ముంబై: ఫార్మా కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్ సెప్టెంబర్ త్రైమాసికంలో అంచనాలకు మించి రాణించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కంపెనీ నికరలాభం రూ.510 కోట్లుగా నమోదైంది. 2023–24 ఇదే త్రైమాసిక లాభం రూ.348 కోట్లతో పోలిస్తే ఇది 46% అధికం.
మొత్తం ఆదాయం రూ.1,909 కోట్ల నుంచి 22.5% పెరిగి రూ.2,338 కోట్లకు చేరింది. పన్నుకు ముందు లాభం (పీబీటీ) 54% వృద్ధి చెంది రూ.469 కోట్ల నుంచి రూ.722 కోట్లకు చేరింది. మార్జిన్లు 25% నుంచి 31 శాతానికి పెరిగాయి. ఈ క్యూ2లో విదేశీ మారక ద్రవ్య లాభం (ఫారెక్స్ గెయిన్) రూ.29 కోట్లుగా ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగం (ఏప్రిల్–సెప్టెంబర్)లో కంపెనీ మొత్తం ఆదాయం రూ.4,640 కోట్లు ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో మొత్తం ఆదాయం రూ.3,854 కోట్లుగా ఉంది. నికర లాభం రూ.704 కోట్ల నుంచి 33% అధికమై రూ.940 కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment