు అతడు ఉండే ఫ్లాట్‌కు వచ్చాడు రాజ్. ఇద్దరూ కలసి చాలాసేపు ముచ్చటించుకున్నారు. శ్రీరామ్ రాజ్‌ను పిలిపించడానికి ఒక కారణం ఉంది. వాళ్లిద్దరూ కలసి నడిపిస్తోన్న కంపెనీలో రాజ్ చేసిన మోసం శ్రీరామ్‌కు తెలిసింది. కంపెనీ 25 లక్షలు మోసపోయింది రాజ్ వల్లే! ఈ విషయం గురించి మాట్లాడడానికే రాజ్‌ను పిలిపించాడు శ్రీరామ్. రాజ్‌కూ ఈ విషయం అర్థమవుతూనే ఉంది. మెల్లిగా మాటల మధ్యలో ఎక్కడా తన మోసం సంగతి బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఇక అది బయటకు రావడమే ఆలస్యం, తనతో పాటు తెచ్చుకున్న ఓ తుపాకీని శ్రీరామ్‌కు గురిపెట్టాడు రాజ్. ఠప్మంటూ బుల్లెట్ బయటకొచ్చింది. శ్రీరామ్ అక్కడికక్కడే కూలబడిపోయాడు. సాక్ష్యాలేవీ లేకుండా చూసుకున్నాడు రాజ్. అంతకుముందు రోజు ఒక షో కోసం వాళ్లు రెడీ చేసి పెట్టుకున్న సూసైడ్ ఆడియో క్యాసెట్ ఒకటి వెతికిపట్టి టేప్ రికార్డర్లో వేశాడు. ఆ టేప్ రికార్డర్‌ను శ్రీరామ్ ఎడమ చేతిలో పెట్టాడు. కుడిచేతిలో గన్ పెట్టాడు. అందరూ ఆత్మహత్య అనుకునేలా సెటప్ చేసి పెట్టుకున్నాడు. తర్వాతి రోజు ఉదయం పేపర్ బాయ్ శ్రీరామ్‌ను శవంలా చూసి పోలీసులకు ఫోన్ చేశాడు. ఇన్స్పెక్టర్ భరత్, అతడి టీమ్ సాక్ష్యాధారాలు వెతకడం ప్రారంభించింది. టేప్ రికార్డర్‌ను ఆన్ చేయగానే, వారికి శ్రీరామ్ గొంతు వినిపించింది. ‘‘నా చావుకు ఎవరూ కారణం కాదు. ఈ జీవితం నాకు నచ్చడం లేదు. ఇక్కడ ఉండటం అస్సలు నచ్చడం లేదు. భరత్.. టేప్ రికార్డర్లో వినిపించేదంతా శ్రద్ధగా విన్నాడు. సూసైడ్ నోట్ అయిపోగానే బుల్లెట్ బయటకొచ్చిన శబ్దం వినిపించింది. ‘‘ఇది ఆత్మహత్య కాదు. హత్య’’ అన్నాడు భరత్. అతడి టీమ్ అంతా వింతగా చూస్తూ నిలబడింది. రాజ్ ఏడుస్తూ.. ‘‘అయ్యో! ఆత్మహత్య చేసుకునే అవసరం ఏమొచ్చిందిరా?’’ అంటూ అప్పుడే ఇంట్లోకి వచ్చాడు. భరత్‌కు వెంటనే రాజ్‌ను విచారించాలన్న ఆలోచన వచ్చింది. అసలు శ్రీరామ్ది ఆత్మహత్య కాదు, హత్య అని భరత్ ఎలా గ్రహించాడు? జవాబు: శ్రీరామ్ స్వయంగా టేప్ రికార్డర్లో తన సూసైడ్ నోట్‌ను రికార్డు చేసి ఉంటే, ఆ క్యాసెట్ మొదట్నుంచీ ప్లే అయ్యే అవకాశమే లేదు. చనిపోయిన వ్యక్తి రివైండ్ చేయడమైతే కుదరని పని. కాబట్టి ఎవరో ఇదంతా ప్లాన్ ప్రకారమే చేశారని భరత్ అంచనాకు వచ్చేశాడు. -
ఆ కెమిస్ట్రీ మా వారికి నచ్చింది
ఒకప్పటి పాపులర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ బాలీవుడ్లో మళ్లీ బిజీ అవుతున్నారు. పెళ్లి తర్వాత దాదాపుగా సినిమాలకు దూరమైన మాధురీ మళ్లీ ఇప్పుడిప్పుడే అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. ఇటీవల ’యే జవానీ హై దీవానీ’ చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్‌తో అదరగొట్టిన మాధురీ తాజాగా ‘దేడ్ ఇష్కియా’చిత్రంలో నటించారు. ఇది పూర్తి వినోదాత్మక చిత్రమని, ఈ సినిమా ద్వారా సిల్వర్ స్క్రీన్‌పై మళ్లీ కనిపించడం తన భర్త శ్రీరామ్ నేనేకు చాలా సంతోషం కలిగించిందన్నారు. ఆ చిత్రం ప్రోమో, ‘హమారీ ఆతరియా’ పాట శ్రీరామ్‌ను ఆకట్టుకుందని, ముఖ్యంగా నసీరుద్దీన్‌షాతో కెమిస్ట్రీ తన భర్తకు బాగా నచ్చిందని మాధురి తెలిపారు.