తగరపువలస, న్యూస్‌లైన్: సైక్లింగ్‌కు వెళ్లిన దివీస్ జీఎం గుండెపోటుతో మృతి చెందారు. పర్యావరణ అవగాహనలో భాగంగా చిప్పాడ దివీస్ లేబొరేటరీ యాజమాన్యం ఆదివారం విశాఖ నుంచి పూసపాటిరేగ వరకు సైక్లింగ్ కార్యక్రమం చేపట్టింది. కంపెనీ జనరల్ మేనేజర్ దివి సత్యచంద్ర(46) సహచరులు, సిబ్బందితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. గమ్యస్థానం పూసపాటిరేగ చేరుకొని విశ్రమించే క్రమంలో సత్యచంద్ర గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈయన కంపెనీ ప్రారంభం నుంచి చిప్పాడ యూనిట్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.