ఔషధ కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్ సెప్టెంబర్ క్వార్టర్‌లో నికరలాభం 18.6 శాతం తగ్గి రూ.493 కోట్లు దక్కించుకుంది. ఈపీఎస్ 18.56 శాతం తగ్గి రూ.18.6 నమోదైంది. టర్నోవర్ 3.6 శాతం పెరిగి రూ.1,934 కోట్లకు చేరుకుంది. ఏప్రిల్–సెప్టెంబర్‌లో టర్నోవర్ 7 శాతం పెరిగి రూ.4,277 కోట్లు, నికరలాభం 2.75 శాతం అధికమై రూ.1,195 కోట్లు దక్కించుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే దివీస్ షేరు ధర బీఎస్‌ఈలో సోమవారం 8.85 శాతం తగ్గి రూ.3,413.70 వద్ద స్థిరపడింది.
చదవండి: Dropout Chaiwala: విదేశాలలో చదువు మానేసి.. కాఫీలు, టీలు అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నాడు!
Comments
Please login to add a commentAdd a comment