దివీస్‌పై ఆగని పోరు | divis villagers rally | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 24 2017 6:57 AM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM

కోన ప్రాంతంలో రైతులు సాగులో ఉన్న భూములతోపాటు హైకోర్టు స్టేటస్కో భూముల్లోకి వెళ్లేందుకు మార్గం లేకుండా దివీస్‌ యాజమాన్యం ప్రహరీ నిర్మాణాలు చేపట్టడంతో సీపీఎం ఆధ్వర్యంలో గురువారం బాధిత గ్రామాల ప్రజలు తమ భూముల్లోకి ప్రవేశించేందుకు ఉప్పెనలా ఎగిసిపడ్డారు. ఇప్పటివరకూ జరిగింది చాలు ఇకపై మీ ఆటలు సాగనివ్వమంటూ ఆగ్రహించారు. దివీస్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా బాధిత గ్రామాలైన పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం, నర్శిపేట తదితర గ్రామాల ప్రజలు కొంతకాలం నుంచి ఉద్యమిస్తున్నారు. దివీస్‌ను ల్యాబొరేటరీస్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తూ, ఈ ప్రాంతంలో దీర్ఘకాలంగా సాగు చేసుకుంటున్న భూములను ఖాళీ చేసేది లేదంటూ కొంత మంది రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో స్టేటస్కో పొందారు. మరికొంత మంది ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం తీసుకోకుండా గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాల ప్రకారం భూములను సాగు చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రాంతంలో దివీస్‌ యాజమాన్యం బలవంతంగా ప్రహరీ నిర్మాణాన్ని ప్రారంభించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement