అవసరమైతే తాను కూడా వచ్చి ఇక్కడ కేసులు పెట్టించుకుంటానని, దివీస్ బాధిత ప్రజలందరికీ అండగా ఉంటామని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దివీస్ ఫార్మా సంస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు స్థానిక ఎమ్మెల్యే మీద 22 కేసులు పెట్టారని, వాటిలో 7 హత్యాయత్నం కేసులని చెప్పారు. అసలు వీళ్లకు హత్యాయత్నం కేసులంటే ఏంటో తెలుసా అని ఆయన ప్రశ్నించారు..