‘‘మంచినీరు ఇస్తున్నట్టు మభ్యపెట్టి ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మా అనుమతి లేకుండానే మా పొలాలు తీసుకుంటామంటున్నారు. 85 రోజులుగా పోలీసులతో మమ్మల్ని చిత్ర హింసలు పెడుతున్నారు. ఫ్యాక్టరీ వల్ల మా జీవితాలు సర్వనాశనమవుతాయి. పొలాలు తీసుకుంటే మేమెక్కడి పోవాలి. ప్రాణాలు పోయినా సరే ఫ్యాక్టరీ పెట్టనీయం. మీ అండ మాకు కావాలి’’ అంటూ దివీస్ ప్రతిపాదిత గ్రామ ప్రజలు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వద్ద తమ కష్ట, నష్టాలు చెప్పుకొన్నారు